రాజమండ్రి

ఆపద - మమత ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బయటంతా చిమ్మ చీకటి అంధకారాన్ని చీల్చుకుంటూ రైలు దూసుకుపోతుంది. మూడురోజుల నుంచి నిద్ర సరిగా లేకపోవటంతో మత్తుగా పట్టేసింది.
‘అమ్మా’ ‘అమ్మా’ అంటూ పిల్లలు కేకలు పెట్టడంతో హఠాత్తుగా మెళుకువ వచ్చేసింది. నిద్ర నుంచి లేవడం వల్ల సరిగా అర్ధం కాలేదు. బోగి దగ్గర ఇద్దరు పిల్లలు ఏడుస్తూ అరుస్తున్నారు. పిల్లల తల్లి కదులుతున్న రైలు నుంచి దూకేసిందేమోనని అనుమానం వేసింది. మెళుకువ వచ్చి దగ్గరకెళ్లి పలకరించే వరకు అసలు విషయం బోధపడలేదు.
తరచుగా జరిగే సంఘటనలుగా భావించడం వల్ల పిల్లల్ని వదిలి తల్లి ఆత్మహత్య చేసుకుందేమోనని గుండె కాస్త వేగంగా కొట్టుకుంది. ఇద్దరూ ఆడ పిల్లలు. పది సంవత్సరాల లోపు వయస్సు. ఏడ్వడం వల్ల మొఖం కందిపోయి ఉంది. భయం భయంగా దిక్కులు చూస్తూ గుక్కపెట్టి ఏడుస్తున్నారు.
తల్లి మనసు ఆగక ఇద్దర్ని చెరో రెక్కల సందుకి యిమిడ్చుకొని ఊరడించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతలో పక్క బెర్తుల్లో ఉన్న నలుగురు పోగయ్యారు. ఎటుచూసినా ఏమి కనపడని కటిక చీకటి. స్టేషను దాటేయడం వల్ల వేగం పుంజుకుని పరుగులు పెడుతుంది రైలు. ఊరడించి కాస్త లాలించడం వల్ల స్థిమితపడ్డ పెద్దపిల్ల మనలోకి వచ్చింది. బ్యాగ్‌లో ఉన్న మంచినీటి బాటిల్ తీసి చెరో గుక్కెడు తాగించాను.
చిన్నపిల్ల ఇంకా అమ్మా అమ్మా అని వగరుస్తుంది. ఇంతలో ఒకాయన కలగజేసుకుని ఓ చిన్న స్టేషను దాటాము అక్కడ దిగి ఉంటుంది వీళ్ల అమ్మ అని చెప్పడంతో పెద్ద పిల్ల వెంటనే కలగజేసుకుని అమ్మ దిగిపోయింది.. మేం దిగలేకపోయాం అంటూ అసలు విషయం బయటకు చెప్పింది.
ఈ రైలు స్పెషల్ ట్రైన్ మెయిన్ స్టేషన్‌లల్లో తప్పితే మిగిలిన చోట్ల ఆగదు. బోగిలో ఉన్న ఇతర ప్రయాణికులు ఏమి జరిగిందోనని ఆత్రుతగా వచ్చి అడిగి తెలుసుకుంటున్నారు. తలొకరు వచ్చి ఒకో మాట మాట్లాడటంతో వచ్చిన వాళ్ల వంక అడిగిన వాళ్ల వంక బేలగా చూస్తున్నారు.
వాళ్ల మధ్య నుంచి ముందు వాష్ బేసిన్ దగ్గరకు తీసుకెళ్లి మొఖం కడిగి అనునయిస్తేనే కాని అమ్మ దిగిపోయిందనే భయం నుంచి తేరుకోలేదు.
ఏం పేరు తల్లి, ఏం చదువుతున్నావ్ గుండ్రటి మొఖం, బూరి బుగ్గలు, నిండుతనం తెచ్చాయి. అడుగుతుండగానే ముద్దొచ్చిన పసితనం.
‘సరళ’ చాలా స్పష్టంగా చెప్పింది పెద్దపిల్ల, ‘మరి చెల్లి పేరో...’ చక్కని సమాధానానికి సంధించిన మరోప్రశ్న.
‘సుమిత్ర’ ముగ్ధత్వానికి మైత్రి ఉందన్న సత్యం చెప్పినట్టు సరళ జవాబు. ఇద్దరు స్థిమిత పడ్డాక ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్లాలి? అడిగాక ఒక నమ్మకం వచ్చి చేరువైంది. సుమిత్ర అయితే ఒడిలోకి చేరిపోయింది కువకువలాడే పక్షిలా.
