నెల్లూరు

పాపం కాకమ్మ! (మినీకథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదో దట్టమైన అడవి. అందులో ఎన్నో జంతువులు, పక్షులు, క్రిమికీటకాదులు, స్వేచ్ఛగా జీవిస్తున్నాయ. అందులో రెండు కాకులు కూడా ఉన్నాయి. ఒకరోజు వాటిలో ఒక మగ కాకి ఆడ కాకితో ఇలా అంది. ‘మానవులు ఎంతో గొప్పోళ్లు వారు అన్ని రుచులూ తింటారు. రెండు చేతులా సంపాదిస్తారు. అన్ని సుఖాలూ అనుభవిస్తున్నారు. మనమూ ఉన్నాం ఎందుకు?’ అంది నిరాశ నిస్పృహతో. ‘ఈ అడవిలో విత్తనాలు, క్రిమికీటకాలు తిని బతుకుతున్నాం. ఒక రుచా పచా. అదే పట్టణాలకు వెళ్తే మానవులు తిని వదిలేసిన ఆహారాన్ని తిన్నా మన జీవితం బాగా గడిచిపోతుంది’ అంది. దానికి ఆడ కాకి ఇలా అంది. ‘విశాలమైన అడవిలో ఎప్పుడూ కావలసినంత ఆహారం దొరుకుతుంది. ఎక్కడికైనా తిరగొచ్చు. స్వేచ్ఛగా బతకొచ్చు. మనకు ఏ బెంగా లేదు. హాయిగా తిని సుఖంగా జీవించకుండా కొత్త ఆశలతో జీవితాన్ని వ్యర్థం చేసుకోకు’ అని హితవు పలికింది. మగ కాకికి ఆ హితబోధ చెవికెక్కలేదు. మనసులో పట్టణానికి పోదాం అన్న దృఢ నిశ్చయానికి వచ్చింది. రాత్రి ఎలాగో చెట్టుపై గడిపేసిన మగకాకి తెల్లతెల్లవారుతూనే పట్టణం బాట పట్టింది. ఎగురుతూ ఎగురుతూ పెద్ద పట్టణాన్ని చేరుకుంది. మధ్యలో పెద్ద పెద్ద భవంతులు, నల్లటి రోడ్లు, సెల్ టవర్లు కన్పించాయ. ఆహా ఎంత బాగుంది పట్టణం అనుకుంది. ఒక పెద్ద భవంతిపై వాలింది. అక్కడినుంచి కిందికి చూసింది. అక్కడో బావి పక్కన ఎంగిలి పళ్లాలు. ఆహా ఈ రోజు షడ్రసోపేతమైన విందు అనుకుని రివ్వున కిందకి దిగి అటు ఇటు పరికించి పళ్లాల్లో ఒక్కో మెతుకు తినడం ప్రారంభించింది. సడి కావడంతో రివ్వున ఎగిరిపోయింది. మరికొంత సేపటికి మరో ఇంటిపై వాలింది. అక్కడికి సమీపంలోని చెత్తకుప్పపై వివిధ తినుబండారాలు కన్పించాయి. వాటిపై జంతువులు, ఈగలు, దోమలు మిగతా కాకులూ కూడా వాలడంతో తనకు సరిపడనంత ఆహారం లభించలేదు. వాటిని తింటుండగా పెద్ద శబ్దంతో వాహనాలు రావడంతో ప్రాణభయంతో రివ్వున ఎగిరింది. అటూ ఇటూ చూసింది. ఎక్కడా సురక్షితమైన చెట్లు కానరాలేదు. మరో భవనంపై వాలింది. పట్టణంలో ఎక్కడా చెట్లు లేకపోవడంతో తన నివాసం ఎక్కడాని మధన పడింది. అలా ఎగురుతుండగా కరెంటు తీగలు తగిలి గాయమైంది కూడా. అలా భవనాలపైనే తలదాచుకుంటూ కొన్నాళ్లు గడిచిపోయింది.
ఒకరోజు ఒక భవనం పిట్టగోడపై వాలింది. గోడపైనుంచి లోనికి చూసింది. అక్కడ ఒక యువకుడు ఏదో తినడం కంటపడింది. హమ్మయ్య ఈ వ్యక్తి ఆహారం తింటూ తనను ఆ ఎంగిలి చేత్తో తోలే ప్రయత్నంలో కొంత ఆహారమైనా లభిస్తుందని ఊహించింది.
