ఉత్తర తెలంగాణ

గోరంత.. కొండంత!..(కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘హలో.. ఎవరండీ?’
‘అయ్యో రామా.. నేనండీ.. మీ భార్యను..’
‘ఏంది డియర్? సిన్మా ఆరింటికి గదా! ఇప్పుడింకా నాలుగు కూడా కాలేదు. ఆఫీసు నుండి ఐదు తరువాత బయలుదేరుతా’
‘అయ్యో! అదికాదండీ!’ గొంతులో తుఫాను.
‘ఏది కాదు? సిన్మా ప్రోగ్రాం క్యాన్సిలా? ఫర్వాలేదు’
‘నా బొంద. నేను చెప్పేది వినండి’
‘చెప్పు శ్రీదేవీ!’
‘మన పాపకి ప్రమాదం. నోట మాట రావడం లేదండీ. నాకు భయమైతుంది..’ మాట ఆగి ఆగి వస్తోంది.
‘్భయమా?’ కమలాకర్ ఆశ్చర్యం’ ఏమైందీ?
‘అదే తెల్వదు మహాశయా! మీరు వెంటనే రండి’
మాగిన మామిడి పండులా నిగనిగలాడుతున్న ఆఫీసర్ కమలాకర్ మొహం వాడిపోయిన వంకాయలాగైంది.
‘పాపకేమైందో..! గొణుక్కుంటూ సెల్‌ఫోన్ జేబులో వేసుకుని అటెండర్ను పిలిచిండు’ ఇంటికెళ్లాలి. డ్రైవర్ను కారు తెమ్మను’ అంతరాళాల్లోని ఆగమాగం మొహమీదికొచ్చింది.
టేబుల్ మీద పాముల పుట్టల్లాగున్న ఫైల్సుని అలాగే వదిలేసి చాంబర్ బయటికొచ్చిండు. పరుగెడుతున్నట్టు బయటికొచ్చి కారులో కూచున్నాడు. అందరిలో అనుమానం. పిఎ పరుగెత్తుకొచ్చిండు. ‘ఏం సంగతి సార్?’
‘నేనింటికెళ్తున్నాను. మా పాపకు ప్రమాదమట’
కారు బయలుదేరింది.
కారు దిగి వేగంగా ఇంట్లోకొచ్చిండు కమలాకర్. మూడేళ్ల ముద్దుల పాప సోఫాలో వెల్లకిలా పడుకునుంది. పక్కన భార్య శ్రీదేవి కొంకు నోట్లో కుక్కుకునుంది. ఆమె పక్కన వంట మనిషుంది.
పాప కళ్లు కమలాకర్ వైపుతిప్పింది. ‘నా..న్నా’ మాట రాలేకపోతోంది. వెంటనే ఒళ్లోకి లాక్కున్నాడు.
‘ఏమైంది చిట్టి తల్లీ?’ అంటూ పరేషానైపోతున్నాడు.
కుడి చేతిని గొంతు మీదుంచుకుని కాళ్లు కొట్టుకుంటుంది పాప.
‘అయ్యో దేవుడా! పాపకేమైందోనండీ?’ శ్రీదేవి నెత్తికొట్టుకుంది.
కమలాకర్‌లో అనుమానం! ‘దాని చేతికేమైనా నాణాలిచ్చినవా?’
‘అవును. చాక్లెట్లు కొనుక్కుంటానంటే రెండు రూపాయి ల బిళ్లలిచ్చినా. ఐదు నిమిషాల్లోనే తిరిగొచ్చి సోఫా మీద పడిపోయి ఎటెటో చేస్తుందండీ!’
‘రూపాయి బిళ్లలు నోట్లో వేసుకున్నవా? బుజ్జీ?’ కమలాకర్ ఆబగా అడిగిండు.
పాప అవునన్నట్టు తలూపింది. ఎడమ చేతి పిడికిలి విప్పి ఒక రూపాయి బిళ్ల చూపించింది. కుడి చేత్తో గొంతు చూపించింది.
‘ఇంకో రూపాయి బిళ్ల ఏది బుజ్జీ?’ శ్రీదేవి ఆత్రం.
‘ఊ...ఊ...ఇ...ఈ..’ఎడమ చేతులున్న రూపాయిబిళ్లను పక్కన పడేసి అదే చేత్తో గొంతు చూపించింది పాప. ఊపిరిపీల్చి వదిలేందుకు అవస్థ పడుతోంది.
కమలాకర్‌లో కల్లోలం..అరెరే! పాప రూపాయి బిళ్ల నోట్లో వేసుకున్నట్టుంది’
అవునన్నట్టు పాప తలూపింది.