హైద్రాబాద్‌లోనే ఎక్కాము. సంక్రాంతి సెలవలకు అమ్మమ్మ దగ్గర నుంచి వస్తున్నాం. ఖాజీపేటలో దిగాలి. అభయం దొరికిందన్న ఆనందంతో సరళ చెప్పింది. ఖాజీపేటకు పక్కనే ఉన్న చిన్న గ్రామం ‘పాలెం’ వాళ్ల స్వగ్రామం. ఖాజీపేటలో ఆగదు ‘స్లో’ అవుతుంది అంటే ఆ గడువులో తల్లి దిగి పిల్లల్ని దింపలేకపోయింది అదీ విషయం. ఎవరు మట్టుకు వాళ్లు వారి బెర్తుల వైపు కదులుతున్నారు. నేను, నా ఎదుట బెర్తు పెద్దాయన ఒకరు పిల్లల బాధ్యత తీసుకున్నాం.
మనిషి ఎంత దూరమున్నా మనసును దగ్గర చేసే మొబైల్ అక్కరకొచ్చింది. అమ్మ సెల్ నెంబరు తెలుసా అనగానే ఇద్దరూ ఒకేసారి నోటల్లో ఉన్న పది అంకెలు లయబద్ధం చేశారు. ఆ నెంబరు నా మొబైల్‌లో నోట్ చేసుకొని రింగ్ ఇచ్చా డయల్ అవుతుంది. కట్ అయింది. నెట్‌వర్క్ ప్రాబ్లమ్ అనుకుంటా మళ్లీ డయల్ చేసా. వెంటనే ఆడ గొంతు ఆందోళనతో ‘హ.. లో ఎ..వ..రండీ’ ఆత్రంగా జీరబోయిన గొంతులో పలికింది.
‘అమ్మా మీరు రాజ్యలక్ష్మి గారా! కంగారు పడకండి’ అభయహస్తమిచ్చిన దేవతలా ఓ వరం ప్రసాదించి, పిల్లలు నా దగ్గర క్షేమం ఉన్నారు. వీళ్లను ఎలా అప్పగించమంటారు? కట్ అయిపోయింది ఫోన్. ప్రయత్నించే కొద్దీ దొరకడంలేదు. నెట్‌వర్క్ అందటంలేదు. పిల్లల్ని ఏమి చేయాలో పాలుపోవటంలేదు. రాత్రి 12, ఒంటి గంటో టైము అవుతుంది. ఆమె ఫోనా దొరకడంలేదు. ఇదే మొదటిసారి ట్రైన్‌లో ఒంటరి ప్రయాణం రాత్రిపూట ఎప్పుడూ ఒకర్తెను బయటకు రాను. హైద్రాబాద్‌లో నా చెల్లెలి కూతురు పెళ్లి. ధనుర్మాసంలో ముహూర్తాలుండవు. వాళ్లు కిరస్తానీయులు సంప్రదాయాలతో నిమిత్తం లేకుండా పాదర్‌గారు నిర్ణయించిన తేదీయే తేదీ. అలా నిశ్చయపరచిన పెళ్లి. భార్యాభర్తలు ఇద్దరూ రావాలంటే కలిసే వెళ్లాము. అయితే ఆయన ఆఫీసు పని ఉంది అంటే నేను బయలుదేరి వచ్చేశా. అప్పటికే నాలుగురోజులు అయిపోయింది. మొఖం మొత్తేసి నేనూ ఉండలేక బయల్దేరేశా.
మొబైల్ మోగుతుంది బహుశా ఆమె అయి ఉంటుంది. వెంటనే లిఫ్ట్ చేసి గ్రీన్ బటన్ నొక్కా. ‘హలో, హలో’ మళ్లీ కట్. స్క్రీన్ మీద సిగ్నల్ పోల్స్ చూసి నేనే చేశా ‘హలో నేను రాజ్యలక్ష్మినండీ..’ కట్ అయిపోయింది. విజయవాడలోనే ఆగుతుందట. సరళ అమ్మ నిదానపడినట్టుంది కాస్త హుషారుగా చెప్తుంది.
‘ఎక్కడ అప్పగించమంటారు? ఎవరన్నా స్టేషన్‌కు వస్తారా?’
ఎవరన్నా పురమాయించారేమోనని అడిగా ‘లేదండి అక్కడ రైల్వే పోలీసులకు చెప్పి వాళ్ల వద్ద ఉంచమని ఈ స్టేషను మాస్టారు చెప్పారు.’ రాజ్యలక్ష్మి దిగిన వెంటనే స్టేషన్ మాస్టార్ దగ్గరకెళ్లి మొరపెట్టుకుని ఉంటుంది. మరో గంటలో రైలొకటి ఉందట, దానికి బయల్దేరి వస్తానంది.
