నెల్లూరు

అనుబంధాల కలయిక రాగబంధాలు ( స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతవారం మెరుపులో ప్రచురించిన రాగబంధాలు కథ చాలా బాగుంది. ముఖ్యంగా నేటి సమాజంలో బంధాలు అంతరించిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ కథ కాస్త ఊరటనిచ్చింది. ఇంకా బంధాలు, ప్రేమానురాగాలు కొంతైనా ఉన్నాయి అనిపించింది. మన కోర్కెలు మనకు బాగానే వుంటాయి. వాటి వల్ల ఒక్కోసారి మనకు ముప్పు వాటిల్లుతుంది. అది చూసి మన బంధువులు, ఆత్మీయులు తల్లడిల్లిపోతారు. ఈ అంశంతో అల్లుకున్న కథ చివరి వరకు అలా చదివించింది. కథలో రాఘవరావు కోసం ఆ పిల్లలు చింటు, సుజాత చూపించే ప్రేమను బాగా ఎలివేట్ చేశారు. చుట్ట అలవాటు ఆయనకు హానికరమని సుజాత, ఒక్కసారైనా ఆయన కోర్కే తీర్చాలని చింటు పడిన తపనను చక్కగా చూపించారు. మనసుకు నచ్చిన వ్యక్తిపై రాగబంధాలు ఇలాగే వుంటాయి. మంచి కథను అద్భుతంగా మలిచి అందించిన రచయిత పిడుగు పాపిరెడ్డి గారికి మా అభినందనలు.
- గడ్డం హేమలతాకిరణ్, వింజమూరు
- సాయికృపాకర్, ఒంగోలు
- తిప్పావర్జుల లక్ష్మిప్రియ, శ్రీకాళహస్తి
*
ఏమి అనుభవించావని? బాగుంది
*
గత వారం మెరుపులో ఏం అనుభవించావని కవితను చదివిన తరువాత ఎందుకో తెలియదు గానీ ఒక్కసారిగా నాలో స్తబ్ధత చోటుచేసుకుంది. మళ్లీ ఆ కవితను ఇంకోసారి చదివాలనిపిచింది. చదివాను. గొప్ప కవితను చదివానన్న భావన కలిగింది. కవితలోని ప్రతి లైనూ మనసును చేరి ఆలోచింపజేసింది. గొప్ప కవితను అందించిన రచయిత ఖాదర్ షరీఫ్ గారికి అభినందనలు.
- రాఘవరావు, ఉదయగిరి
- రాచమల్లు శివప్రసాద్, నాయుడుపేట
**
రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.
*
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net