దక్షిన తెలంగాణ

తెలుసుకోలేకపోయా (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్లల్లో కనబడుతున్న
ఆ ఆనందం చూసి..
గతంలో జరిగిన సంఘటనలు
మర్చిపోయావేమో అనుకున్నా..
మాటల్లో వస్తున్న
ఆ సంతోషం చూసి
గతాన్ని మర్చి
మారిపోయావనుకున్నా..
ఆనందం, సంతోషం వెనుకున్నా..
మృగత్వం తెలుసుకోలేకపోయా..
ఆనందమనే మంటల్లో కలిసి
మగ్గిపోయా..

- గుండు రమణయ్య
పెద్దాపూర్, జూలపల్లి
సెల్.నం.9440642809
**

నాన్న! (మనోగీతికలు)

పసి వయసులోన పాదాలు కందునని
తన భుజాలే స్వారిచేసే గుర్రాలుగా చేసి..
ఆడించును నాన్న!
తొలి అడుగులు వేసేటప్పుడు..
తన అడుగులు ఆదర్శంగా చూపుతూ
నడిపించును నాన్న!
వేసే ప్రతి అడుగు ముందడుగై
గమ్యం చేరేవరకు వెన్నంటి నిలుచును నాన్న!
పలువురు మెచ్చే బిడ్డగా..
ఉత్తమ పౌరుడు కావాలనీ
విద్యాబుద్ధులు నేర్పి విజ్ఞున్ని చేయుటకు
పాఠశాలకు పంపు బాధ్యత తోడ నాన్న!
అనుక్షణం ప్రగతిని కాంక్షిస్తూ..
గెలుపుబాటలో నడిచేందుకు
ఆత్మస్థైర్యాన్ని నింపుతూ..
దిశానిర్దేశం చేయును నాన్న!
తెలియక వేసే అడుగు ముళ్లబాటే
ముళ్ల బాటయని భావించిన వేళ..
గద్దించి పథ నిర్దేశం చేయును నాన్న!
ఒక్కో మెట్టు ఎక్కుతూ
ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పుడు
బిడ్డ పురోగతిని చూసిన నాన్న
తానే ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కినట్లు భావించి
అమితోత్సాహాన్ని పొందుతాడు నాన్న!
నాన్న త్యాగానికి ప్రతీక!
నాన్న భగవంతుడిచ్చిన..
ఓ అపురూప జ్ఞాపిక

- బాలసాని కొమురయ్య
భోజన్నపేట
సెల్.నం.9912651877
**
ఆశయం (మనోగీతికలు)

జ్ఞానంతోనే
జీవన రీతులు మారవు సుమా!
గుండె ధైర్యం మెండుగుంటేనే..
జీవన యానం మనోహరం అని తెలుసుకో!
కాలంతో కలిసి
అడుగులేస్తేనే కదా..
కాలం కలిసొస్తుంది!
ఆశయ సాధనలో..
అవంతరాలు, ఆటంకాలు
ఎదురవడం సహజం!
వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలి!
ప్రతి ఓటమినుండి..
ఓ గుణపాఠం నేర్చుకుని
గెలుపు బాట పట్టాలి!
ఆత్మ విశ్వాసమే ఆలంబనగా..
నూతన ఉత్సాహమే ఆభరణంగా
ఒక్కో మెట్టు ఎక్కుతూ..
ఆశయాన్ని సాధించాలి!
జయకేతనం ఎగరేయాలి

- చెన్నమనేని ప్రేంసాగర్ రావు
కరీంనగర్
సెల్.నం.9912118554
***

ఓ చెలీ! (మనోగీతికలు)

ఓ చెలీ! చెప్పాలని వుంది
నా మనసులోని మాట
కానీ...
పెదవి దాటి రావడం లేదు ఈపూట!
ఏ మని చెప్పను? ఎలా చెప్పను?
మూగవోయిన.. హృదయ వీణను మీటి
నవరాగాలు పలికించనా?
చిలుకలతో.. తీపి కబురు పంపించనా?
మరు మల్లియలతో
రాయబారం జరుపనా?
నా మదిలోని
ఊసులను నేనెలా పంపను?

