విశాఖపట్నం

కరవు (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊళ్లకు ఊళ్లే నోరు తెరచి
వేయి కళ్లతో వేచి ఉన్నాయి
ఆల్చిప్పలై
ముత్యాలు రాలకపోవా
చినుకులుగా మారకపోవా అంటూ

ఎటు చూసినా ఎండమావులే
వడదెబ్బలిక సహజ చావులే
దేశమే ఎడారి కొలిమి మరి

మండుటెండలో గండు కోయిల
గొంతెండి పాడుతోంది
శాపనార్థాల మరణగీతం
‘మానవుడా సృష్టిలో
కృతఘు్నడవు నీవే’నంటూ
నీటి జాడలు
ఏడ జూసినా కానరావు
కనురెప్పల
మాటున తప్ప

- డాక్టర్ డి.వి.జి. శంకరరావు,
మాజీ ఎంపి, పార్వతీపురం,
విజయనగరం జిల్లా.
సెల్ : 9440836931.
***

బాల్యం (మనోగీతికలు)

అందమైన బాల్యం
తిరిగి రానిది
మరపు రానిది
తీయనైనది
హాయియైన బాల్యం!

కులాలు తెలియనిది
మతాలు ఎరుగనిది
హద్దులు లేవన్నది
సున్నితమైన బాల్యం

దాపరికాలు లేనిది
ద్వేషాలు ఎరుగనిది
మోసాలు తెలియనిది
మధురమైన బాల్యం
ఏది చెప్పినా వినేది
ఎవరు పిలిచినా పలికేది
ఎక్కడైనా మారనిది
ముచ్చటైన బాల్యం!

ఆటలలో ఆడేది
పాటలలో కదిలేది
కథలకు ఊ కొట్టేది
మాటలకు మైమరచేది
మురిపెమైన బాల్యం!

బుడిబుడి అడుగులతో
చిట్టిపొట్టి మాటలతో
ముద్దుముద్దు పలుకులతో
అలరిస్తూ
మది గదిని తడుముతూ
మురిపాలు మూటగట్టే
ముచ్చటైన బాల్యం

- గంటి కృష్ణకుమారి,
బాబామెట్ట,
విజయనగరం.
సెల్ : 9441567395.
***

జ్ఞాపకాల సందడి (మనోగీతికలు)

ఒక్కసారి తలచినా తనువు పులకరించు
అందమైన అనుభూతితో
మనసు మైమరచు
ముచ్చటైన ముద్దుగుమ్మ
అది మా ఊరు
తాతయ్య అమ్మమ్మల
ప్రేమలకు నెలవు
కొండపైని హోయలతోటి
జారే జలపాత జోరు
సుస్వరాల గజ్జెకట్టి
పారే సెల ఏటి గలగలలు
గున్న మావి తోపులోంచి
తొంగి చూసె
చిలిపి చిలక జంటలు
పచ్చనైన పైరులోంచి
పాలకంకి పకపకలు
చుట్టు చేరి గెంతులేసె
పిచ్చుకమ్మల సంబరం
పిల్ల కాలువ గట్టుపైన
జారిపడిన జ్ఞాపకం
ఊరి మధ్య కోవెలలోని
సాములోరి సత్సంగం
భక్తితోటి భజన చేసే
భక్త సందోహం!
ముచ్చటైన ముగ్గుల్లో సిగ్గుపడె గొబ్బెమ్మల సింగారం
గొబ్బరాకు మూరాలతో
పిల్లకాయల సంబరం
సంధ్యవేళ గోధూళి పరిమళం
గూడు చేరె జోరులోన
గువ్వ జంటల బారుల తోరణం
అరుగు మీద అమ్మమ్మ పలకరింపు
అటక మీద గంప నుండి
అప్పచ్చుల ఘుమఘుమ
గాది నుండి ధాన్యరాశుల
ధీటైన స్వాగతం
ఒక్కటేంటి తలచుకుంటె
బరువెక్కిన హృదయం
అందమైన అనుభూతుల
సమాహారం నాటి ఊరు
ఒక్కసారి తలచినా
తనువు పులకరించు
జ్ఞాపకాల సందడితో
మనసు మూగబోవు...

- శ్రీమతి సిహెచ్‌వి లక్ష్మి
సెల్ నెం : 9493435649