దక్షిన తెలంగాణ

హృదయాలను ద్రవింపజేసేదే కవిత్వం (అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావ ప్రకటనతో హృదయాలను ద్రవింపజేసేదే కవిత్వమని భావించే ప్రముఖ పద్యకవి మడిపల్లి భద్రయ్య ప్రస్తుతం నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందినవారు. వృత్తిరీత్యా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగ విరమణ చేసిన ఆయన రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలచుకొని... ఇరవై వరకు కావ్యాలను వెలువరించారు. అనేక సాహితీ, స్వచ్ఛంద సంస్థల ద్వారా మరియు ప్రభుత్వం ద్వారా సన్మాన సత్కారాలను అందుకున్నారు. మిత్రకళా సమితిని స్థాపించడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆయన ‘మిత్ర సాహితి’, ‘స్పృహ’, ‘తపన’, ‘కరచాలనం’ వంటి సాహితీ సంచికలు వెలువడడానికి విశేష కృషి చేశారు. విద్యార్థుల్లో రచనా వ్యాసంగాన్ని పెంపొందింపజేయడానికి ‘ప్రత్యూష’ పత్రికను స్థాపించారు. వివిధ జిల్లాల్లో నిర్వహించిన సాహిత్య సదస్సుల్లో పాల్గొని పత్ర సమర్పణ చేశారు. భద్రయ్య గారికి చిన్ననాటనే తెలుగు భాష పట్ల అనరక్తిని కలిగించిన వారిలో వారి నాయిన బ్రహ్మశ్రీ మడిపల్లి వీరయ్య గారు, శ్రీ దాస్యం వెంకటస్వామి, శ్రీ లింబగిరి స్వామి ప్రముఖులని సవినయంగా ప్రకటించుకున్న ఆయన..అభినవ పోతన వానమామలై వరదాచార్యుల వారిని అమితంగా ఇష్టపడతారు. శ్రీ బమ్మెర పోతన గారి శ్రీమదాంధ్ర మహాభాగవతము శ్రీ చిల్లర నావనారాయణ గారి శ్రీ షిర్డీ సాయి భాగవతం వంటి గ్రంథాలు ఆయనను బాగా ఆకట్టుకున్నాయి! తెలుగులోనే కాక ఉర్ధూ భాషలో ముషాయరాలకు చోటు కల్పించేలా సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించే ఆయన పద్యకవులను అంటరాని వారుగా చూడొద్దని అంటారు. ఆయనతో ‘మెరుపు’ ముచ్చటించింది. ముఖాముఖి వివరాలు ఆయన మాటల్లోనే పాఠకులకు అందిస్తున్నాం..

ఆ మీరు రచనలు ఎన్నో ఏట ప్రారంభించారు?
నా ఇరవై ఏడో ఏట అనగా 1972లో.

ఆ ఇప్పుడు పద్యకావ్యాలు అనుకున్నంతగా వెలువడకపోవడానికి కారణం?
కాలం తీసుకొచ్చిన - తీసుకొస్తున్న మార్పు. ప్రత్యేకంగా తెలుగు భాషయెడల ఏదో - ఎందుకో తెలియని ఏహ్యభావం రావడం - దీర్ఘసమాసాలు - సంధులు ఛందోబంధాలన్నీ తెంచుకుంటాం - తెంచుకున్నామన్న భావన. రామాయణ-్భరత-్భగవతాది గ్రంథాలు - ప్రబంధాలు - పురాణాలు - ఇతిహాసాలు ఇత్యాదుల్లో అలనాటి నుండి నిబిడీకృతమైయున్న భావ సౌరభాలను ఆస్వాదించడానికి కోరిక - తీరిక లేదన్న ఓ అసంబద్ధ ఆలోచన. అబ్బో! పద్యమా! మే పారిపోతాంబాబూ! అని దూరంగా వెళ్లిపోవడం పద్యపాటవం గాని - పఠనం గాని - గానం గాని నచ్చని వారిని చేరదీసుకుని, ఓ ఉద్యమంలా విజృంభిస్తూ - వెనుకటి కాలంలో ఆదరించబడ్డ పద్యం వెనుకకే ఉండాలన్నకాంక్ష - కారణాలు - ఇంకా ఎన్నో ఎనె్నన్నో!

ఆ మీ దృష్టిలో కవిత్వమంటే ఏమిటి?
రవిగాంచని చోట కవి గాంచును అన్ననానుడిని ఆసరగా తీసుకుని కనిపించకుండా - వినిపించేది - భావప్రకటనతో హృదయాలను ద్రవింపజేసేది వాస్తవాలను అద్దంపట్టించేది - ధ్వని (ప్రాణం - ఆత్మ) ద్వారా అందరికీ అర్థమయ్యి ఆకర్షించేదిగా ఉండాలి. స్పష్టత, నిర్దుష్టత కలిగిననదై ఉండి భావిబావుకులకు బలంచేకూర్చగలిగేదిగా ఉండాలి.

ఆ ఇప్పుడొస్తున్న వచన కవిత్వంపై మీ అభిప్రాయం?
కవి సర్వస్వతంత్రుడు - నిరంకుశుడు - అయినప్పటికీ వచన కవిత్వం కూడా అక్కడక్కడా పఛనంకాని రీతుల్లో వస్తున్న సంగతి సమీక్షకులైన మీకు తెలియనిదికాదు!

