విశాఖపట్నం

పిట్ట కొంచెం... (మినీకథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగాది సందర్భంగా టివిలో ఒక మంచి ప్రోగ్రాం జరుగుతుంది. రామాయణంలో నుండి కొన్ని సన్నివేశాల్ని తీసుకుని వాటిని హాస్యం జోడించి చాలా చక్కగా ఒక్కొక్కరూ చెప్పసాగారు. పది సంవత్సరాల రాధిక కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని అందరినీ ఆకట్టుకుంది. ప్రోగ్రాం అయిపోయింది. అందరూ బయటికి వస్తుంటే ప్రోగ్రాం మేనేజర్ రాధికని చూసి ‘‘చాలా బాగా చెప్పావమ్మా. నీకు రామాయణం అంతా ఇంత చక్కగా ఎవరు నేర్పారు?’’ అంటూ అడిగాడు.
‘‘మా తాతయ్య నేర్పించారు సార్. చాలా మంచి కథలు చెబుతారు’’ అంది రాధిక అమాయకంగా.
‘‘వెరీగుడ్. మీ తాతయ్య, నాన్నమ్మలు మీతోనే ఉంటున్నారా?’’ అంటూ ప్రశ్నించాడు మేనేజర్.
‘‘మీరేం మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడుతున్నది చాలా తప్పు సార్’’ అంది రాధిక.
‘‘అర్థం కాలేదమ్మా’’
‘‘తాతయ్య, నానమ్మ మీతోనే ఉంటున్నారా? అని అడిగింది తప్పు. మీరు తాతయ్య, నాన్నమ్మల దగ్గరే ఉంటున్నారా? అని అడగాలి’’ అంది రాధిక.
ఆ మాటలకు అర్ధం తెలిసి ఆశ్చర్యపోవడం మేనేజర్ వంతు అయింది.
*
- వసంతకుమార్ సూరిశెట్టి, నెల్లిమర్ల జ్యూట్‌మిల్లు కాలనీ,
నెల్లిమర్ల-535217. సెల్ : 8297191810.
**

పుస్తక సమీక్ష
*
అపురూప భావాలు... కోకిలమ్మ పదాలు
*
తెలుగుతల్లి భవనంలో కూనలమ్మ పదాలు వెలుగు దివ్వెలు. కూనలమ్మ పదాలను వెలికితీసిన వేటూరి ప్రభాకరశాస్ర్తీని, వాటిని విస్తృతపరచిన మన ఆరుద్రను మనం ప్రాత:కాలంలో స్మరించుకోవాలి. బాల సాహిత్యపు కోవకు చెందిన కూనలమ్మ పదాలను ఆరుద్ర ప్రభావంతో ఆంధ్ర లోకంలో ఆనాడు ఎందరో రకరకాల మకుటాలతో రాశారు. రాస్తున్నారు కూడా. ఆరుద్రకు తీసిపోని నడకతో అదృష్టదీపక్ కోకిలమ్మ పదాలుగా తెలుగులో వెలువరించారు. భాషాదీప్తి, అంత్యప్రాస ప్రాప్తి, భావవ్యాప్తి కోకిలమ్మ పదాల నిండా పుష్కలంగా కనిపిస్తుంది. మూడవ పాదంలో చివరి ప్రాస పదంపై నిలబడ్డ కోకిలమ్మ పదం గరిమనాభి తప్పని, గొప్ప నడక, ప్రౌఢ పద నిర్మాణం, చదివితేనే ఆ చమత్కారం తెలుస్తుంది. అంత్యప్రాసలు హంస నడకలుగా ఒకచోట కనిపిస్తాయి. ప్రశంస నడతలుగా మరోచోట కనిపిస్తాయి. పదలాఘవం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. చిత్ర కవిత్వం, బంధ కవిత్వం, గర్భ కవిత్వం అన్నింటనీ కుదిస్తే కోకిలమ్మ పదాలు అయ్యాయనిపిస్తుంది. అంత్యప్రాసల పంచులు హృదయద్వానలుగా మనకు వినిపిస్తాయి.
‘ఉగ్రవాదపు కత్తి/అగ్రరాజ్యపునెత్తి/మీద జారిన మిత్తి’ ఈ పదం భాషా పటిమకు మచ్చుతునక. మిత్తి అన్న అంత్యప్రాస అలవోక గమనమే అనడానికి ఈ పదమొక నిదర్శనం.
