నెల్లూరు

కృషితో నాస్తి దుర్భిక్షం (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యార్థులారా! ప్రియ విజ్ఞాన ఖనులారా!
బంగారు భవితకు మార్గదర్శకులారా!
భావి భారత సౌధ పునాదులు మీరే!
మీ మేథస్సును, అంచనా వేద్దామని
పరీక్షలు మిము ఆహ్వానిస్తున్నాయ్!
జీవన్మరణ సమస్యగా! భావించకు
పండుగలా - ఆస్వాదించు
సంతోషంగా - మనసా వాచా స్వాగతించు
అనంతమైన శక్తి సామర్థ్యాలకు
పదును పెట్టు - ఒత్తిడిగా భావించకు
మనసు - శరీరం ఆచరణలను
ఏకం చెయ్! నైతిక ధృతితో
సృజనాత్మకతతో - నిరంతరం శ్రమించి,
లక్ష్యాన్ని అధిగమించు - అమ్మ, నాన్నల కళ్లలో
ఆనందభాష్పాలు - కురిపించు
అంతేగాని..నిరాశ, నిస్పృహలతో
వెనుకంజవేయకు - స్వయం, విశే్లషణతో
శ్రమించు - నిన్ను నీవు అధిగమించేందుకు
ప్రయత్నించు - సానపట్టనిదే
వజ్రానికైనా మెరుగురాదు కదా!
ఇష్టంగా, కష్టపడి - దీక్షబూని చదువు
నీ భవితకు, బంగారుబాట వేసుకో!
దూరదృష్టితో - ఆత్మవిశ్వాసంతో
ఆత్మస్థయిర్యంతో - ముందడుగు వెయ్!
అత్యున్నతమైన, ఉజ్వలమైన, అద్భుతమైన
భవిష్యత్ శిఖరాన్ని అధిరోహించు
పరీక్షల సంగ్రామంలో విజయదుందుభి
మోగించి - విద్యాభివృద్ధే - దేశాభివృద్ధని
చాటి చెప్పు - భవిష్యత్ తరాలకు
స్ఫూర్తి ప్రదాతగా! మార్గదర్శిగా
ఆదర్శంగా! విజయపతాక ఎగురవెయ్
కృషితో నాస్తి దుర్భిక్షం - అని రుజువు చెయ్!
*
- కొడవలూరు ప్రసాదరావు
చరవాణి : 8500757622
*
చల్లగా...
*
చల్ల చేద్దామని మెల్లగా చల్లకుండ దగ్గరకెళ్లగా
అందులో నీ ఉన్నావేమోనని భయమేసింది
కవ్వపు దెబ్బలకు
నీవు తాళలేవు కదా! అని తలచి,
చల్ల చిలకటం మొదలుబెట్టి
అలా కవ్వాన్ని నే తిప్పుతూంటే..
కవ్వానికి చుట్టిన తాడులా..నను చుట్టుకొని
ఏదో తెలియని పులకింత..గిలిగింత..
ఆగి చూచునంతలో..
నీ ఉన్న ఆనవాలే కన్పించవాయె
మైమరపులో చల్లకుండ పగిలితే..
ఓయమ్మో.. ఇంకేముంది?
నీవు వెన్నకోసం రావనే భయం ఒకపక్క
అత్తగారి చీవాట్లు భయం మరోపక్క...
అయినా.. ఎంతకీ మనసు మనసులో
ఉండదాయె
వెన్న ముద్దలో కలసిన తెల్లనయ్య
అరచేతి వెచ్చదనానికి కరగిపోతుంటే..
తెలియని బాధనన్నావరిస్తుంది
మనసును, ప్రేమను బాధ తొలిచేస్తుంది
అంతలోనే నేనున్నానంటూ..
నా కనులు మూసి దొంగాటలు ఆడుతుంటే
పోతున్న ఊపిరి తిరిగొచ్చి
అడుగో కృష్ణయ్యననుకుంటూ..మోము పైకెత్త
నవ్వు మోమున చిరునవ్వై..
సిగ్గులు మొగ్గతొడుగ
బుగ్గ గిల్లి చల్లగా జారుకొనె
నా పెదాలకు తన పెదవుల వెన్నపూసిపోగా
ఆ అమృతాన్ని అద్దమున చూడగా
ఎచ్చటా కానరాదాయె నోయమ్మా
ముచ్చటేసి మురిసిపోతిని కదమ్మా..
అదే కదా! కృష్ణమాయ, కృష్ణప్రేమ..

