ఉత్తర తెలంగాణ

తొలి పొద్దు నడక ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలి పొద్దు నడక
కవిత్వపు నడక వంటిదే
ఆరంభంలో మెల్లగా
ఆపైన వడివడిగా
సాగిపోతూనే ఉంటుంది
ప్రకృతిలోని పరవశత్వం
పైరగాలిలోని నిర్మలత్వం
కలగలిసిన నడక అది!
స్వేచ్ఛగా ఎగిరే పక్షిలా
విహరించే నడక అది!
లయాత్మకంగా సాగే ఆ నడక
లావణ్యాన్ని రంగరించుకొన్న
లేత కవితలా
దర్శనీయవౌతుంది
అప్పుడప్పుడు మలుపులు తిరుగుతూ
మధురంగా సాగే ఆ నడక
బాణుని వచనంలా
జయదేవుని గీతంలా
కాళిదాసు శ్లోకంలా
పోతన పద్యంలా
మనస్సును హరిస్తూ
ఆరోగ్యాన్ని వరిస్తుంది!
*
- డా. అయాచితం నటేశ్వర శర్మ, కామారెడ్డి, సెల్.నం. 9440468557
**

కవిత్వం రాస్తే..!
*
కవిత్వం రాస్తే కాసులు కురువవు
ఆత్మకు సంతృప్తి
మనఃస్సునా మీలకు కాస్తం విముక్తి
తాదాత్మ్యం దాని పరమావధి!
చిగురుగా వున్నప్పుడే
అందం, సౌకుమార్యం, నవ్యత
ముదిరి ఆకుగా మారితే..కరుకు!
తొలకరిలో రాసిన కవిత్వానికి
పసిపాప పసిడి నవ్వుల స్వచ్ఛత
రాస్తూ, రాస్తూ..రాటుదేలితే
అతి విశ్వాసంతో ఆత్మ వంచనం!
ముదిరే వయసుతో నిమిత్తం లేని మనసు
పండిపోయినా కుళ్లిపోని అనుభవం
పరిపక్వత పరాకాష్టకు జేరితే..
కవిత్వంలో తొణికిసలాడాల్సింది
పంచామృతాలే
కనక కలశం వొంపే కాంతి ధగధగలే!
*
- ఆచార్య కడారు వీరారెడ్డి
సెల్.నం.789336663
**

వౌనం!
*
మాటల యుద్ధంతో
కుదుర్చుకున్న సంధిలాంటిది వౌనం!
మనసులోని మథనం చిలికితే
వచ్చే వెన్నలాంటి ముచ్చట్లకు..
వేసిన తాళం కప్పలాంటిది వౌనం!
ప్రభాతానికి..
సంకేతంలా వున్న
కుక్కుట వధ లాంటిది వౌనం!
వౌనం..
ఓ పదునైన కత్తిపై సాములాంటిది
వౌనాన్ని అధిగమించడమంటే
మరో జన్మను స్వాగతించడమే!
వౌనం ఓ తపస్సు
మానవ జన్మకు ఉషస్సు!
*
- గంప ఉమాపతి
కరీంనగర్, సెల్.నం.9849467551
**

చీకటి భాస్కరులు
*
ప్రొద్దునే్న లేచి పొద్దు పోయేదాకా
వంచిన నడుము
ఎత్తకుండా
ఎండనక, వాననక
చలైనా లెక్కచేయక
దిన పత్రిక,
పాల ప్యాకెట్ తేడాలేక
ఇంటింటికీ తిరుగుతూ
ఒంట్లో ఓపిక లేకున్నా,
శరీరం మొరాయిస్తున్నా
తొందరగా అందించాలని,
పేపర్ కిందనుంచి విసిరితే
ఆ బహుళ అంతస్తులో
మొక్కలు విరిగాయనో,
వాచ్‌మెన్ కిచ్చిన పాకెట్
నిన్నటిదనో,
పేపర్ తడిసిందనో,
పాలు విరిగాయనో,
తిడుతున్నా చెవి దూరనీయక
రివ్వున జివ్వున వీచే గాలిని
చీల్చుకు సైకిల్‌పై తిరిగే
పసితనం వసివాడని చిన్నపిల్లలూ..
ఎంత కష్టం మీకు?!
మీ బ్రతుకు
పంజరాన బందీయై
ఎన్నాళ్లు యిలా?
ఇంకా ఎనే్నళ్లు యిలా???

- చామర్తి అరుణ, హన్మకొండ, సెల్.నం.9000683826
**

విజయఫలం!
*
ఏదో ఎందుకో ఎప్పుడో
ఏమీ చెప్పలేము ఈ జీవనయానంలో
మన చుట్టూ ఉన్న ప్రపంచంలో
ఒక్కోసారి అంతా అయోమయం!
చిక్కువడిన దారాల్ని విడదీసినట్టు
అలుముకున్న గందరగోళం స్థితుల్ని
విప్పుకునే తెరువుల్ని శోధిస్తూ నేనూ..
సకల ప్రయత్నాలు విఫలమయ్యాయని
బెంగపడి ముడుచుకుని కూర్చోలేదు!
మెరుపులాంటి ఆలోచనలకు తెరవేయలేదు
దొరుకుతున్నాయి పరిష్కారాల ‘కీ’లు
సంకల్పం, చిత్తశుద్ధి ..
ఎడతెగని శ్రమతో..
న్యూనతల చెత్తని
గొయ్యిలో దగ్ధం చేశాను
వాస్తవాల్ని సరిగ్గా బేరీజు వేసుకున్నాను
తప్పిన అంచనాల్ని సరి చేసుకున్నాక
సఫల మనోరధునిగా
సరైన పరిపక్వ దశలో విజయఫలం
నా సొంతమైంది!!
*
- డాక్టర్ దామెర రాములు, నిర్మల్, సెల్.నం.9866422494

**

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. ౄళూఖఔఖరీశూబ్ఘశజ్ద్ఘూఇ్ద్య్యౄజ.శళఆ