విజయవాడ

ఇక వేలంపాటలే.. ( చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మల పేరంటంలో ఆ వీధిలోని ముతె్తైదువులంతా కలిశారు.
‘మా చందన చదువు పూర్తయింది. ఇక పెళ్లి చేద్దామని అనుకుంటున్నాం. ఉద్యోగం చేయించాలా, వద్దా? అనే విషయం అత్తారు చూసుకుంటారు’ అంది ఆమె తల్లి.
మగపిల్లల తల్లులైన జయమ్మ, దుర్గమ్మ ఆవిడ దగ్గర చేరారు.
‘మా అబ్బాయి బెంగళూరులో ఇంజినీరు. 60 వేల రూపాయలు జీతం. జాతకం కలిస్తే చాలు. కట్నం అక్కరలేదు’ చెప్పింది జయమ్మ.
‘మా అబ్బాయి కూడా ఇంజనీరే. హైదరాబాద్‌లో 80వేల రూపాయల జీతం. మాకు జాతకం కలవాలనే గోల లేదు. మేము జాతకాలను నమ్మం. మా అబ్బాయి ఈమధ్యనే కారు కూడా కొన్నాడు. భవానీపురంలో మాకో ఇల్లుంది. అది మీ పేరున రాస్తాం. ఎన్నాళ్లని అద్దె ఇంట్లో ఉంటారు చెప్పండి వదినా?’ అంది దుర్గమ్మ.
ఇక చెప్పేదేముంది దుర్గమ్మ కొడుకుతో సంబంధం ఖాయం చేసింది చందన తల్లి.
వేలంపాట పూర్తయింది.
ధుమధుమలాడుతూ ఇంటికొచ్చిన జానకమ్మను ‘అలా వున్నావేం?’ అని అడిగాడు శంకరం.
‘చందన చదువు పూర్తయ్యాకా మనం అడుగుదాం అన్నారుగా. చందన అమ్మను కొనేసింది భారతి. మనం అత్తగారి కట్నం, ఆడపడుచు కట్నం కూడా వదులుకుందామని అనుకున్నాం. భారతి ఆ పిల్ల తల్లికి ఒక ఇల్లు ఇచ్చేసింది. అంటే అమ్మాయి తల్లికి అత్తగారి కట్నంగా 20 లక్షలు. ఓరి దేవుడోయ్! ఇక ఇలా రేట్లు ఇళ్ల అద్దెల్లా పెరిగిపోతుంటే అబ్బాయిలకి పెళ్లిళ్లు ఎలా అవుతాయి?’ అంటూ బావురుమంది.
- అపర్ణాదీక్షిత్, విజయవాడ.
**
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
**
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net