రాజమండ్రి

నాన్నా... ఎత్తుకోవూ!(కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిటీలోకెల్లా పెద్ద పారిశ్రామికవేత్త నిరంజన్‌గారి కొడుకు పదహారవ పుట్టినరోజు వేడుకలు వారి తోటలోని ఇంట్లో ఘనంగా జరుపుతున్నారు. ఇల్లంతా తోటలోని రంగురంగు పూలతో శోభాయమానంగా అలంకరించారు. ఆ సాయంత్రం నగరంలోని పెద్దపెద్ద కుటుంబాలవారు తమ భార్యాపిల్లలతో వస్తున్నారు. వారబ్బాయి మహేష్ స్నేహితులు, ప్రముఖులైన వారి కంపెనీ ఉద్యోగులు వస్తున్నారు. బంధువులంతా ముందురోజే వచ్చి ఇల్లంతా సందడి చేస్తున్నారు. నిరంజన్‌గారు స్వయంకృషితో ఎదిగి రెండు కంపెనీలకు అధిపతయ్యారు. నిక్కచ్చి, నిజాయితీలే వారినాస్థాయికి చేర్చాయని స్నేహితులంతా చెప్పుకుంటారు. సిరెంజిలు (ఆసుపత్రులకు) సప్లయి చేసే కంపెనీ వారిది. దాదాపు ప్రధాన నగరాలలో వారి కంపెనీ బ్రాంచీలున్నాయి. లాభాల బాటలో ముందే ఉంటుంది వారి కంపెనీ ఎప్పుడూ. ఒక్కడే కొడుకు. అందుకే పండుగలన్నీ సింపుల్‌గా జరిపి, మహేష్ పుట్టినరోజును మాత్రం ఘనంగా జరుపుతుంటారు. చిన్నప్పుడు తనకు తీరని అపురూపమైన కోరికలను, తన కొడుకు ద్వారా నెరవేర్చుకొని తృప్తి పడుతుంటారు. వారి భార్య అరుణ ఈ విషయంలో కాస్త అభ్యంతరం పెడుతుంటుంది. ‘పదేళ్లు ఘనంగా చేశారు. ఇక చాలు వాడి స్నేహితులతో వాడికిష్టమైనట్టు జరుపుకోనీయండి, పెద్దవాడయ్యాడు. తన స్నేహితులతో ఏ సినిమాకో, హోటల్‌కో వెళ్లి సరదాగా జరుపుకుంటాడు కదా!’ అంది.
‘అరుణా! నా బాల్యంలో నేను జరుపుకోలేనిది, నెరవేర్చుకోలేనివన్ని నా కొడుకు పోగొట్టుకోకూడదని నా కోరిక. అందుకే వాడి పుట్టినరోజును ఘనంగా జరుపుతున్నాను. వాడిలో నన్ను నేను చూసుకుంటున్నాను’ అన్నారు నిరంజన్‌గారు. భర్త గొంతులో లీలగా ధ్వనించిన జీర, బాధ గమనించి వౌనంగా ఉంది అరుణ. ముగ్గురూ కలసి ఉదయ్యానే్న గుడికెళ్లి వచ్చారు.
