రాజమండ్రి

సందేశాత్మకం.. చంద్రవర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వమెప్పుడూ మానవతా ద్వారంలోనే పయనించాలి. కవితలెప్పుడూ మనిషితనం వాసన వేయాలి. ఇవి ‘మనిషి కోసమే!’ అంటున్నాడు కవి మిత్రుడు ఎపిఎస్ భగవాన్ (్భగ్వాన్) తన ఇటీవలి కవితా సంపుటి ‘చంద్రవర్షం’లోని ప్రారంభ శీర్షిక. 36 ఏళ్లుగా వృత్తిరీత్యా శాస్త్ధ్య్రాపకుడు. మీదు మిక్కిలి పర్యావరణ రక్షణ, సామాజిక చైతన్యం నింపుకున్న ఆర్ద్రతాక్షరాల్ని అందంగా సుతారంగా అందిస్తూన్న - ఆర్భాటాలు తెలియని వౌనమునిగా - కవి భగ్వాన్ కవిత్వాన్ని ప్రేమించడం అభినందించడం అందరూ చేస్తుంటారు.
‘తమ భాషను మరిచిన వాళ్లు’లో మనం మాతృభాషను ఎంతగా కోల్పోతున్నామో, విలువలను, మూలాలను మర్చిపోతున్నా మనలోకి మనం తవ్వుకోవడానికి ఉపయోగపడుతుందన్న వాస్తవాంశం అక్షరాలా సత్యం. ఎందుకంటే రచయితలెప్పుడూ సత్యాలే చెప్పాలన్న నానుడి ఉండనే ఉంది కదా?! తెలుగుకు ప్రాచీన హోదా వచ్చిందనుకుంటున్నాం. కాని నిజంగా భాషను బతికించుకుంటున్నామా అని మనల్ని ప్రశ్నించుకోవాల్సిన తరుణంలో / తమ నాలుకల మీద తమభాష / అమృతంలా కురిసిన ఈ రోజు / తమ తలల మీద భాష / వజ్ర కిరీటంలా మెరిసిన ఈ రోజు / కోసం కవితోబాటు మనమూ ఎదురుచూద్దాం.
పిట్టలు, మొక్కలు తోటకు వీడ్కోలు పలకడం కూడా కనిపిస్తుంది. అదీ ఆద్యంతమూ మనని చదివిస్తుందీ కూడా. ‘పాఠం పేరు పర్యావరణం’లో ‘నా సైన్సు పుస్తకాన్ని ముక్కుతో పొడిచి పొడిచి/నాలో మూసుకున్న తలపులన్నీ తెరచి తెరచి / ఎక్కడ నుంచి ఎగిరి వచ్చిందో - అక్కడ /ఏదో మర్చిపోయినట్టు హఠాత్తుగా - అక్కడ / ఏదోమర్చిపోయినట్టుగానే వెళ్లిపోయిందంటారు. ‘పిట్టలా బతకాలి’ మనిషి - పిట్టా ఇద్దరూ ముఖ్యమే. పిట్టనుకొట్టే మనుష్యుల్ని మనుషులనచ్చా అన్న పరివేదన / పిట్టంటే ఎగిరే మనిషి కదా - మనిషంటే నడిచే పిట్ట కదా, ఇక ఇప్పుడు మనకు కావల్సింది పక్షిభాషణ కవిత్వాలు, పక్షి విహరణ కావ్యాలు / అంటున్నప్పుడు మనందరి గుండె, ఒళ్లు, కళ్లు వేదనాభరితంగా జలదరించడం, చెమరించిన కళ్లు అనుభూతులకు పరాకాష్టగా అక్షరాలా కవిత్వ వౌతుంది. దీనికి నిదర్శనంగా ‘మొక్కల మనిషి అతడు’లో ఇలా అంటారు. ‘మొక్కలూ మనుషులూ’ వేరు వేరు కాదనీ / ఈ మనుషులందరూ గతజన్మలో మొక్కలేననీ / జన్మాంతర బాంధవ్యాల్ని వెలార్చడం జరిగింది.
ఇక స్వీయానుభవ సారాన్ని -దిగులు బెంగల్లోంచి ఆత్మ సంతృప్తుల్నీ అక్షరాలుగా మార్చడమే కాదు, జీవన సత్యాన్ని చెప్పిన శీర్షిక ‘తోటకు వీడ్కోలు’లో పదపదంలోనూ పలుకరిస్తుంది. ‘ఒక రోజు బస్సు ప్రయాణం’ ఒక ప్రయాణనుభవాన్నించి జన జీవన సాహిత్యం, రోజువారి ఉరుకులు, పరుగులు అన్నీ సాక్షాత్కరింప చేశారు.