‘నిండు పున్నమిరేయి/ప్రేమ పెదవుల దోయి/కలిసినపుడే హాయి’ కృష్ణశాస్ర్తీ కూనలమ్మ పదాలు రాసినంత హాయిగుంది ఈ కోకిలమ్మ పదం.
‘దుష్టజన రక్షకులు/శిష్టజన భక్షకులు/పొలిటికల్ తక్షకులు’ ఈ పదంలో మూడవ అంత్య ప్రాస సాధారణ కవి శిక్షకులనో, ప్రేక్షకకులనో అంటారు. కలం బలం గల అదృష్టదీపక్ పొలిటికల్ తక్షకులనడం ఉత్తరోత్తరా బలంగా భావాన్ని చెప్పిన కవిత్వ సరళి, సందర్భంతో ముడిపడ్డ బరువైన అంత్య ప్రాస వింగడింపు, ఉత్తమ శిల్ప నిర్మాణంతో కూడుకున్నవి, వీరిసొత్తు.
‘బెంగాల్ కావచ్చ/వియత్నాం కావచ్చు/విప్లవం కార్చిచ్చు’ అంటారు. అభ్యుదయ భావ సంపదను చాలా పదాల్లో పొదిగారు దీపక్.
‘మార్క్సిస్ట్ విజిగీష్/మార్పుకై రణఘోష/ ఎరుపు శ్రీశ్రీ భాష’ అంటూ శ్రీశ్రీపై ఒక డజన్ చిత్రాలు గీశారు. గురజాడ, గిడుగు, బాపు వంటి వారిపై జీవిత రేఖలను కోకిలమ్మ పదాల్లో చూపించడం చేయి తిరిగిన పద చిత్రకారులకే తెలుసు. అటువంటి కవుల్లో అదృష్టదీపక్ ఒకరు. ఆరుద్ర ఛందస్సులో అదృష్టదీపాలను వెలిగించిన ఈ కవివరేణ్యులు అభినందనీయులు.
*
- కిలపర్తి దాలినాయుడు,
సెల్ : 9491763261.
**

పుస్తక సమీక్ష
*
పరిమళ భావ తరంగాలు
*
ప్రాప్తిస్థానం
శ్రీకాకుళం రోడ్డు,
రాజాం-532127.
వెల : రూ. 100.
ఫోన్ : 97018055597.
*
ప్రధానంగా తరంగాలు అనంత సాగరానికే చెందుతాయి. ఆ సాగర అగాథానికి వెళ్లి ఆణిముత్యాల్లాంటి భావ కుసుమాలను తమ అనుభవసారాన్ని రంగరించి అందించిన ఆంగ్ల కవులు కవితల్లో సూక్తులు జొప్పించారు. వాటన్నింటినీ వెలికి తీసి హృద్యంగా తెలుగు పదాలతో అందించారు దామెర వెంకటరావు. ఈ సూక్తుల కూర్పుకు ‘పరిమళ భావతరంగాలు’ అని పేరు పెట్టారు. ఆంగ్ల కవులందరూ రుషితుల్యులు. ఆంగ్ల కవితా సామ్రాజ్యపు కొలువున సమున్నత స్థానం అలంకరించినవారు. బైబిల్‌తో పాటు అరిస్టాటిల్, సోక్రటీస్, రూసో, షేక్స్‌పియర్, బ్లేక్, బెర్నార్డ్‌షా, టాల్‌స్టాయ్, స్విన్‌బర్న్, వర్డ్స్‌వర్త్, జాన్సన్, షెల్లీ, కీట్స్, హాబ్స్, బర్క్, బైరన్, వోల్టైర్ ఇత్యాదిగా ఎందరో ప్రసిద్ధ కవుల కలాల నుండి జాలువారినవి. వీరందరూ అంతో ఇంతో భారతీయ వైదిక వాజ్మయంతో పరిచయం ఉన్నవారే. ప్రభావానికి తలొగ్గినవారే. లెక్కకు మిక్కిలిగా ఉన్న భారతీయ వైదిక వాఙ్మయ సూత్రాల నుండి 302 సూక్తులను ఎంపిక చేశారు. రామతీర్థగారన్నట్లు ఇవి ‘ముత్యాల స్వరాలు’.