సాయంత్రమైంది. అతిథులంతా ఒక్కొక్కరిగా వస్తున్నారు. ముందుగా బాగా సన్నిహితులైన నాలుగు కుటుంబాలవారు వచ్చారు. శేఖర్, హరనాథ్, గౌతమ్, రవీంద్ర దంపతులు, పిల్లలతో వచ్చారు. బంధువులంతా వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానిస్తూ లోపలకి తీసుకెడ్తున్నారు. రాత్రిడి డిన్నర్ ఏర్పాట్లు కూడా బాగా జరుగుతున్నాయి. నగరంలోని ప్రముఖ హోటళ్ల చెఫ్‌లు వచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా వచ్చేశారు. ఓ పక్కన కూచిపూడి నృత్యప్రదర్శన ఏర్పాటుచేశారు. మహేష్ స్నేహితులంతా వచ్చాక అమ్మ, నాన్న, బంధువుల సమక్షంలో కేక్ కట్‌చేశారు. మహేష్‌కి తండ్రి ఓ వయొలియన్ బహూకరించాడు. అంతా ఆశ్చర్యపడ్డారు. ఏ కాస్ట్లీ బైకో కొనిస్తాడనుకొంటే, సంగీత వాయిద్యం కొనిచ్చాడు కొడుకుకి బహుమతిగా అనుకొంటున్నారు. మహేష్ దాన్ని చాలా ఇష్టంగా చేతుల్లోకి తీసుకొని ఒక ‘వర్ణం’ వాయించాడు. ఈకాలంలో పిల్లలకిది ఇష్టముంటుందా అనుకునే వాళ్లకిది షాకే! అందులో కోటీశ్వరుడైన నిరంజన్‌గారి అబ్బాయి ఇంత సంప్రదాయబద్ధంగా వయొలిన్ వాయించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఇక ఒక్కొక్కరూ భోజనాల హాలు దిక్కుగా కదులుతున్నారు. బాగా సన్నిహితులైన గౌతం, హరనాథ్, శేఖర్, రవీంద్ర, నిరంజన్ ఓచోట కులాసాగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అందరి దృష్టి మహేష్ వైపు మళ్లింది. ‘ఎంత వినయం. ఎంతటి అందం, కలుపుగోలుతనం, స్నేహితులతోపాటు మిగిలిన పెద్దలందరినీ ఎంత బాగా పలకరిస్తున్నాడో మన పిల్లలు కూడా ఇలా ఉంటే ఎంత బాగుండును. పార్టీకి రమ్మంటేనే ఎంత సణిగారు! బలవంతపెట్టి తీసుకురావలసి వచ్చింది’ మనస్సులో అనుకుంటున్నారు. సంస్కారం చూసి నేర్చుకున్నా వస్తుంది అనుకున్నారు. మహేష్ అందరినీ డిన్నర్‌కి తీసుకెడ్తున్నారు. స్నేహితులంతా నిరంజన్‌ను అడిగారు ‘ఏం చదివిస్తారు మహేష్‌ని? ఇంజనీరింగా, మెడిసెనా? లేదా మీలాగా ఎంబిఎనా? ఈ కంపెనీలకి సిఇఒని చేద్దామనా? ఏమిటి భవిష్యత్తాలోచనలు’ ఆసక్తిగా అడిగారంతా.
‘నేను నా బాల్యంలో కోల్పోయినది, నేను కష్టపడి పైకొచ్చి చదివి ఇంత వాణ్ణయ్యింది, ఎందరో మానవతామూర్తుల సాయంతోనే. ఇప్పుడు మహేష్‌కి ఆ అవసరం లేదు. వాడిష్టం ఎంత చదువుకోవాలన్నా, ఏది చదువుకోవాలన్నా వాడికి పూర్తి స్వేచ్ఛ ఉంది. వడ్డించిన విస్తరిలాంటి జీవితాన్నందించాను ఇక అంతా వాడి చేతుల్లో ఉంది’ అన్నారు నిరంజన్.
‘నిరంజన్! ఆ మూలనున్న ‘తైలవర్ణ చిత్రం’ ఎవరిది? ఇంతకాలం ఇది ఆ ప్రదేశంలోనే ఉందా! మేము గమనించలేదా!’ అన్నారు స్నేహితులు. ‘అదా! ఇంతకాలం అది పైన నా రూమ్‌లో ఉండేది. ఈసారి అందరూ చూస్తారని హాల్లో పెట్టించాను. ఆ చిత్రంలో ఉన్న వ్యక్తి మానాన్నగారు. భుజాలపైన కూర్చుంది మహేష్. తన మూడేళ్ల వయస్సులో నేనే ఈ దృశ్యాన్ని ఫొటోతీసి ఇలా గీయించాను. ఆ చిత్రం నా జీవితాన్ని చాటి చెప్తుంది. నాన్న ప్రేమని తెలియచెప్తుంది. అందుకే నాకదంటే చాలా ఇష్టం’ అన్నాడు నిరంజన్. ‘ఆ చిత్రం వెనుకో జీవితం ఉందన్నావ్! చెప్పు మేము కూడా తెలుసుకుని ఆనందిస్తాం’ అన్నారు.