శీర్షికల పేర్లు - వాటి నుంచి కవిత్వానుభవసారం ఎలాగో ఎంతమందికి తను ప్రకటించిన అంశాలు అవగతం కావాలో బేరీజు వేసుకున్నప్పటి ఆనందాన్ని ప్రకటించడం చూస్తాము. ‘అరుగు’ ‘నది భాష’ రాత్రికి మరో పేరు కవిత్వం’లలో కవితలు రాసుకోవడం గురించి, నదిలోని పడవల్ని కవిత్వంగా పలకరించడం, గదిలోని మదిలో కవిత్వాన్ని సరళ సౌందర్యాల్ని కవిత్వ చరణాల ఒకగొప్ప కవితాసంపుటిని మనమూ చదవటం ఎలాగో నేర్పుతున్నాడు భగ్వాన్ అనిపిస్తుంది.
ఇక కవిత్వానుభూతికి అర్థం - అద్దం పట్టే శీర్షికలు ‘కుర్చీ’ ‘ఆల్బమ్‌కు అమ్మపేరు’ చేరాయనే చెప్పాలి. గురు భక్తిని వస్తుకవితగా చెప్పడంలో ప్రయోగాత్మకంగా మాష్టారు కూర్చున్న కుర్చీ నుంచి గతానుభవాల్ని తెల్పారు. అమ్మ ఫోటో లేని ఆల్బంను పిల్లలకు వివరించే సన్నివేశం సంఘటనల నెమరు వేతలు, వెతలు కవితలు కవితల్లోంచి వెలువరించడం ఆర్ర్దాక్షరాల కలబోత నెమరువేతకదా ఇక ఒక కృతజ్ఞతా భావం అర్పణగా ప్రకటించడం దానికి ‘అర్చన’ శీర్షికలో వివరించడం జరిగింది. తన కవితను ముద్దాడిన సహృదయ సౌరభ కిరీట ధారి, పరిశుభ్ర ప్రేమికుడిని తలపోయడంలో గిడ్డి సుబ్బారావు గారికే గౌరవం దక్కింది. ఇలాంటి సహృదయ కవి భగ్వాన్ని అభినందిస్తున్నాను
ఎ.పి.ఎస్. భగ్వాన్‌కు కవిగా 38 ఏళ్ల అనుభవం ఉంది. ఈయన వెలువరించిన సంపుటాలు సగటు కవిత్వ ప్రేమికుల్నలరించి కవిత్వ పరిధుల్నించి అసలు కవిత్వమంటే ఏమిటో తెల్పాయి. విశేషంగా విశే్లషించే అనుభవశీలుర వరకూ విస్తరించాయి. అందుకే ‘శబ్దాల్ని ప్రేమిస్తూ’ నేను నాయకుడ్ని కాదు కవిని/అందుకే - నాకు సన్మానం జరిగేది దండలతో కాదు గుండెలతో’ అనుకుంటూ తన కవితా జైత్రయాత్రని 1992లో ప్రారంభించారు. ఏది తీసుకున్నా సమగ్రత సంక్షిప్త పదాల మధుర బోధనాబలం ఆద్యంతమూ చదివింప చేస్తుంది. దీనికి ఉదాహరణలు ‘వడ్లబండి’ ‘బల్లకట్టు’ ‘ఏటిఒడ్డున ప్రయాణం’, సహజాతాలైన చిత్రణలూ చిన్నప్పటి పల్లెటూళ్లని, బాల్యం, అమ్మ, నాయనమ్మలు, యాంత్రిక కాలుష్యాల్ని, అనుబంధాల విద్వేషాల్ని, అనేక సందర్భానుసారపు వస్తువులుగా స్వీకరించారు కవి.
మొత్తానికి ఆర్ద్రత - మనసు నింపుకున్న స్థితులు విలక్షణ ప్రారంభం, విశిష్టమైన సందేశాత్మకంగా ముగింపుల్నివ్వడం ఆయన కవితా నిర్మాణ చాతుర్యమనే చెప్పాలి. ఇలా మానవ సంబంధాల్ని ప్రాకృతిక బంధాలుగా కవిత ‘చంద్రవర్షం’తో మళ్లీ మనముందుకు వచ్చారు. అందుకే ‘ఈ చంద్రహర్షం - వర్షంలో తడుస్తున్నాను.

***
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- వి.ఎస్.ఆర్.ఎస్. సోమయాజులు, కాకినాడ, ఫోన్ : 9441148158