దక్షిన తెలంగాణ

మానవత్వం పరిమళించిన వేళ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాత్రి పదిగంటలు. శారద పనంతా ముగించుకొని బెడ్ రూంలో అడుగుపెట్టింది.
భర్త సుధాకర్ రావు ఆఫీస్ ఫైళ్లతో తలదూర్చి తలమునకలవుతున్నాడు. ఇప్పుడు పలకరిస్తే విసుగు పడతాడని దిండుపై తలవాల్చింది. రుక్మిణత్తయ్యకు మందులిచ్చానా? లేదా? గుర్తు చేసుకుని ఇచ్చాననిపించాక, కాళ్ల దగ్గరి రగ్గు తీసి కప్పుకుంది. కంఠం వరకు కప్పుకున్న రగ్గు చెంపలను తాకింది. ఎంత హాయిగా వుందో! ఆ జ్ఞాపకం...
శారద చేతులతో రగ్గును స్పృశిస్తూ గతంలోకి జారుకుంది.
***
ఆ రోజు తనకు మాత్రం సెలవిచ్చారు. పిల్లల్ని, భర్తను స్కూలుకు, ఆఫీసుకు పంపించి, హమ్మయ్య అనుకుంటూ హాల్లోకి వచ్చి సోఫాలో కూచుని పేపరు చేతిలోకి తీసుకుంది శారద.
ఇంతలో లాండ్ ఫోన్ గణగణమంటూ మోగింది.
‘హాలో!..నమస్తే..ఎవరు కావాలండీ!’
‘నేను!..శారదగారూ! లక్ష్మిని. కంగ్రాట్స్! మీరు పంపిన బయోడేటా, వివరాలు, మీ సాహితీ కృషి అన్నీ చూశాను. నేనే కాదు, అవార్డుకు సెలక్టు చేసే జడ్జస్ అంతా చూశారు. మీరు శతవసంతాల అంతర్జాతీయ మహిళా సంబరాల సందర్భంగా ‘ఉత్తమ మహిళా అవార్డు’కు ఎంపికయ్యారు. మీరు తప్పకుండా స్వయంగా వచ్చి ఈ అవార్డు స్వీకరించాలి. మరోసారి అభినందనలతో సెలవు..’ ఫోన్ పెట్టేసింది లక్ష్మి.
శారద ఆనందానికి పట్టపగ్గాలు లేవు. అవార్డులు తనకు కొత్తేంకాదు..అయినా ఒంగోలులో ‘అవార్డు’కు సెలక్ట్ కావడం ఇది రెండవసారి..ఒక్కటే చిక్కు వచ్చిపడింది. తాను ఒంటరిగా ఎలా వెళ్తుంది? ఎవరో? ఒకరు తన వెంట రావలసిందే! ఆలోచిస్తూ కూచున్న శారద గోడ గడియారం వైపు చూసి, పిల్లలు స్కూలు నుండి వచ్చేసమయమైంది అనుకుంటూ ఆలోచనలకు ఫుల్‌స్టాప్ పెట్టింది.
***
‘ఏమండీ! మనం ఒంగోలు వెళ్లాలండి! మీరు ఒక రోజు లీవు తీసుకోండి ఆఫీసులో..’
‘సారీ! శారదా! ఆఫీసులో ఇన్‌స్పెక్షన్ వుంది. నేను రాలేను.’ భర్త మాటలతో నీరు గారిపోయింది శారద.
***
లీజరు పీరియడు స్ట్ఫా రూంలో చిన్నబోయి కూచుంది శారద.
బెల్ అవగానే స్ట్ఫా రూంలో అడుగుపెట్టిన భాస్కర్ రావు శారదవైపు చూశాడు.
‘ఏమండీ! శారద గారూ! అలా చిన్నబోయి కూచున్నారేం? మీరు వౌనంగా ఉన్నారంటే! విచిత్రమే! ఎప్పుడూ గలగలా నవ్విస్తుండే మీరిలా దిగులుగా ఉన్నారేం?’ అన్నాడు.
