విశాఖపట్నం

అంతర్మథనం (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్యం సమాజానికి అద్దం వంటిదని మన ప్రియతమ నాయకుడు, మొట్టమొదటి ప్రధాని నెహ్రూ అన్నారు. సమాజంలో చోటు చేసుకున్న సామాజిక పరిస్థితులు, బలాలు, బలహీనతలు, ప్రజల కష్టాలు, కన్నీళ్లు, బడుగు జీవుల జీవన పోరాటం, జరుగుతున్న మోసాలు, కుట్రలు అన్నీ సాహిత్యంలో మనకు కనిపిస్తాయి.
రోజూ ఆహ్లాదం కలిగించే ఆ ఉదయం మాత్రం సంతోషాన్ని ఇవ్వలేదు. ఏదో దిగులు, గుండెల్లో ఏదో చెప్పలేని బాధ. ఏదో జరగబోతుందని నా సిక్స్త్‌సెన్స్ హెచ్చరిస్తోంది.
నా భావోద్వేగాల్ని నాలోనే దాచుకుంటూ యాంత్రికంగా స్కూలుకు వెళ్లడానికి తయారవుతున్నాను. ఆ రోజు ఫస్టు పీరియడే క్లాసు ఉంది. చెప్పబోయే పాఠం ఇంటి దగ్గర ఒకసారి చూసుకుందామని అనుకున్నాను. కానీ నా మనస్సు నాకు సహకరించలేదు. అన్యమనస్కంగానే పుస్తకాలు, టిఫిన్ బాక్సు పట్టుకుని స్కూలుకి బయలుదేరాను.
‘‘మాస్టారు మాస్టారు మన మధు చనిపోయాడండీ. అందుకే స్కూలుకి సెలవు ఇచ్చారు’’ ఈ వార్త నాకు చేరవేయడానికి ఆదరాబాదరా పరుగుతో వచ్చిన గోపాలం ఆయాసపడుతూ చెప్పాడు. ఈ వార్త వినగానే నా కాళ్ల కింద భూమి కంపించినట్లు అయింది.
‘‘నీవు చెబుతున్నది ఏమిటి?’’
‘‘అదే మాస్టారు! మధు సరిగా చదవడంలేదని, తనని ఎదిరిస్తున్నాడని, అప్పుడప్పుడు తన జేబులో డబ్బు తీస్తున్నాడని కోపం పట్టలేక వాళ్ల నాన్న కొట్టాడు. ఆ దెబ్బలకి తాళలేక మధు చనిపోయాడు’’
మధు చాలా అల్లరి పిల్లవాడు. మొండిఘటం. ఉపాధ్యాయులకి నిక్‌నేములు పెట్టడం, అమ్మాయిల్ని ఏడిపించడం ఇవే మధు దినచర్య.
అయితే అతను ఇలా ప్రవర్తించడానికి అతను పెరుగుతున్న ఇంటి వాతావరణం, పరిసరాలు అని నా అభిప్రాయం. మానవ జీవితంలో యవ్వన ప్రారంభ అవస్థ చాలా ప్రమాదకరమైనది. పిల్లవాడు బాగుపడాలన్నా, చెడిపోవాలన్నా నిర్ణయం కాబడేది ఈ అవస్థలోనే. అందుకే ఈ వయసులో పిల్లవాడికి తగిన పర్యవేక్షణ, పెద్దల సహకారం అవసరం.
నేటి టీనేజ్ ప్రేమలు చూపించే సినిమాల ప్రభావం మధుపై బాగా ఉంది. మధు తండ్రి కానిస్టేబుల్. ఈ కానిస్టేబుల్ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసు. చాలా రోజులు డ్యూటీ పని మీద బయట ఉంటూ కుటుంబానికి దూరంగా గడపవలసి ఉంటుంది.
ఈ కానిస్టేబుళ్లు తమ కుటుంబాలను పట్టించుకోవడానికి కుదరదు. డ్యూటీ మీద ఊళ్లు తిరుగుతారు. పిల్లలు తల్లి దగ్గర గడుపుతారు. వారికి తల్లి దగ్గర భయం ఉండదు. తల్లి మాట లక్ష్యపెట్టరు. పెంకిగా తయారవుతారు. మద్యానికి అలవాటు పడతారు. నెట్లలో అశ్లీల దృశ్యాలు చూస్తారు. అమ్మాయిల్ని ఏడిపిస్తారు.