‘మా తండ్రిగారు మహేష్‌కి ఐదేళ్ల వయస్సులో చనిపోయారు. ఎంతో గొప్ప త్యాగశీలి. ఓ కుటుంబం కోసం త్యాగం చేశారు. మా చిన్నతనాన అనంతపురం జిల్లాలో భూస్వాములు (దొరల) పెత్తనం చలామణిలో ఉండేది. రాజయ్యగారనే భూస్వామ్య కామందు దగ్గర మా తాత అప్పు తీసుకొని వడ్డీలు కట్టలేక, మా నాన్నని వెట్టి కూలీగా చేర్చి, తాను కట్టుబానిసగా మారి ఉన్న రెండెకరాల పొలం కూడా వదులుకొని వెట్టి చాకిరీ చేస్తుండేవాడట. తాత పోయాక నాన్న వెట్టి కూలీగా ఆ కుటుంబానికి, గొడ్డుచాకిరీ చేస్తుండేవాడు. వారి పిల్లలను రెండు మైళ్ల దూరాన ఉన్న, స్కూలుకి రెండు భుజాలపై, ఇద్దరు పిల్లలనెక్కించుకొని స్కూలుకి మోసుకెళ్లేవాడు. ఆ పిల్లల కన్నా నాలుగైదేళ్లు చిన్నవాణ్ణయిన నన్ను మాత్రం ఎప్పుడూ ఎత్తుకొనేవాడు కాదు. మధ్యలో నాన్నకి దాహం వేసి దగ్గరలోనున్న టీ దుకాణానున్న బెంచీలపైన కామందు పిల్లలను దింపి తాను నీళ్లు తాగొచ్చి మరలా భుజాలమీద మోసుకుంటూ స్కూలుకు తీసుకెళ్లేవాడు. ఒకవేళ పొరపాటున నేలమీద దింపితే, పిల్లల ద్వారా తెలుసుకొని, ఇంటికెళ్లాక నాన్నకి దెబ్బలు రుచి చూపించేవాడు. అలా నిత్యం కావెడుతో నీళ్లు మోయటం, పిల్లల్ని భుజాలపై మోయటం, పొలంలో పనులు, ఇలా నాన్న కృశించిపోతుండేవాడు. తిండి కూడా దొరకక ఎన్నో అగచాట్లు పడాల్సి వచ్చేది మాకు. అందుకే నాన్న వెట్టి పని మానేవాడు కాదు. నాకూ, తమ్ముడికి చదువంటే ఎంతో ఇష్టం. అందుకే నేను నాన్నతోపాటే స్కూలుకి బయలుదేరి, పరుగెడ్తూ, రొప్పుతూ, స్పీడుగా నడుస్తుంటే, నాన్న భుజాలపై కూర్చున్న కామందు పిల్లలు పకపక నవ్వేవారు. మధ్యలో పడ్తుండేవాణ్ణి. ఆయాసం వచ్చి నడవలేక ‘నాన్నా! ఎత్తుకోవూ’ అంటూ ఏడ్చేవాణ్ణి, అరిచేవాణ్ణి. నాన్న నా మాట, నా ఏడుపు విననట్లుగా, వడివడిగా వెళ్లిపోయేవాడు. ఓసారి నాకు ఈ అలసటతో, తిండిలేక జ్వరం కూడా వచ్చింది. ఆ రాత్రి జ్వరంతో నేను ‘నాన్న ఎత్తుకోవూ’ అంటూ రెండు, మూడుసార్లు కలవరించానట. ఉదయానే్న పనిలోకెడ్తున్న నాన్నతో ‘ఏమయ్యా! ఇస్కూలుకా, కామందయ్య పిల్లల్ని భుజాలెత్తుకొని దింపి వస్తున్నావట! మరొకపరి మన నారిగాడ్ని (నా ముద్దుపేరు) కూడా ఎత్తుకు తీసుకెళ్లకూడదా! బిడ్డ జ్వరంలో కూడా కలువరిస్తున్నాడు’ అంది. లోపల నులక మంచాన పడున్న నాకు, ఆ మాటలు వినిపిస్తున్నాయి. ఏమే రంగీ! నీకు తెలవదా? ఓపాలేం జరిగిందో? గుర్తు తెచ్చుకో! క్రితం సారిలాగే ఆడు పేచీ పెడ్తే ఓ సారెత్తుకొని ఇస్కూలులో దింపొస్తే, కామందుగారు కొట్టిన దెబ్బలకి ఆకుపసర రాస్తూ కాపడం పెడ్తూ నీవేమన్నావ్! ఎందుకాయెర్రి పని చెయ్యడం? ఇన్ని దెబ్బలు తినడమని ఏడ్చావా లేదా? అన్నాడు నాన్న.
