విశాఖపట్నం

మహిళా సమస్యలపై ఎలుగెత్తిన పట్టుగొమ్మ కవితా సంపుటి (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుటుంబ బాధ్యతలు భుజాన వేసుకుని ఎన్ని అగచాట్లు, అవమానాలు ఎదురైనా ప్రగతి బాటలో పయనిస్తుంది స్ర్తి. కాబట్టే ఈ సమాజ మనే కుటుంబానికి ‘పట్టుగొమ్మ’ స్ర్తి అని తేల్చి చెప్పారు కవయిత్రి.
ఈ సంకలనంలోని ప్రతి కవితలో ఆడవాళ్ల సమస్యలకు ప్రాధాన్యతనిచ్చి నేడు మహిళలు, ఆడపిల్లలు ఎదుర్కొంటున్న ఎన్నో అరాచకాలు, వరకట్న నిషేధం, మానభంగాలు, క్షీణిస్తున్న రక్త సంబంధాలు, యువత నిరుద్యోగ సమస్య కావేవీ కవితల కనర్హం అన్నట్లు అన్నింటినీ కవితా వస్తువులు చేసి స్ర్తి పడుతున్న మానసిక వేదనను, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని కవితల్లో వ్యక్తీకరించారు.
ముఖ్యంగా మొత్తం మూడువంతుల కవితల్లో కవయిత్రి అమ్మగురించి, అమ్మ అమృతవర్షిణి, అమ్మ అమృతభాండం సృష్టిలో అమ్మ జగజ్జననీ, దైవస్వరూపిణి అని అమ్మకు అమ్మే నిర్వచనం అని, అమ్మంటే మాతృదేవోభవ, ఆడదే అవినికి ఆధారం, కల్పవృక్షం, అమ్మకొంగు, అమ్మానాన్నా ఇలా రాసి భారతీయ సంస్కృతిలో అమ్మ ఉనికికి అద్దం పట్టేరని చెప్పాలి.
ఇంకా జీవించు, జీవనసారథి కవితల్లో అయితే అమ్మ అవ్వగా మారేవరకూ కూడా తన పిల్లల అభివృద్ధి వైపే దృష్టి పెడ్తుందని తెలిపారు.
ఎందరో వీర వనితలను ఆదర్శంగా తీసుకుని వారి అడుగు జాడల్లో నడిస్తే ఆడపిల్ల దారి రహదారి అవుతుందని వనితలందరికీ ఓ సందేశాన్నిచ్చారు.
‘మహిళా సారథి, ఆదర్శ మహిళ, మహిళ, ఆకురాలిన చెట్లు, నేటి మహిళ, కవితల్లో స్ర్తి శతకోటి పరాశక్తులుగా మారాలి అని సందేశిస్తూ... భరతమాత వనె్న గౌరవాలను దేశం నలుమూలలా ఎలుగెత్తి చాటుతుంది నేటి మహిళ అని స్ర్తి ఔన్నత్యాన్ని గగనానికి ఎత్తి చెప్పారు.
నగ్న సత్యం కవితలో దేశభాషలందు తెలుగులెస్స అని మరోసారి చెప్తూ ‘సృష్టిలో తీయనిది’ కవితలో అమ్మకంటె కమ్మనిది తెలుగుభాష అని చెప్పారు.
ఇంక చివరగా మరణం, అంతిమయాత్ర కవితల్లో జనన మరణాలు నీటి బుడగల్లాంటివి, మరణం అనేది అపూర్వపర్వం అని మనిషి జీవితంలో మనిషికి తత్వచింతన అవసరం అని చెప్పి పట్టుగొమ్మ కదంబమాలను ముగించి ముడివేశారు. రాయవరపు సరస్వతి పాఠకులకు తెలిపిన విషయాలనే తిరిగి తనదైన శైలిలో చెప్పడం ఈ సంపుటి ప్రత్యేకత.
**
- పుష్ప గుర్రాల
విజయనగరం
సెల్ నెం.9491762637
**
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.