మనసు ఎంత కలవరపడి ఉంటుందో మనిషి చాలా యాతనపడాలి. ముందస్తు జాగ్రత్త లేకపోతే... ఎంత ప్రమాదం జరిగేది. సగటు మనిషి బతుకు చిత్రమే అంత. కుటుంబ స్థితిగతులు తక్షణ పరిస్థితులు తెలియనితనం లాంటివన్ని కష్టాలు తెచ్చిపెడ్తాయి. ఎందుకో అంతరంగం ఒక్కసారి మూలిగింది.
పరిస్థితుల్ని ఎదుర్కోవడమంటే ఇదే. నా మనసు ఊరటనిచ్చింది. చేతనైన మంచి పనికి ధైర్యాన్ని మనసేనిస్తుంది. ఓ కృతనిశ్చయానికి నాంది పలికింది.
పిల్లలు సరళ, సుమిత్రలు బాగా చేరువైనారు. వదిలిపోవడం లేదు. పిల్లలతో ఇట్టే కలిసిపోవడం తన నైజంకావడంతో ‘ఆంటీ’ ‘ఆంటీ’ అంటూ పిల్లలు చెప్పే విషయాలు కబుర్ల మేతకు అంతులేకుండాపోయింది. విజయవాడ స్టేషన్ రాగానే పిల్లల్ని తీసుకొని ఆర్పీఎఫ్ పోలీసులకు జరిగిన విషయం చెప్పి వాళ్లకు అప్పగించాను. ఇక్కడ ఎక్కువసేపు ఆగుతుందని పెద్దాయన చెప్పడం వల్ల గాబరా లేకుండా ఆ పని చేశాను. రెండు బిస్కెట్ల ప్యాకెట్లు కొనిచ్చి వాళ్లకు వీడ్కోలు చెప్పి భారంగా వచ్చేశాను.
బోగిలో పెద్దాయన నా సామాన్లు చూస్తానన్న హామీ కుదుటపరిచింది. కిటికీ దగ్గరే కూచుని మావంకే చూస్తున్నారనుకుంటా. ‘కాలు బాగోలేదు నేనే వద్దునమ్మా’ అంటూ తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. అదే ఉపకారపు మనసు.
చిన్నపిల్లల్ని వదిలి రావడం కష్టంగా తోచింది. సీట్లోకి వచ్చి కూచున్నానే గాని దృష్టంతా ఆ పిల్లల మీదే ఉంది. రైలు దిగకముందే పిల్లల పేర్లు రాజ్యలక్ష్మి నెంబరు చిన్న కాగితం మీద రాసి పోలీసుకిచ్చారు. సరళ అమ్మకు కాల్‌చేసి అప్పగించిన విషయం చెప్పాను. కష్టాల చెంత ఉన్నప్పుడు చింతించకుండా దానికి ఉపయోగపడే మార్గాలు వెదికి సాయం చేయడం మిన్న.
బెర్తు మీద ఉన్నానేకాని నిద్ర రావడంలేదు. సెల్ తీసి రాజ్యలక్ష్మికి కాల్ చేశా బయలుదేరారా? లేదా? అని.
నేను ఏలూరు దగ్గరకు చేరుకుంటున్నాను. ఆమె ఎంత దూరంలో ఉందోనని మళ్లీ కాల్ చేశా తను దగ్గరకొచ్చేశానని చెప్పడంతో ఉగ్గబరచుకున్న మనసు కాస్త నిమ్మళపడింది. పిల్లల్ని తీసుకెళుతూ ఆమె ఫోన్‌చేసి తిరుగు ప్రయాణానికి సిద్ధం అవుతున్నట్టు చెప్పడం వల్ల నా బెంగ తీరింది. నేను చేసిన ఆ చిన్న సాయానికి ఫోన్ చేసిన ప్రతీసారీ శ్రమిచ్చాను థ్యాంక్స్‌ంటూ ఒకటే కృతజ్ఞతలు. మంచి పనికి శ్రీకారం చుట్టాననుకోవడం లేదు. సహకారం చేశాననుకుంటాను అంతే.
*
- పి పద్మాంజలీదేవి
కృష్ణనగర్, రాజమండ్రి
సెల్: 9642489244
**

మూడు ‘డబ్ల్యు’ల మాయ!