అవన్నీ విన్న నాకు ఇక నాన్నని ఎప్పటికీ ఎత్తుకోమని అడగకూడదనుకున్నాడు. అప్పటి నుండి నాన్నమీద ప్రేమ, జాలి, మా పరిస్థితులపై కోపం, కసి కలసి నన్ను ఓ పట్టుదలున్న మనిషిగా మార్చాయి. స్కూల్లో సార్లంతా నాకు చదువంటే ఉన్న ఇష్టం, నా పరిస్థితులు చూసి, నీ చదువే నీకు దీపంలా బాట వేస్తుంది, నీ, భవితను నిర్ణయిస్తుంది, మీ వర్గానికి ప్రభుత్వం ఎంతో సాయం అందిస్తోంది రిజర్వేషన్ల రూపంగా, మేము నీకు వెనుక ఉండి అన్నివిధాలా మార్గదర్శకత్వం చేస్తాం! నీవు బాగా చదువంటూ ప్రోత్సహించారు. అలాగే రిజర్వేషన్లు, సార్‌ల సాయంతో ఇలా కంపెనీకి అధిపతినయ్యాను. తమ్ముణ్ణి చదివించగలిగాను. అమ్మానాన్నలను ఆ ఊరు నుండి తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకున్నాను.
తమ్ముణ్ణి ఇంజనీర్‌ని చేయించి వాడినో మెట్టుమీద నిలపెట్టాను. నాన్నని, అమ్మని సకల సౌకర్యాలు కలిగిస్తూ సేవ చేసుకున్నాను. మహేష్ పుట్టాక వాడి రెండో పుట్టినరోజున, ఉదయం నాన్న మహేష్‌ని భుజాలపై ఎక్కించుకొని తోటలో అటు, ఇటూ తిరుగుతూ కన్పించారు. నాకు చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా అన్పించి ఓ ఫొటో తీసేశాను. ఆ సమయాన నాన్న నా చిన్నతనాన కామందుగారి పిల్లనెక్కించుకొని స్కూలుకి మోసుకెళ్లే నాన్న గుర్తుకొచ్చారు. మహేష్ స్థానాన నన్ను ఊహించుకొన్నాను. వ్యక్తులు మారి, ఆ స్థానాన్ని నా కొడుకు సంపాదించాడు. నాన్నా! భుజాలు నొప్పి పడ్తాయి, వాణ్ణి దించండిక అరిచాను. ఎందుకురా అంత భయం? నినె్నత్తుకొని మోయకున్నా, నీ కొడుకుని, నా వారసత్వాన్ని మోస్తున్నాను చాలా ఆనందంగా ఉంది. నీకు ఆ కోరిక తీరకపోయినా, నన్ను ఎంతో ఎత్తున నిలపెట్టావు! నీ హృదయ మందిరానే్న సింహాసనంగా చేసుకొని నన్ను ప్రతిష్ఠించావ్ అన్నారాయన.
