నెల్లూరు

మంత్ర ప్రక్రియ (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరో మంత్రించినట్లు నడుస్తోందీ ప్రపంచం
ప్రేమ గానాల మాటున ఏదో రహస్యాన్ని దాచి
మనిషిని ప్రపంచం మధ్య బొడ్రాయిలా నిల్పి
పూరేకుల్ని వెదజల్లినట్లు
కుటుంబాన్ని చల్లుకుంటూ వెళ్లిపోతున్నారు
మంత్రించిన వాళ్లెవరో పులకించిపోతున్నారు
ప్రాపంచిక ఫలాల్నెవరో అనుభవిస్తున్నారు
ప్రవహిస్తున్న జీవనదుల్లో
నల్లమందులాంటిదేదో కల్పి రహస్యంగా
మనిషిని తన వైపు తిప్పుకుంటున్నారు

చేపలు తోమినట్లు నక్షత్రాల్ని తోమి
ఆకాశంలో రోజూ ఎగరేసి నవ్వుకుంటున్నారు
రంగు రంగుల కాంతుల్ని వెదజల్లుకుంటూ
కాలాన్ని పక్షవాతం బారిన పడకుండా చేస్తూ
పగలూ రాత్రుళ్ల కొప్పుల్లో పారిజాతాలు తురిమి
ఏవో రాగజ్వాలల్ని ఆలపించుకుంటూ
ఎక్కడినుంచో రహస్యంగా మంత్రజపం
చేసుకుంటూ
ఈ మానవ ప్రపంచాన్ని నడిపిస్తున్నారు
నిద్రామెలకువల మధ్య తెరలు కట్టి
నియంత్రిస్తున్నారు

జీవశిబిరాల మీద మంచులాంటి
మంత్ర పుప్పొడి చల్లబడుతూ ఉంది రోజూ
ఆయుధాలు పట్టుకుని యుద్ధం చేస్తున్న వాళ్లంతా
మంత్రవలయంలో చిక్కుకున్న వాళ్లే
సప్త సముద్రాలు ఉప్పగా మారటం కూడా
ఈ మంత్ర ప్రక్రియలోని భాగమే
ఏళ్ల తరబడి ఇలా సాగుతూనే ఉంది
నేను తప్ప ఎవరూ
పసిగట్టిన దాఖలాయే లేదు
మంత్ర రహస్యాన్ని ఛేధించిన వాడిని
ఎప్పటికయినా ఆ మంత్రదండాన్ని
చేజిక్కించుకుంటాను
గుండెకు హత్తుకుని నన్ను నేను
సత్కరించుకుంటాను
లేదా నేనే మంత్రపుష్పంలా
మారిపోతాను
- ఖాదర్‌షరీఫ్, సోమశిల
చరవాణి : 9441939140
**
అక్షర శిఖరానికి అశ్రునివాళి
*
అతను తెలుగుతల్లి నుదుటిన
తెలుగు నుడికారపు బొట్టు అద్దాడు
తెలుగుతల్లి జడలో జావళిలా
జాజిపూలను తురిమాడు
తెలుగుతల్లి కళ్లకు తెలుగుకీర్తి కాటుక అద్దాడు
తెలుగుతల్లి పెదవులకు పద్యాల మకరందం
పులిమాడు
తెలుగుతల్లి మెడలో కావ్యపుష్పమాల వేశాడు
తెలుగుతల్లి కాలిగజ్జెలుగా గజల్స్‌ను మలిచాడు
జ్ఞానపీఠ్ అవార్డు పొందిన
అక్షర నిధి
తెలుగువారి ప్రతినిధి
అతడు ఉవ్వెత్తున ఎగసిపడే
అక్షర సంద్రం
అది ఎన్నటికీ ఇంకిపోదు
అతడు నిలువెత్తు అక్షర శిఖరం
అది ఎన్నటికీ కూలిపోదు
సినారేకు ఇదే నా అక్షర నివాలి!
- మోపూరు పెంచలనరసింహం
చరవాణి : 9346393501
*
గతి తప్పిన జీవనానికి!
*
నాడు సమాచార చేరవేత బహుచిక్కు
మీటనొక్కి చూడ సెల్ చేసె నేడు మ్యాజిక్కు
రాతియుగం నుంచి రాకెట్ యుగానికి చేరిక
మానవ మేధను తెలపడానికి ప్రతీక
విజ్ఞాన సూత్రాల అమరిక యంత్రం
పల్లె నుంచి విల్లా వరకు గణన యంత్రం
జగతిన ప్రతిదానికి నిత్య మంత్రం
వినోద విలాసాలకు ఆలవాలమై పోయె
నరున్ని గుప్పెడు ఒడిసిపట్టే
మానవా! బంధీ అయిపోకుమా!
మానవుని మొదటి పనిముట్టు స్టిక్కు
మానవుని నేటి కనికట్టు ప్లాస్టిక్కు
వినియోగం అధికమైతే భవితవ్యం బిక్కుబిక్కు
పాత్రల నుంచి పాలప్యాకెట్ల వరకు
కప్ప పాముల సామెత చందం
మనిషీ ప్లాస్టిక్కుకు ఉన్న అనుబంధం.
రాగి స్టీలు పాత్రల వాడకం ఆరోగ్యం
ప్లాస్టిక్‌కే మొగ్గు చూపడం మన దౌర్భాగ్యం
చుట్టుపక్కల
కర్మాగారాలు విడచిన చెత్త కానుక
గతితప్పిన జీవనానికి ప్రకృతి చేస్తోంది హెచ్చరిక
ప్రకృతి చేస్తోంది హెచ్చరిక!
- యర్రాబత్తిన మునీంద్ర, నాయుడుపేట
చరవాణి : 8331844527