*
అమెరికా నుంచి వచ్చిన ఆనంద్ తల్లిదండ్రులను కూడా చూడకుండా సరాసరి స్నేహితుడు అరవింద్ ఇంటికి వచ్చాడు. బాల్కనీలో కూర్చుని ఎదురింటి వంక ఆశ్చర్యంగా చూశాడు. ‘ఇక్కడ డాబా వుండాలి కదా. ఆ పెద్దాయన ఇంత పెద్ద బిల్డింగ్ ఎలా కట్టేడు? బిల్డర్‌కి కాని ఇచ్చాడా?’ అని అడిగాడు.
‘అదేం లేదు. పెద్దావిడ పద్మావతి గారు చనిపోగానే ఆయన జబ్బుపడ్డారు. ఆయన్ని చూసుకోడానికి రంజని అనే పిల్లకి, ఒక డాక్టర్‌కి బాధ్యత అప్పగించాడు కొడుకు. డాక్టర్‌కి రంజని చాలా నచ్చింది. పెద్దాయన ట్రీట్‌మెంట్ జరుగుతున్న టైమ్‌లోనే మంచి మంచి టానిక్స్ అవీ తాగి నాలుగునెలల్లోనే రంజని చాలా అందంగా మారింది. ఆమెకు ఒక అపార్ట్‌మెంట్ కొనిచ్చారు. కొన్నాళ్లకి డాక్టర్ గారింట్లో దొంగలు పడి ఆయన భార్యని చంపి వందకాసుల బంగారం దోచుకుపోయారు. మరో ఆరు నెలలకి భార్యగా రంజని డాక్టర్ గారి ఇంట్లోకి ప్రవేశించింది. ఇదంతా తెలిసి చలపతిగారు డాక్టర్ తన దగ్గర వుంచిన ఓ సిస్టర్‌ని కూతురుగా భావించి ఫిజియోథెరపీ ఇవ్వడానికి వచ్చే కుర్రాడికిచ్చి పెళ్లిచేసి తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చాడు.
చలపతి గారబ్బాయి అమెరికా నుంచి వచ్చి తండ్రి పూర్తిగా కోలుకుని హుషారుగా వుండటం చూసి వారికి థేంక్స్ చెప్పాడు. తండ్రి తదనంతరం ఆ ఇల్లు సిస్టర్ రమ్యకి చెందేలా వీలునామా రాయించి తండ్రి బాధ్యతని ఆ యువ దంపతులకిచ్చి ఆనందంగా తిరిగి అమెరికా వెళ్లిపోయాడు.
స్థానికులంతా ఆ ఇంట్లో పద్మావతిగారు చనిపోయినప్పటి నుంచి జరిగేవన్నీ తమిళనాడు రాజకీయాలను మీడియా ద్వారా దేశమంతా గమనించినంత ఆసక్తిగా గమనిస్తూ వచ్చారు. వీలునామా రాసిన నెలరోజులకే మార్నింగ్ వాక్‌కెళ్లిన చలపతిగారిని ఒక పోలీస్ జీప్ ఢీకొనటంతో చనిపోయారు.
కొడుకు వచ్చి తండ్రి కర్మకాండలు చేసి వెళ్లిపోయాడు. బిల్డింగ్ రమ్య సొంతమైంది. ఆ యాక్సిడెంట్ జరగడానికి కారణమైన ఆ ఎస్‌ఐ తరచూ వచ్చి రమ్యతో స్నేహం చేసి ఆ డాబా పడగొట్టి అందమైన ఈ మూడంతస్తుల బిల్డింగ్ కట్టించాడు. మూడో అంతస్థులో ఎస్‌ఐ గృహంలోకి రమ్య చేరింది. ఫిజియోథెరపీ కుర్రాడు కనిపించకుండా పోయాడు. ఎక్కడన్నా ఉన్నాడో, అసలు ఈ భూమిమీద ఉన్నాడో, లేడో? తెలియదు. ఒకరోజు టెర్రస్‌పై ఫుల్‌గా మందుకొట్టి పైనుంచి కిందపడి ఎస్‌ఐ మరణించాడు. ఇనె్వస్టిగేషన్ చేసే ఎసిపి రమ్యని చాలా ఇబ్బంది పెట్టి ఆ బిల్డింగ్‌కి ఓనర్‌గా మారాడు. చిన్నప్పుడు చదివిన ‘టెంపోరావ్ డిటెక్టివ్’ గుర్తుకొచ్చింది. మూడు డబ్ల్యులు దీనంతటికీ కారణం. వెల్త్, ఉమన్, వైన్’ నవ్వుతూ వివరించాడు అరవింద్.
*
- జ్యోతిర్మయి