ఉత్తర తెలంగాణ

ఆలోచన ఆకాశంవైపు! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను ఉదయం లేచి తయారయి అమ్మ పెట్టిన సద్దన్నం తిని బడికి బయల్దేరాను. అలా బయల్దేరి నడుస్తూ వెళ్తుంటే నా కంటికి అందమైన దృశ్యాలు కనువిందు చేశాయి.
ఆకాశంలో ఎగురుతున్న పక్షిని చూశాను. నా మనసులో ఆలోచన మొదలైంది. పారుతున్న సెలయేరును చూశాను. పచ్చని పొలాల మధ్య ప్రకృతి అందాలకు పరవశుడినై పరుగు పరుగున బడికి చేరాను. ప్రార్థన ముగిసింది. తరగతులు మొదలయ్యాయి. మా తరగతిలో మాస్టారు పాఠం చెబుతున్నారు. నా రాకను గమనించి రావోయ్ దొరబాబు రఘుగారు, వచ్చి ఆసీనులు కండి అన్నారు. వెళ్లి కూర్చున్నాను.
మనసంతా ఆవో ఆలోచనలు, ఏదో చేయాలన్న తపన. కిటికీ గుండా బయటకు చూశాను. ఆకాశంలో ఎగురుతున్న విమానం కనిపించింది. దానిని చూశాను. చూపులన్ని ఆ విమానం వైపే. మాస్టారు మళ్లీ కొప్పడ్డారు. తరువాత ఒక రోజు నాకు పత్రికలో విమానం యొక్క చిత్రం కనిపించింది. దానిని చూశాను. చూపులన్ని ఆ విమానం వైపే, మాస్టారు మళ్లీ కొప్పడ్డారు. తరువాత ఒక రోజు నాకు పత్రికలో విమానం యొక్క చిత్రం కనిపించింది. దానిని భద్రంగా తీసి దాచుకున్నాను. మరునాడు తరగతి గదిలో తీసి చూస్తున్నాను. మాస్టారు వచ్చి లాగి మడిచి పారేశారు. బాధేసింది. మనసు మూగబోయింది. సాయంత్రం వరకు ఎలాగో ఒక లాగా తమాయించుకున్నాను. అందరూ బయటకు వెళ్లిపోయారు. మెల్లిగా పారవేసిన విమానం బొమ్మను తీసుకొని హృదయానికి హత్తుకొని బయల్దేరాను.
నాకు ఇంటిదగ్గర చిరిగిన గాలిపటం కనిపించింది. దానిని మెళ్లిగా దానిలోని కర్రపుల్లలను తీసి వాటి ఆధారంతో విమానం చేయాలనుకున్నాను. దానికోసం మందమైన కాగితం తీసుకొని కర్రపుల్లల సహాయంతో విమానం తయారు చేశాను. తయారయిన దానిని చూస్తూ మురిసిపోయాను. నన్ను నేను మైమరిచిపోయాను. నేను బడికి రాలేను. అని నాతోటి విద్యార్థులను తీసుకొని నన్ను వెతుక్కుంటూ మా మాస్టారు వచ్చారు. నేను తయారుచేసిన విమానాన్ని, నన్ను గమనించి ఎప్పుడూ లేనా? చదివేది ఏమైనా ఉందా అంటూ నేను తయారు చేసిన విమానాన్ని ఎగరేశారు. అప్పుడు నన్ను ఎవరో ఊరినుంచి దూరంగా విసిరివేసినట్టుగా అనిపించింది. అందరూ చప్పట్లు కొడుతుంటే ఆకాశం వైపు చూశాను. ఎగరేసిన కాగితపు విమానం ఆకాశంలో చక్కర్లు కొడుతుంది. మాస్టారు చూశారు. ఆనందించారు. నాతోటి విద్యార్థులందరు నన్ను అభినందించారు.
మా మాస్టారు నన్ను, నా విమానాన్ని, విద్యార్థులందరిని తీసుకొని నా ఆవిష్కరణ గురించి వివరించడానికి జిల్లా కలక్టర్ వద్దకు వెళ్లారు. అప్పుడు ఆనందానికి అవధులు లేవు! నాలోని సృజనాత్మకతను కలెక్టర్ అభినందించారు. భవిష్యత్తులో నీవు శాస్తజ్ఞ్రుడినవుతావని దీవించారు.

- డాక్టర్ గంధం విజయలక్ష్మి నిజామాబాద్ సెల్.నం.9948181458