విశాఖపట్నం

గంగమ్మా... భువికి రావమ్మా! (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విష్ణుమూర్తి అంగుష్టమునందు
ఉద్బవించిన గంగమ్మా
ఉర్వి పైకి రావమ్మా
శివుని జటాజూటాలలో
చిక్కుకున్న గంగమ్మ
జగానికి రావమ్మా
పంచభూతాలలో
నీవొకదానివి గంగమ్మా
ప్రాణికోటికంతటికీ
అవసరమైన గంగమ్మా
పృధ్విపైకి రావమ్మా
నీవు లేని జగము నిర్మానుష్యమ్ము
జీవకోటికంతటికీ
నీవే జీవనాధారము
బంగారు పంటలు పండించమ్మా
దుర్భిక్ష్యాన్ని నీవు దూరం చేయమ్మా
నీలోటు మాకెప్పుడూ
రానీయకమ్మా
నిత్యం నిన్ను పూజిస్తుమమ్మా
భగీరథుని కోరిక మేరకు
ఏనాడో భువికి వచ్చినావమ్మా
అపర భగీరథులమై
మానవాళి నీ రాకకు
ఎదురు చూస్తున్నామమ్మా
సుజలం ఉంటేనే
సుఫలితం వస్తుందమ్మా
సుఫలం రావాలంటే
నీ కరుణ చూపాలమ్మా
మహిలోన మానవుల
కోర్కె తీర్చుమమ్మా!

- చెన్నాలక్ష్మణరావు,
పాచిపెంట, విజయనగరం జిల్లా.
సెల్ : 8985914107.
**

విశ్వవిద్యాలయాలు

విశ్వవిద్యలొసగు విద్యాలయములంట
భావి తరముకిదియె బాట వేయు
సకల శాస్త్ర నిపుణ సానపట్టెడి చోటు
చేటు కలిగె నేడు చీడపట్టి
అధిక సమయమేమొ అరుపులు కేకలు
విద్య నేర్చు చోట వికట కళలు
భావ స్వేచ్ఛ హెచ్చె బడబాగ్ని చర్యలు
నిత్య యుద్యమాలు నీచమయ్యె
రాజకీయ రొంపి రాజ్యమేలుచునుండె
తలయు తోక లేని తగవులొచ్చె
చేటు చేయు వారిని చేరదీసి
వింత వాదమిపుడు విద్యాధికులు చేయ
అర్ధమవ్వకుండె అసలు నీతి
మేలుకొనుడు యువత మేలైన రీతిలో
చదువులెల్ల నేర్చు చక్కగాను
దేశభక్తి నింపి దేశాన్ని నడిపించు
విలువ తోడ మంచి విద్య పెంచు
- చావలి శేషాద్రి సోమయాజులు,
పాచిపెంట, సెల్ : 9032496575
***

ఏది పెద్దరికం?

ఎన్నికల్లో గెలిచి
హామీలు మరచిన
నాయకులది పెద్దరికమా?
సంప్రదాయాలకు తావీయక
పిచ్చిపిచ్చి నటన చేస్తున్న
కథానాయకులది పెద్దరికమా?
కామంతో కళ్లు మూసిన వారిని
నిర్దోషులని
తీర్పునిచ్చిన వారిది పెద్దరికమా?
బినామీల పేరుతో
రైతు రుణాలు
మేసే వారిది పెద్దరికమా?
రోడ్డు పక్కన నివసించే
నిర్భాగ్య జీవులను
వేధించడం పెద్దరికమా?
నిరుద్యోగులను నట్టేట ముంచి
టోపీ పెట్టిన వారిని
శిక్షించడం పెద్దరికమా?
అధికార దాహంతో
అవినీతికి అలవాటైన
చీడపురుగులది పెద్దరికమా?
శ్రామికుల శ్రమను
దోపిడీ చేసి
సంపద మింగే వారిది పెద్దరికమా?
- కుబిరెడ్డి చెల్లారావు, చోడవరం, విశాఖ జిల్లా. సెల్ : 9885090752
***

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి.email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.