ఆ సాహితీ సంస్థలు క్రియాశీలకంగా పనిచేయాలంటే మీరిచ్చే సలహాలు?
కవికి గాని, కళాకారునికి గాని, కులం, ప్రాంతం, మతం ఉండవు. ఉండకూడదు కూడా. ఈ మధ్య కొంత వైవిధ్యం తలెత్తుతోందన్న అనుమానం నన్ను ఆహరహం పీడిస్తూనే ఉంది. అయినా రాష్ట్రంలో ఉండే మూలనున్న స్థలాలు కొంతవరకు తృణీకరించబడుతున్నాయోమోనని కూడా అనిపిస్తోంది. దీంతో యువతతోనే గాకుండా తలపండిన వారిలో కూడా అసంతృప్తి కలుగుతుందన్న మాట అందరికీ సువిదితమే. కాబట్టి అందరినీ, ప్రాంతాలు, జిల్లాలకు అతీతంగా ప్రోత్సహించే విధంగా సాహితీ - సాంస్కృతిక సంస్థలు త్రికరణశుద్ధిగా తమ కర్తవ్యాన్ని నిర్వహించాలని నా ఆశ. జల్లా, ప్రాంతం మరియు రాష్టస్థ్రాయిల్లో సెమినార్లు మరియు తగిన ప్రోత్సాహకాలతో పోటీలు నిర్వహించే ఏర్పాటు వల్ల రాబోయే తరాలకో మార్గదర్శక పూర్వక ప్రోత్సాహం కొంతలో కొంతనన్నా లభిస్తుందేమోనన్న నమ్మకం.

ఆ మంచి కవిత్వానికి ఉండాల్సిన లక్షణాలు?
కప్పి చెప్పే కవిత్వ వ్యక్తిత్వం కొందరికిష్టం - దారులన్నీ ఢిల్లీ నగరానికేనన్నట్లు వస్తువు, కథనం, విషయ విపులీకరణ, అంతరార్థం, సమాచారం, సంయోజనం, సంస్కరణ, రసపోషణ, వ్యంగ్యం, హాస్యం, మొదలుగాగల అంశాల ఆధారంగా నిర్మించబడే రచనాహర్మ్యం, పునాదిని విస్మరించకుండా ఉండాలని, పై పై మెరుగులు అశాశ్వతమనే భావనలో ఉంటూ శాశ్వతత్వాన్ని పుణికిపుచ్చుకుంటూ పదికాలాలపాటు నిలవాలన్న ఆకాంక్షతో రచనా ప్రక్రియ ఏదైనా సరే సాగాలన్నది నా ప్రగాఢ విశ్వాసము, మరియు కాంక్ష.

ఆ మరుగున పడిన తెలంగాణ సాహిత్యం వెలుగులోకి రావాలంటే ఏం చేయాలి?
ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు, తెలుగు భాషను ప్రోత్సహించి రక్షించడానికి నడుం కట్టిన సంస్థలు, నాటి నుండి తెలంగాణ ప్రాంతంలో రచించి ముద్రితములు, అముద్రితములైన రచనలను వెలికి తీసి కంప్యూటరీకరణ ద్వారా ఆధునికం చేయడానికి నిబద్ధత కలిగిన వ్యక్తులతో కమిటీలను ఏర్పరచాలి. వెలికి తీసిన సాహిత్యాన్ని పురాతనం, ఆధునికం, అత్యాధునికం అనే వర్గాలుగా, పద్యం, పదాలు, వచన కవితలు, గేయాలు, గీతాలు, కథలు, కథానికలు, జానపదాలని నేటి కవిగా క్రోడీకరించి వీలైతే వాటిని సంస్కరించడానికి ప్రయత్నం మొక్కుబడిగా కాకుండా ఆయా జిల్లాలలో అనుభవజ్ఞులు, శ్రద్ధాళువులైన సాహితీ జిజ్ఞాసువులతో కమిటీలుగా ఏర్పరచి వాటినోమార్గంలో పెట్టే ప్రయత్నం జరుగాలి.

ఆ కొత్త కవులు - రచయితలకు మీరిచ్చే సూచనలు, సలహాలు?
వర్ధమాన కవులుగాని - రచయితలు గానీ, లబ్ధి ప్రతిష్టులైన వారు గాని తమ తోటి వారి పట్ల ఆత్మీయభావన పెంపొందించుకోవాలి. కవి సమ్మేళనాలు - పుస్తక సమీక్షలు - ఆవిష్కరణలు - పరిచయాలు మొక్కుబడిగా సాగే విధానంగా కాకుండా ఒకరికొరకు అందరం అందరికొరకొక్కరం అనే సదుద్ధేశంతో కొనసాగాలి. ప్రతీ కవి, ప్రతి రచయిత తన కవిత్వాన్నో, రచననో పఠించిన తరువాత ఇతరులవి గూడా ఆలకించి ప్రోత్సహించాలనే మనస్తత్వాన్ని సహనశీలతను పెంపొందించుకోవాలి.
*
చిరునామా:
మడిపల్లి భద్రయ్య
ఇంటి.నం.1-3-124/3ఇ
శాస్ర్తీనగర్ నార్త్
నిర్మల్ - 504106
సెల్.నం.9885830550
*
ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544

- దాస్యం సేనాధిపతి, 9440525544