- బొమ్మకంటి కిషన్
రాంనగర్, కరీంనగర్
సెల్.నం.9494680785
**

వీరులు! (మనోగీతికలు)

శత్రు శిరమ్మున
శివతాండవ మాడినట్టి
శివ స్వరూపులు
తెలంగాణ వీరులు
ఆత్మజ్యోతులు వెలిగించి
తరతరాల చీకట్లు
చీల్చినట్టి భాను తేజులు
తెలంగాణ వీరులు!
అరి శిరస్సులు నుత్తరించి
అండగా నిలిచిన
ఆత్మబంధువులు
తెలంగాణ వీరులు
అమ్మ గుండెను పిండిన
స్వార్థపరుల గుండెల్లో
నిద్రించిన శత్రుభయంకరులు
తెలంగాణ వీరులు!
కూడు గూడు లేక
కూలిన జీవితాలకు
అండగా నిలిచిన ఆప్తులు
తెలంగాణ వీరులు
వీరులు నడిచిన బాటలో
పౌరులు నడిచిననాడే
తెలంగాణ వీరులకు
నిజమైన జోహారులు

- జాదవ్ పుండలిక్ రావు,
భైంసా, ఆదిలాబాద్ జిల్లా, సెల్.నం.9441333315
**

అద్దె మనిషి స్వతంత్రం (మనోగీతికలు)

పిల్లల్ని వెంటబెట్టుకుని
ఇల్లిల్లూ తిరిగే
ఏడిండ్ల పిల్లి
ఏ అర్ధరాత్రికో అవసరపడుతుందని
ఆటోట్రాలీ అడ్రస్సు
లారీ డ్రైవర్ ఫోన్ నంబర్
డైరీలో నెమలి ఈకలా దాచుకుని
ఖాళీ రాగమెత్తుకుని
ఇంకో పిట్టగూటికి తరలిపోయే
సంసార రథం
వంద కిలోల హాయినిద్రా గానం,
ఆకాశంలో తేలిపోయే విమానం
తూనిగలా చుట్టూ తిరుగుతున్నట్టు
ఎడమచెయ్యి అడ్డుపెడితే రైలు
కార్టూన్ బొమ్మలా మోకరిల్లినట్టు
గూటి పడవలాంటి ఇల్లు
మసక మసకగా
గాలి ఊయలూగుతున్నట్టు,
గృహ ప్రవేశానికి వొచ్చిన
ఆవు పాదాలకు నడకనేర్పుతున్నట్టు
కలల సీతాకోక చిలుకలు
ఎగురుతూ వుండగా
ఎక్కడో దూరాన
అద్దె వసూళ్ల పులి గాండ్రింపు
ఉలిక్కి పడ్డ
గోడకు మేకుదిగని
అద్దె మనిషి స్వతంత్రం
చల్లగా దూసుకుతున్న ఫ్యానుగాలి
టిక్ టిక్ మంటూ పనె్నండుపైన
మూడు ముల్లులు ఒక్కటైన కాలం
నిద్దుర చెదిరిన రాత్రి
మూకుమ్మడి నవ్వుల రాగం
కలలో కూడా సొంతిల్లు రాదంటూ
సత్యం పలికే
బల్లి పలుకులు సంగీతం

- గజ్జెల రామకృష్ణ
భూదాన్ పోచంపల్లి, నల్లగొండ జిల్లా
సెల్.నం.8977412795
**

పదండి ముందుకు.. (మనోగీతికలు)

స్వార్థపరుల ఉచ్చుల్లో తగులుకొని
యువత చతికిలపడుతూ
చీకటి రాజ్యంలో ఆర్తనాదం చేస్తోంది
శాంతి చిహ్నాలను ఉరికంబమెక్కిస్తున్నారు
అశాంతి అక్రమాలతో జనం తల్లడిల్లుతూ
పెడబొబ్బలతో మారణహోమం సృష్టిస్తున్నారు
అబలల ఆక్రందనలు గుండెల్ని
పగులదీస్తుంటే డమరుక ధ్వని మ్రోగినట్లైంది
పీడిత జనం శివమెత్తుతూ నరాల్ని
పీకివేస్తుంటే సప్తసాగరాలు పొంగినట్లైంది
జనంలోకి రమ్మని పిడిగ్రుద్దులు గుద్దుతూ
పిచ్చివాన్నిగా లాక్కెల్లుతూ నిజంలోకి నెట్టారు
జ్ఞానంతో నా కలం ఊపిరి నింపుకొని
జన జాగృతికై నా గళం బయలదేరుతోంది
నడుం బిగించి నాతో రండి
నిద్రపోతున్న ఉదయాన్ని తట్టిలేపుదాం
తరతను బేదాలకు
అంతం ఎపుడని ప్రశ్నిద్దాం..!
గురి పెట్టికూర్చున్న లక్ష్యసాధనతో
వ్యక్తి మహాశక్తిగా రూపాంతరం చెంది
తెలిసిన విషయ పదార్థాల ఆవులింతల్లో
తెలియని మోక్షి బీజాల్ని మేల్కొల్పుతూ
అభ్యుదయ భావాల నినాదాలు పంచుదాం..!!
- రాకుమార, గోదావరిఖని
సెల్.నం.9550184758