నెల్లూరు

భవిష్యత్ వాస్తవాన్ని తెలిపిన ఎక్కడున్నాడమ్మా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతవారం మెరుపులో పిడుగు పాపిరెడ్డి ఓ గొప్ప భవిష్యత్ కవితను మనముందు వుంచారు. భవిష్యత్‌లో మనం మాట్లాడేందుకు ఒక మనిషి కూడా కనబడకుండాపోతాడేమో అన్న బాధను వ్యక్తపరిచిన విధం బాగుంది. నిజంగా ఈనాడు మనిషి ఇంటెర్నెట్, సెల్‌ఫోన్ల బారినపడి మానవసంబంధాలను మరచిపోతున్నాడు. కార్టూన్ కూడా కవితకు తగ్గట్టుగా బాగా కుదిరింది. భవిష్యత్ తరాలు మనిషి ఎక్కడున్నాడు అని వెతుక్కోవాల్సిన పరిస్థితి దాపరించవచ్చని చెప్పకనే చెప్పారు రచయిత. గొప్ప సందేశాత్మక కవితను మనకు అందించిన పిడుగు పాపిరెడ్డి గారికి ధన్యవాదములు.
- దూర్తాటి వేణుమాధవ్, మండపాలవీధి, నెల్లూరు
- ఆశాలత, వెంకటగిరి, రవి-యస్.కొండ.

హాస్యభరితంగా సాగిన
ముందుమాట
ఇద్దరు రచయితల కలాల నుంచి జాలువారిన ముందుమాట హాస్యకథ చివరి వరకు నవ్వులు పూయింది. కవితలో వాడిన పదాలను ఇక్కడ అన్వయిస్తే మోపూరు, సుభద్రాదేవి గారు తమ కలాలను వెటకారం అనే మజ్జిగలో చమత్కారం అనే కవ్వంతో చిలికి చిలికి నవ్వులజల్లును మనపై చల్లారు.
నిజంగా ఇలాంటి కవులు మనకు అక్కడక్కడ కనబడుతూనే వుంటారు. వాళ్ల దృష్టిలో వాళ్లే కవులు. మిగతా వాళ్లు పనికిరానివాళ్లని, వాళ్లవి కథలే కాదని వారి అహంకార అభిప్రాయం. ఇలాంటి వాళ్ల దగ్గరకు తన పుస్తకానికి ముందుమాట రాయమని వర్ధమాన కవి వెళ్లడం, అతను తిట్టి పంపడం వంటి సంఘటనలతో ముందుమాట కథ మొత్తం సరదాగా సాగింది.
- ఇసనాకుల వెంకటేశ్వర్లు, అద్దంకి
- హేమలత పాడి, రాయల్‌చెరువు, తిరుపతి
***

రచనలకు ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net