రాజమండ్రి

కరవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊళ్లకు ఊళ్లే నోరు తెరచి
వేయి కళ్లతో వేచి ఉన్నాయి
ఆల్చిప్పలై
ముత్యాలు రాలకపోవా
చినుకులుగా మారకపోవా అంటూ

ఎటు చూసినా ఎండమావులే
వడదెబ్బలిక సహజ చావులే
దేశమే ఎడారి కొలిమి మరి

మండుటెండలో గండు కోయిల
గొంతెండి పాడుతోంది
శాపనార్థాల మరణగీతం
‘మానవుడా సృష్టిలో
కృతఘు్నడవు నీవే’నంటూ
నీటి జాడలు
ఏడ జూసినా కానరావు
కనురెప్పల మాటున తప్ప

- డాక్టర్ డి.వి.జి. శంకరరావు,
మాజీ ఎంపి, పార్వతీపురం,
సెల్ : 9440836931.
**

కాలం చెక్కిన గాయం

గొంతును తడి చేసుకోటానికి
కొబ్బరి బొండం నీళ్లు
వేసవిలో అమృతం
కొబ్బరి రైతు కన్నీళ్లు
ఆ బొండంలో ప్రవహిస్తోంది నిశ్శబ్దంగా
ధరలేక కొబ్బరి రైతు గుండె చెరువు
గుమ్మం ముందు కొబ్బరిచెట్టు
మువ్వనె్నల జెండాలా
పచ్చని ఆకులతో ఎగురుతోంది
రైతు బ్రతుకులో ఆనందం కరువై
ఆకలి గొంతెత్తి పాడుతోంది
చెట్టు సాక్షిగా బాధల అగాధం నుండి
జారిపడిన కొబ్బరికాయ
వౌన రాగంతో
రైతు పాదముద్ర కన్నీరుతో
మట్టిపై చిగురిస్తోంది మళ్లీ
పద్మవ్యూహంలో కొబ్బరి రైతు విలవిల
ఆత్మవిశ్వాసం నింపాలి
అతని హృదయంలో నిరంతరం
బ్రతుకులో వెలుగు కోసం
అవసరం అయితే
పచ్చని ఆకాశాన్నైనా నేలకు దించాలి
రైతు బాధను వినిపించాలి
అతని పెదవులపై
ఆనందం మళ్లీ పుష్పింపచేయాలి
కొబ్బరి కాయ ధర
మళ్లీ వెలుగులు చిమ్మాలి

- నల్లా నరసింహమూర్తి
అమలాపురం, చరవాణి: 9247577501
**

కలలు ఎగిరిపోకూడదు

కలలు ఎగిరిపోకూడదు
సాకారంగా మారాలి
కలవరంలో కూడా అవే ఉండాలి
పలవరించినా అవే నిండాలి
వడ్డించిన విస్తరి ముందు కూర్చోకు
విస్తట్లో పదార్ధాన్ని సంపాదించుకో
కష్టాలు, కన్నీళ్లు మందీమార్బలం వంటివి
ఇష్టాలు పన్నీటిలా మారిపోవుచుంటాయి
‘నిశ్చయం’ అనేది మారదు
స్వచ్ఛమైన మనసు దాహం తీరదు
ఎదగడంలో మన పయనం
ఒదగడంలో మన వినయం
జీవితాంతం మారకూడదు
జీవిత సాఫల్యం మరువకూడదు
అందుకే ఎదుగుదాం ఆకాశమే హద్దుగా
అందరినీ ఆదుకుంటూ నిలుద్దాం ముద్దుగా

- సుధా శశిరేఖ
సెల్: 9441599321
**

మనసు దాని వ్యసనం

ఓ నిర్ణయం తనలో రాజేసింది
మార్పుని ఓర్పుగా నిర్ణయించమని
హద్దులు దాటే వ్యసనం వదులుకోమని
మనసు నుంచి వ్యసనం మళ్లించుకోమని

చేయి కాలితే గుండె చిల్లు పడుతుంది
గొంతు దాటితే బరువవుతుంది
మనసు వ్యసనానికి సొంతమయితే
వ్యసనం మనిషికి బానిసవుతుంది
విషాదంగా జీవితం కడతేరుతుంది

రుచిని పొందాలనుకొనే ఉత్సాహం
ఒకసారి మళ్లీ కావలనిపిస్తుంది
మళ్లీ తీసుకున్న అవకాశం
ఇక ఎప్పటికి కాబోదు దూరం

గుటక మింగితే నోటికి హాయి
పైకి వదిలితే మొదట ఉల్లాహం
అలసటకు మొదలు అది విశ్రాంతి
మజాలో ముంచగలిగే గమ్మత్తు
దేహం తాపీగా సేద తీర్చుకొంటే
ఊపిరి బంధనం తెంచుకుంటుంది
శ్వాస అనంత వాయువుల్లో కలుస్తుంది
- రవికాంత్
సెల్: 9642489244