అనువాదం చేయడం కత్తి మీద సామువంటిది. అనువాదకుడు మాతృకనందించిన కవి హృదయంలో ప్రవేశించి ఆ కవిత్వ మాధుర్యాన్ని, భావనా బలాన్ని అందిపుచ్చుకుని తన భాషలో అనుభూతుల్ని అందించగలడు. అంతే కాక ఒక భాషలో ఒక భావానికి అద్దం పట్టిన పదం వేరొక భాషలో సరితూగగల పదం సమకూర్చుకొనడం సామాజ్యమైన విషయం కాదు. పైగా సూక్తులన్నీ జ్ఞానబోధకాలు. మనోరంజకాలు, నిత్య జీవిత సత్యాలు. వెంకటరావు ఆంధ్రాంగ్ల భాషల్లో నిష్ణాతులు. పైగా వృత్తిపరంగా ప్రధానోపాధ్యాయులుగా పని చేసి విశ్రాంతి పొందినవారు. అధ్యాపనలో మెలకువలు తెలిసిన వారు కావడం చేత విద్యార్థులకే కాక తన రచనల ద్వారా పాఠకులకు నిర్దిష్టమైన వ్యక్తీకరణ సామర్థ్యంతో పాటు క్లుప్లంగా, మృదుమధుర శైలిలో సరళ సౌందర్యంతో భావ కుసుమాల పరిమళాలను అందించారు. వీరు ఎన్నుకున్న ఆంగ్ల కవుల రచనల్లో పెక్కింటిని గతంలో ప్రసిద్ధ తెలుగు కవులు కొందరు అనువదించి ఆంధ్ర పాఠకులకు అందించారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అనుభూతి. రావు వాటి జోలికి పోక తమ శక్తి మేరకు ఆయా సూక్తులను ఈ తరానికి అందిచాలన్న తపన ప్రతి అక్షరం సాక్ష్యమిస్తుంది. తిక్కన, పోతన్నలు వ్యాసభారత, భాగవతాలను వెలిగించినప్పుడు పలు సందర్భాల్లో వ్యాసుని భావాలకు మించి రాశారని పండితులంటారు. రావు తను అనువాదంలో మూలకవిని మించి కవితాత్మకంగా భావ సౌందర్యాన్ని అందించడం వీరి అనువాద సరళిలో గమనించవచ్చును. 302 సూక్తులను ఈ చిరువ్యాసంలో పరిచయం చేయడం సాధ్యం కాదు. అందువల్ల ఈ తరం పాఠకులకు స్ఫూర్తిని కలిగించే కొన్ని అనువాదాలను పేర్కొనడం ఔచిత్యమనిపించుకుంటుంది. ప్రతిజీవికి పుట్టుట, గిట్టుట సృష్ట్ధిర్మం. వీటి మధ్య జీవితం ఎలా ఉండాలో నేర్చుకోవలసిన అవసరం ఉంది. లైఫ్ ఈజ్ ఎ పిలిగ్రిమేజ్ ఫ్రం వాంబ్ టు డెత్ ( ఆంగ్ల సూక్తి). తల్లి గర్భము నుండియె తన సమాధి వరకు మనిషి చేసెడి యాత్ర సుమ్ము. మతాలు మానవాళి మనుగడకు ప్రతిబంధకాలు వాటిని గమనించాలంటారు. ఇలా ఎన్నో భావతరంగాలు. దేనికదే సాటి. అవాదకుని ప్రతిభ ప్రతి అక్షరంలో నిక్షిప్తమై ఉంది. అయితే ఇక్కడొక మాట చెప్పుకోవాలి. భారతీయవైదిక వాజ్మయంలో ప్రాచీన రుషులు ఎనె్నన్నో జ్ఞాపబోధకాలు, నీతిసూత్రాలు, నిత్యసత్యాలు మనకందించారు. నేటితరం వారికి అవి తెలియకపోవచ్చు. ఆంగ్ల కవులు భారతీ సాహిత్యాన్ని (వైదిక) ఔపోసన పట్టి తమ రచనల్లో పొందుపరిచారు. వాటిలోని భావకుసుమాలను ఎంపిక చేసి ఆ పరిమళాలను అందించిన వెంకటరావు అభినందనీయులు. ఈ భావరతంగాలలో మకుటాయమనంగా దర్శనమిచ్చేది సర్ వాల్టర్‌స్మాట్ ముత్యాల స్వరం. ‘ ఇదియె నా దేశ మనుచును ఎదను తట్టి తనకు తానైన చెప్పని మనిషి యున్న ఆత్మ చచ్చిన వాడగునట్టివాడు. ఇదీ వెంకటరావు అనువాద సరళి.
*
- ఎ. సీతారామారావు,
లక్కపందిరివీధి,
విజయనగరం-2.
సెల్ : 89787 99864.
**
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.