‘అది గొంతులో ఇరుక్కున్నట్టుంది దేవుడా! శ్రీదేవి గుండెలు బాదుకుంది.
కమలాకర్ గుండె కంప్యూటర్ కర్సర్‌లా మెదిలింది. భార్య మీద కోపమొచ్చింది’ పిల్లల చేతికి డబ్బులివ్వవద్దని చెప్పినానుగద’ రుసరుసలాడుతూ పాపను ఎత్తుకుని గబగబా వెళ్లి కారులో కూచున్నాడు. శ్రీదేవి వెంబడించి పక్కన కూచుంది.
డ్రైవర్‌కు హాస్పిటల్ పేరు చెప్పి త్వరగా పోనీ! ఆవేశాన్ని అణిచిపెట్టుకుని ఆదేశించిండు.
అన్ని హంగులున్న మోడ్రన్ కార్పోరేట్ హాస్పిటలది.
అంత పెద్ద ఆఫీసరు పాపను భుజమీదేసుకుని హాస్పిటల్లో కొస్తుంటే గుర్తుబట్టిన సిబ్బంది ఆశ్చర్యంలో మునిగితేలిండ్రు.
‘ఏమైంది సార్?’ తెలిసిన డాక్టర్ ఎదురొచ్చిండు
‘ఈ.యన్.టి.డాక్టర్ కావాలి’ ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఈ.యన్.టి. విభాగానికెళ్లారు.
‘ఆహా! సబ్ కలెక్టర్ సార్! స్వయంగా వచ్చిండ్రా? ఒక్క ఫోన్ చేస్తే మేమే వచ్చేవాళ్లం గదాసార్!’ ఈ.యన్.టి.డాక్టర్ ఎదురొచ్చిండు. ఆయన మాటల్నేవీ కమలాకర్‌ను విననివ్వలేదు ఆందోళన.
‘నా పాప సార్.. గొంతులో రూపాయిబిళ్ల ఇరుక్కుంది. వెంటనే చూడండి డాక్టర్!’
ఏవో పరికరాలతో డాక్టర్ పాప నోటిని, గొంతును పరీక్షించిండు. ‘అర్జంటుగా ఆపరేషన్ చెయ్యాలి. లేకపోతే చాలా ప్రమాదం సార్!’
శ్రీదేవి కాళ్లు కడుపులజొచ్చినై. కమలాకర్ బాధనంతా దిగమింగిండు. ‘వెంటనే చెయ్యండి డాక్టర్! పాపను రక్షించండి. బిల్లు గురించి భయపడేది లేదు.’
ఆఘమేఘాల మీద పాపకు ఆపరేషన్ చేసి గొంతులోంచి రూపాయిబిళ్ల తీసిండు. కుట్లు వేసిం తరువాత డాక్టర్ బయటికొచ్చిండు. అప్పటిదాకా కమలాకర్-శ్రీదేవి బిక్కు బిక్కుమంటూ బయట కూచున్నారు.
డాక్టర్ బయటకు రాగానే కమలాకర్ దంపతులు ఎదురెళ్లిండ్రు. కమలాకర్ ఆత్రంగా ‘పాపకెట్లుంది డాక్టర్?’ అడిగిండు.
‘మీరు చాలా అదృష్టవంతులు సార్. ‘రూపాయి బిళ్ల కమలాకర్ చేతికిస్తూ ‘ఇది గొంతులోంచి తీసినం. పాప క్షేమం. హాస్పిటల్‌కు తీసుకురావడం ఏమాత్రం ఆలస్యమైనా ప్రాణాలకే ప్రమాదముండేది. అయినా పిల్లల చేతికి చిల్లర నాణాలివ్వద్దు గదా సార్!’ డాక్టర్ వినయంగా విన్నవించుకున్నాడు.
కమలాకర్ భార్య వైపు గుర్రుగా చూశాడు. ఆమె తల దించుకుంది. ‘పొరపాటు నాదే డాక్టర్! చాక్లెట్ కావాలంటే కొనుక్కొమ్మని రెండు రూపాయి బిళ్లలిచ్చిన. గోరంత పొరపాటు కొండంత ప్రమాదానికి దారి దీస్తుందనుకోలేదు సార్! మీకు చాలా థాంక్స్’ చేతులు జోడించింది.
భార్యాభర్తల మనసు కుదుటపడింది.

- ఐతా చంద్రయ్య సిద్ధిపేట, సెల్.నం.9391205299