దక్షిన తెలంగాణ

సమస్యలకు పరిష్కారం చూపేలా స్ర్తీవాద రచనలు ఉండాలి ( అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిల్లెళ్ల అనసూయ
ఫ్లాట్.నం.405
ప్రశాంత్‌నగర్
వనస్థలిపురం
హైదరాబాద్
సెల్.నం.9490128259
**
మహిళల సమస్యల పరిష్కారాలను వెతికే దిశగా స్ర్తివాద రచనలు సాగాలని కోరుకునే ప్రముఖ కథా రచయిత్రి జిల్లెళ్ల అనసూయ పాత మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజిపేట మండలం, గోరిట గ్రామానికి చెందినవారు. వృత్తిరీత్యా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉద్యోగ విరమణ చేసిన ఆమె రచనా వ్యాసంగాన్ని ప్రవృత్తిగా మలచుకున్నారు. ‘నిశ్శబ్ద చిత్రాలు’, ‘తెలంగాణ బ్రతుకు చిత్రాలు’ కథా సంపుటులను వెలువరించి కథా రచయిత్రిగా సాహితీ లోకంలో గుర్తింపును సాధించారు. ఆమె రాసిన ‘అరువుతల్లి’ కథకు కె.వి.కృష్ణమూర్తి స్మారక కథల పోటీల్లో బహుమతి వచ్చింది. మరో కథ ‘కొడుకు’ ఆటా కథల పోటీలో బహుమతి పొందింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉత్తమ అధ్యాపకురాలిగా పురస్కారం అందుకున్నారు. ‘మెరుపు’ ఆమెతో ముచ్చటించింది. ముఖా ముఖి వివరాలు ఆమె మాటల్లోనే...

ఆ మీ రచనా వ్యాసంగాన్ని ఎన్నో ఏట
ప్రారంభించారు?
నా పదిహేనవ ఏట నేను పదవ తరగతిలో ఉన్నప్పుడు స్కూల్లో ‘రచయిత్రితో ఇంటర్వ్యూ’ అనే నాటిక వ్రాసి ప్రదర్శించడం జరిగింది. ‘బంగ్లా విముక్తి’ అన్న బుర్ర కథ వ్రాసి ప్రదర్శించడమైనది.

ఆ మీరు రచనల పట్ల ఆసక్తి చూపడానికి
ప్రేరణ ఇచ్చింది ఎవరు?
మా నాన్న జిల్లెళ్ల చెన్నారెడ్డి గారు. చరిత్ర ఉపన్యాసకులు, మా స్కూలు ఆంగ్ల ఉపాధ్యాయురాలు శ్రీమతి లక్ష్మికాంతమ్మ గారు. వీరిద్దరూ పుస్తకాలు చదవడానికి ప్రోత్సహించి, ఆలోచించడానికి ప్రేరణను ఇచ్చారు.

ఆ మీ దృష్టిలో కవిత్వం అంటే ఏమిటి?
కఠినమైన సత్యాలను అందంగా చెప్పడం.

ఆ ఇప్పుడొస్తున్న వచన కవిత్వంపై
మీ అభిప్రాయం?
ప్రపంచ వ్యాప్తంగా కవిత్వం రాయడంలో అనేక మార్పులు వచ్చాయి. వస్తున్నాయి. భాష సులభమై భావం కఠినమవుతున్న సందర్భం ఇది. వర్గ చైతన్యము, ప్రతిఘటనోధ్యమాలు, అస్తిత్వవాదాలు కవితల ద్వారా వ్యక్తీకరింపబడుతున్నాయి!

ఆ మీ ముద్రిత గ్రంథాలు?
నిశ్శబ్ద చిత్రాలు, 2007, కథా సంపుటి.
‘తెలంగాణ బ్రతుకు చిత్రాలు’, 2013 కథా సంపుటి.

ఆ మీకు నచ్చిన కవి, రచయిత?
చెరబండ రాజు, శ్రీశ్రీ, ఆల్చర్ట్ కాము, కమలా మార్కండేయ రంగనాయకమ్మ, మహాశే్వతా దేవి.

ఆ మరుగునపడ్డ తెలంగాణ సాహిత్యం
వెలుగులోకి రావాలంటే ఏం చేయాలి?
తెలంగాణ ప్రాంత రచయితల రచనలను పత్రికల ద్వారా ప్రచురణల ద్వారా ప్రచారంలోకి తేవాలి. అముద్రిత రచనలను ప్రచురించే బాధ్యతను సాహితీ సంస్థలు, ప్రభుత్వం తీసుకోవాలి.