అనుకున్నదే తడవుగా గోడపై నిరీక్షించింది. కావు కావు అని అరిచింది. టివి చూస్తూ ఆ వ్యక్తి తినడంతో ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలే ప్రయత్నం చేయలేదు. నిరీక్షించి నిరీక్షించి ఎగిరిపోయంది. అర్ధాకలితో ఆ రోజు గడిచింది. దీంతో రావడం అయితే పట్నం వచ్చింది. కాని ఇక్కడ మనఃశ్శాంతి కరవైంది. స్వచ్ఛమైన గాలి లభించలేదు. వాహనాలు వదిలే కాలుష్యంతో కూడిన గాలిని పీల్చాల్సి వస్తోందని మధనపడింది. మానవులు వదిలే సమయంలోనే తప్ప మిగతా సమయాల్లో మనకు ఆహారం లభించడం కష్టమే అనుకుంది. వారు చెత్తకుప్పపై పడేసిన ఆహారంలో పందులు, క్రిమి కీటకాలు చేరిన కంపుకొట్టిన ఆహారం లభిస్తోంది. ఈ విషయాలన్నీ గ్రహించింది. ఒక రోజు ఆలోచనలో పడింది. అడవిలో అయితే లెక్కలేనన్ని కాకుల మధ్య కావలిసినంత ఆహారం లభించేది. మనసు విప్పి మాట్లాడుకోవడానికి స్నేహితులు కూడా ఉండేవారు. ఇక్కడ ఎవరూ తనతో కలివిడిగా ఉండడం లేదు. అడవిలో స్వచ్ఛమైన ఆహారం లభించేది. ఇక్కడ కలుషితమైన ఆహారం లభిస్తోంది. మానవులు ఎంతో గొప్పవారని భావించాను. కనీసం ఎంగిలి చేత్తో కూడా కాకికి మెతుకు కూడా విదల్చడం లేదు అని అనుకుంది. పట్టణ వాసం ఇక లాభం లేదనుకుని మరుసటి రోజే అడవిలోకి రివ్వున ఎగిరిపోయింది.
- గౌతమి, 9347109377
*
స్పందన
*
పచ్చా పెంచలయ్య గారికి హెట్సాప్
*
పచ్చా పెంచలయ్య గారు మెరుపులో రాసిన వందనాలు..శతకోటి వందనాలు కవిత చదివిన తరువాత కళ్లు చెమ్మగిల్లాయి. చిన్నకవితలో ఎంతో గొప్పభావాన్ని చొప్పించి మా మనసును ద్రవింపజేసిన రచయిత పచ్చా పెంచలయ్య గారికి హృదయపూర్వక అభినందనలు. మనము మాత్రమే బాగుండటం కాదు పదిమందికి సాయపడితేనే మానవజన్మకు సార్థకత అని గొప్ప కవిత ద్వారా రుజువుచేశారు రచయిత. చలికి గజగజ వణుకుతూ గుమ్మం బయట నిల్చున్నవాడికి కాస్త ఆసరా ఇవ్వాలే కానీ ఛీ..పో అని తరిమెయ్యకూడదు. ఆకలితో అలమటించే వాడికి కాస్త అన్నం పెట్టాలే కానీ అసహ్యయించుకోకూడదు. హెట్సాప్ పెంచలయ్య గారు.
- రావి పద్మావతి, ఒంగోలు
- లావణ్య మల్లెపోగు, వింజమూరు
- కాలిదాసు, కావలి
*
కథ సుఖాంతమైంది
*
గతవారం మెరుపులో రాయప్రోలు వారు రాసిన సుఖాంతం కథ చాలా బాగుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా దానిని ఎలా సామరస్యంగా పరిష్కరించుకోవచ్చునో అనే అంశం ఆధారంగా కథను అల్లుకున్ను తీరు బాగుంది. కథ మొత్తం కూడా చదవించేలా సంభాషణలు, వాక్యానిర్మాణాలను గొప్పగా తీర్చిదిద్దారు. రవితేజ, రవికాంత్, ఆమని క్యారెక్టర్లు మొతాదు మించకుండా చక్కటి సంభాషణలతో ఆ పాత్రలకు ప్రాణం పోశారు రచయిత. ఒక సమస్య వచ్చినప్పుడు తొందరపడి పదిమందిలో అల్లరిపాలు కాకుండా నేర్పరితనంతో ఎలా పరిష్కరించుకోవచ్చో చక్కగా కథను సుఖాంతం చేసిన విష్ణుకుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు. మరిన్ని కథలు అందించాలని కోరుకుంటూ...
- సుమతి, నాయుడుపేట
- రామ్మోహన్, తిరుపతి - శైలజాభాను, నెల్లూరు

**
రచనలకు
ఆహ్వానం
*
నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.