మధు కుటుంబ పరిస్థితి కూడా ఇంతే. తండ్రికి ఉద్యోగరీత్యా ఎక్కువ సమయం బయట గడపవలసి వస్తుంది. ఇంటి దగ్గర తల్లి భయంలేదు. అందుకే మధు ఇలా తయారయ్యాడు అనిపించింది.
ఎంత కోపం వచ్చినా వివేకం కోల్పోయి విచక్షణా జ్ఞానం కోల్పోయి, మధు తండ్రి కొడుకుని కాళ్లతో కుమ్మి శిక్షించడం మానవత్వం కాదు. పోలీసు వ్యవస్థలో చాలామంది ఇలా కఠినంగా ఉంటారు. దీనివల్ల పరిణామాలు ఒక్కోసారి ఇలాగే ఉంటాయి.
ఆలోచనలు కట్టిపెట్టి పుస్తకాలు, టిఫిన్ బాక్సు ఇంటి దగ్గరే ఉంచేసి బయలుదేరాను.
నేను స్కూలుకి వెళ్లేసరికి స్ట్ఫారూంలో ఉపాధ్యాయులందరు సమావేశమై చర్చిస్తున్నారు.
‘‘ఎంత కోపం వచ్చినా ఆ తండ్రి అలా పశువులా ప్రవర్తించడం ఏమిటి?’’
‘‘పోయిన కొడుకు తిరిగి వస్తాడా? ఆ తండ్రికి అంత కోపం ఏమిటి?’’
‘‘పెంకివాడే కాని ఎవరు ఏ పని చెప్పినా చిటికెలో చేసేవాడు’’
మధు గురించి స్ట్ఫా రూంలో ఉపాధ్యాయుల మధ్య సంభాషణ ఇలా సాగిపోతుంది.
తల్లిదండ్రుల వల్లనే పిల్లలకి కుటుంబ జీవితంలో అనుబంధాలు తెలుస్తాయి. కుటుంబ జీవితంలో పరస్పర ప్రేమలు, వినయ విధేయతలు, సంస్కారం, పరోపకారభావం వంటివి కలుగుతాయి. పాపం మధుకి తన కుటుంబంలో ఇవేవీ దక్కలేదు. అందుకే ఇలా తయారయ్యాడు అనుకున్నాను.
‘‘పోస్టుమార్టం చేసి శవాన్ని ఇంటికి తీసుకు వస్తారు. మనం అందరం మధు ఆత్మశాంతికి ఓసారి ప్రార్థన చేసి చివరిచూపుగా వెళదాం’’ అన్నారు ప్రధానోపాధ్యాయులు.
మధు ఆత్మశాంతికి ప్రార్థన చేసిన తరువాత మధు ఇంటికి వెళ్లాం. మేము వెళ్లేటప్పటికి ఏడుపులు వినిపిస్తున్నాయి. మమ్మల్ని చూసిన మధు తండ్రి ‘‘చూశారా మాస్టారు! మా వాడి జీవితం ఎలా ముగిసిపోయిందో. మమ్మల్ని అంతులోని క్షోభకి గురి చేసి వాడి దారి వాడు చూసుకున్నాడు’’ ఏడుస్తూ అన్నాడు.
‘‘ఈ సంఘటన మీకు జీవితాంతం అంతులేని క్షోభని కలిగించేదే. అయితే అయిపోయిన దానికి ఏం చేయగలం మనం? ఈ పరిస్థితుల్లో ఆత్మస్థైర్యాన్ని అలవరచుకుని ధైర్యంగా ఉండడమే’’ ప్రధానోపాధ్యాయుడు అంటున్నారు మధు తండ్రితో. మిగతా ఉపాధ్యాయులు కూడా మధు తండ్రిని తమతమ రీతుల్లో ఓదారుస్తున్నారు. నేను మాత్రం ఆ పని చేయకుండా అలా నిలబడి ఉండిపోయాను.
నాకు మధు తండ్రి మీద కోపంగా ఉంది. పశువులా ప్రవర్తించి మధు చావుకి కారకుడయి ఇప్పుడు ఇలా ఏడుస్తున్నాడు. అయినా అతన్ని ఏమీ అనలేదు. ఒక్కోసారి వౌనంగా ఉండిపోవడం అన్నిటికన్నా ఘాటైన విమర్శ వంటిది.

- గూడూరు గోపాలకృష్ణమూర్తి, పాల్‌నగర్, విజయనగరం-3. సెల్ : 7382445284.