ఆ మారుతున్న సమాజంలో ఇంకా స్ర్తివాద
కవిత్వం అవసరమని భావిస్తున్నారా?
ఇది అస్తిత్వవాద యుగం. ఎవరి అస్తిత్వం కొరకు వారు పోరాడుతున్న కాలం. స్ర్తివాదం కూడా అస్తిత్వవాదమే! వర్గ స్వభావాన్ని, తత్వాన్ని ఆకళింపు జేసుకుంటూ స్ర్తివాదం ఇంకా పదునుదేలాలి. సమస్యల మూలాలను, పరిష్కారాలను వెతికే దిశగా స్ర్తివాద రచనలు సాగాలి!

ఆ మీకు నచ్చిన గ్రంథం?
గోర్కి ‘అమ్మ’ మహాశే్వత, ‘ఒక తల్లి’ ఆల్బర్ట్ కాము’, ‘ఔట్ సైడర్’!

ఆ కథలు, కవిత్వం రాయడంలో
ఏది సులభం?
కథ, కవిత్వం రెండు వేరు వేరు ప్రక్రియలు. ఒక సంఘటననో, సామాజికాంశాన్ని ఎన్నుకోవడం, పాత్రల సృజన, సంభాషణలు, చెప్పాలనుకున్న విషయానికి ఇవ్వాలనుకున్న సందేశానికి సరిపోయే పరిస్థితులు కల్పించడం ఇదొక దీర్ఘ, సమగ్ర ప్రక్రియ. కవిత్వం చాలా పురాతన ప్రక్రియ, పూర్వం కథలు కూడా కవిత్వం ద్వారానే చెప్పబడేవి! మన దేశంలో రామాయణ, భారతాలు అన్ని కవిత్వ రూపాలే. ఛందోబద్ధ కవిత్వానికి భాష మీద పట్టు అవసరము. ఆధునిక వచన కవిత్వంలో భాష కంటే భావము ముఖ్యం. కొంత మేరకు సులభం కూడా! కథ, కవిత్వం రెండింటికి అధ్యయనం, అభ్యసనం అవసరం.

ఆ మంచి కథకు ఉండవలసిన లక్షణాలు?
చదివింపజేయడం, ఆలోచింపజేయడం రెండు కథకు ఉండవలసిన ప్రధాన లక్షణాలు. స్థలకాలాలకు అతీతమైన విశ్వజనీనత. మనసులను కదిలింపజేసే బలమైన ఇతివృత్తము, సరళంగా హృద్యంగా ఎవరికి వాళ్లకు సొంతమనిపించే భాష, కథలు పదికాలాల పాటు పాఠకులు గుర్తుపెట్టుకునేలా చేస్తాయి! షేక్స్‌పియర్ నాటకాలైనా, రామాయణ మహాభారతాలైనా నేటికి నిలిచి ఉన్నాయంటే ఇదే కారణము!

ఆ సాహితీ పురస్కారాలపై మీ అభిప్రాయం?
పురస్కారం అనేది ఒక రకమైన గుర్తింపు. సాహితీ సంస్థలు పురస్కారాలు ఇవ్వడం ద్వారా మంచి సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వాలు ఇచ్చే పురస్కారాలు నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా ఉంటే వాటి సదుద్దేశం నెరవేరుతుంది.

ఆ కొత్త కవులు, రచయితలకు మీరిచ్చే
సలహాలు సూచనలు?
కొత్తవారైనా పాతవారైనా నిరంతరం వర్ధమాన ప్రపంచ సాహిత్యాన్ని చదవడం అవసరం. తను చెప్పదలుచుకున్న విషయం ఏ భావజాలానికి సంబంధించిందైనా కావచ్చు. ఆ విషయాన్ని సందర్భోచితంగా పాత్రల ద్వారా సంఘటనల ద్వారానే చెప్పాలి తప్ప ఉపన్యాస ధోరణిలో ఆ విషయం చెప్పడమే ప్రధానమన్నట్టుగా ఉండకూడదు. విధ్వంసాన్ని ప్రతిఘటిస్తూ అభివృద్ధి వైపు అడుగులేసే విధంగా సాహిత్యం ఉండాలి. మార్కెట్ సంస్కృతిని ధిక్కరిస్తూ మానవతా వాద సంస్కృతికి వనె్నలద్దేవిధంగా ఉండాలి! పెరిగిన సాంకేతిక విజ్ఞానం, కంప్యూటర్లు, ప్రింటింగ్‌లో వచ్చిన వేగం, మార్పు, అభివృద్ధి రచయితల పనిని సులభం చేసాయని చెప్పొచ్చు.
*
ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544