*
- నాదెండ్ల జ్వాలా
ఉమామహేశ్వరశర్మ
అల్లూరు. చరవాణి : 9908101646
*
విజయసోపానం
*
గత కాలపు రోజులు స్వర్ణయుగంది
జరిగే కాలపురోజులు మొక్కుబడివి
జరగబోయే కాలపురోజులు స్పష్టత
అనుకోనేవాళ్లకు జవాబు
విజయం సాధించినవాళ్ల అనుభవాలు
పరాజయం పొందినవాళ్లు పునః ప్రయత్నంలో
విజయకేతనం ఎగురవేస్తే వాళ్ల ఆనందం వర్ణణాతీతం
ఒక్కసారికే విజయం పొందితే ఆ కిక్కే వేరు
ఆ అనుభూతి అందరికి రాదుగా,
నిరాశ అనేది పాతాళానికి తీసేస్తే,
ఆశ ఎదురుచూపులకు, సహనానికి
ప్రతీక అవుతుంది
అదిగో, అప్పుడే నిన్ను నీవు ఆవిష్కరించుకోగలవు
పదిమందికి ‘ఆసరా’ గా ఉండిపోవాలి
అవసరమైన వారికి వారధిగా ఉండాలి
అభివృద్ధికి ‘చేయూత’నివ్వాలి
క్షణం చాలు తప్పించుకోవడానికి
కాని ప్రతిక్షణం విలువైనదిగా ఉంటుంది
అందుబాటులో ఉండడటానికి
చేసే ప్రతి ప్రయత్నం
విజయసోపానానికి దారితీస్తుంది..!
*
- శ్రీకంటి (సుబ్బారావు)
చరవాణి : 9441685812
*
జీవితసత్యం
*
నవరంధ్రముల ఖజకములో
పంచ వాయువులు
ఉన్నతంవరకే కదా..!
వ్యక్తి విలువ..!
హృదయానికి చిల్లు..అదే
నీ జీవితానికి శాపవు విల్లు..!!

ప్రాణం ఉన్నంత వరకు
చిరునవ్వు వెదజల్లు..!!
అందరి ప్రేమను భద్రించు
నీ హృది పొదరిల్లులో..!!

తప్పులను ఒప్పుకొని
పరమాత్మ యందు క్షమ
ప్రార్థనతో మోకరిల్లు..!!
జీవితం ఇంకా అయ్యెను
అందమైన హరివిల్లు..!!

తనువు అణువు అణువులో
కృతజ్ఞతాభావాన్ని నింపుకో నువ్వు..!!
నీ నవ్వు నవ్వులో పసిడి పువ్వు
అదే మాకు పసిడి పువ్వుల పంట అవ్వు..!!
శపించిన శఠించిన..!!
విఘ్నాలు కలిగించిన..!!
అవరోధాలే సృష్టించిన..!!
అన్నింటిని పెకలించు..!!

గిరులు..సాగరులు..!!
నదులు, సెలయేర్లు..!!
లోకాలు, శోకాలు..!!
ఇవియే నాకు అష్ట ఐశ్వర్యాలు..!!
ఋషులే నేస్తాలు..!!
దైవాలే సహోదరులు..!!
కినె్నరులు కింపురుషులు..!
నాతోటి ప్రయాణికులే..!!

నేనొక దుర్గంధ సుగంధం..!!
నా చూపు మహోద్రేకం..!!
నా కవిత నాకు ఖడ్గం..!!
అది పెట్టు నాకు నైవేద్యం..!!
విమర్శకు కృంగను..!!
ప్రశంసకు లొంగను..!!
విశ్వహితము కోరెదను..!!
పాప ప్రక్షాళన చేసెదను..!!
*
- జాని తక్కెడశిల