శారద తన ‘అవార్డు’ గూర్చి చెబుతూ ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్‌ను, భర్తను అడిగానని, వాళ్లెవరూ సుముఖంగా లేరని, ఆ అవార్డును ‘మిస్’ చేసుకోవడం తనకు బాధగా ఉందని చెప్పింది. శారద చెప్పిన మాటల సారాంశం నిన్న భాస్కర్ రావు గట్టిగా నవ్వుతూ, ‘ఓస్! ఇంతేనా! మీకభ్యంతరం లేకపోతే నేను వస్తాను. ఏమంత విచారం!’ సముదాయించిన భాస్కర్‌రావు గారి మాటలతో శారద మనస్సు తేలికపడింది.
ఉదయం తొమ్మిది గంటలకు ఒంగోలు చేరుకున్న శారద, భాస్కర్ రావులు ఫంక్షన్ హాలు చేరుకొని తమకు కేటాయించిన గదిలో స్నానాదికాలు ముగించుకొని, టీ, టిఫిన్లు కానిచ్చి, మీటింగ్ హాలులో కూచున్నారు. పది గంటలకు కార్యక్రమం మొదలైంది. ప్రముఖుల ప్రసంగాలు, కవుల కవితాగానాలు అనంతరం లంచ్ బ్రేక్.
మళ్లీ మూడు గంటలకు యధావిధిగా కార్యక్రమం మొదలైంది. సాయంత్రం వరకు సాగిన మీటింగ్‌లో ఏడు గంటలకు శారదను అవార్డు స్వీకరించమని స్టేజీమీదికి ఆహ్వానించారు లక్ష్మిగారు. కళ్లల్లో ఆనందబాష్పాలతో అపురూపంగా అవార్డు అందుకొని తన సీటు వద్దకు వస్తూ అవార్డును భాస్కర్ రావుకు అందించింది శారద. రాత్రి తొమ్మిది గంటలకు భోజనం అయిందనిపించి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారిద్దరూ. రాత్రి ఒంటి గంటకు రైలు వెయిటింగ్ హాల్లో కూచున్నారిద్దరూ అక్కడంతా, ఆడ, మగవాళ్లు కూచోవడంతో ఎక్కడా స్థలం లేదు. శారద ఎలాగో ఓచోట కూచుంది. ఉన్నట్టుండి ఆమెకు కడుపులో వికారంగా అనిపించి బాత్‌రూం వైపు పరుగెత్తింది. ఓపిక లేక ఓ చోట ముడుచుకొని పడుకుంది. భాస్కర్ రావు శారద దగ్గరగా వచ్చి నిలుచున్నాడు. అతని రెండు చేతులను తన తలపై వేసి గట్టిగా పట్టుకోమంది. ఇదంతా గమనిస్తున్న ఓ స్ర్తి శారద దగ్గరగా వచ్చి గట్టిగా పట్టుకొంది. శారదకు వరుసగా వాంతులు, ఆ స్ర్తినే శారద వెంట వెళ్లి బాత్‌రూం దాకా అనుసరించింది. అంతేకాదు తన వెంట తెచ్చుకున్న రగ్గు శారదకు కప్పింది. తల నిమురుతూ నిలుచుంది. రైలు రానే వచ్చింది. ఏ మాత్రం ఓపిక లేని శారదను దగ్గరగా పొదివి పట్టుకొని ట్రైన్ దాకా వెళ్లి సీటుపై కూచోబెట్టి రగ్గు కప్పింది. ఆమెకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో శారదకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆమెకు తెలుగు రాదు. తనకు ఇంగ్లీష్ రాదు. భాస్కర్ రావు మాత్రం ఆమెకు ‘్థంక్యూ’ అంటూ క్లుప్తంగా చెప్పాడు. అప్పటి నుండి శారదకు ఆ రగ్గు అంటే ప్రాణం.
*
- గరిశకుర్తి శ్యామల
కామారెడ్డి, సెల్.నం.9490189081
**

సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయ, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net