ఆ సింహాసనానికన్నా, నా భుజాలేం గొప్పవికావు. కాస్సేపు సరదాలు, ముచ్చటలు నీ కొడుక్కి రుచి చూపించాలనుకుంటున్నాను, ఆ కామాందుగారి పిల్లలను ఓ పనె్నండేళ్లు మోశానో ఏమో! తర్వాత వాళ్లు సైకిళ్లు తొక్కుకుంటూ స్కూలుకెళ్లేవారు. ఊరొదిలేసి వచ్చాం. ఇప్పుడు ఆ పిల్లలెలా ఉన్నారో? ఎంతైన గొప్పోళ్ల పిల్లలు కదా ఇంకా గొప్పోళ్లయి ఉంటారు కదరా? నాన్న పాతరోజులకెళ్లిపోయారు. ఆ పిల్లలు క్రిందికి దించినప్పుడు ఇంటికెళ్లి చాడీలు చెప్పి తన తండ్రిని కొట్టించి రోజులన్నింటినీ వదిలేసి, వాళ్లెంత ఉన్నతిలోకొచ్చారని ఆలోచిస్తున్న తండ్రి దయాగుణానికి, త్యాగశీలతకు నాకు వళ్లు పులకరించింది. ఆవిధంగా మహేష్‌కి ఐదేళ్లు వచ్చేదాకా అమ్మ, నాన్న సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాతేడు గుండెనొప్పి రావటంతో ఇద్దరూ ఆర్నెల్ల తేడాతో పోయారు. నేను ఆ ఫొటోని పెద్దది చేసి నా గదిలో పెట్టుకొని ప్రతిరోజూ నాన్న పడే శ్రమని చూస్తూ నాన్నని తలచుకొంటూ ఉండేవాణ్ణి. ఈ మధ్యే ఓ ఆర్టిస్ట్‌తో దాన్ని గీయించి హాల్లో పెడ్తే మిగిలిన వారు కొందరైనా దాని గురించి అడిగి తెలుసుకొని విని స్ఫూర్తి పొందుతారేమోననిపించి ఆ పని చేశాను. ఆ చిత్రం వెనుక పసి మనస్సు చిరుకోరిక, పసి మనస్సు కసి పట్టుదలగా మారి ఆత్మవిశ్వాసంతో, కృషితో నాస్తి దుర్భిక్షంలా చేసిన నా జీవిత సఫలత్వం దాగివుంది. ఇది ఆ చిత్రం వెనుక దాగిన అసలు, సిసలు కథ. మేము ఆ కామందుగారి పిల్లల కోసం వెతికాం. ఈ ఊర్లోనే ఉన్నారన్నారు. నాన్న మాతో బయటకెక్కడికి రాకపోవడం, నేను వెళ్లినా పసితనాన వాళ్లను చూసిన కళ్లతో ప్రస్తుతం వాళ్లు కంటికెదురుగా ఉన్నా గుర్తించలేనేమోనన్పిస్తోంది. దాంతో నాన్న కోరిక తీర్చలేకపోయాను. ఒక్కసారి నేను మోసిన బిడ్డలను చూడాలని ఉందిరా! వెంట పెట్టుకు రమ్మని ఒకటే గొడవ పెట్టేవాడు నాన్న!
వింటున్నవారంతా ఉద్వేగంతో కళ్లనీళ్లు పెట్టుకున్నారు. వాళ్లందరితోపాటు వింటున్న హరనాథ్‌కి మాత్రం గుర్తుకొచ్చింది తన బాల్యం. తను, తన అన్న ఓ పాలేరు భుజాలెక్కి బడికి వెళ్లిరావటం, ఆ పాలేరు ముఖం గుర్తుకొచ్చింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆ చిత్రం వైపు చూశాడు. నిజమే ఇతనే అతను! అంటే... ఈ నిరంజన్‌ని చూసి తాము అతని తండ్రి భుజాలపై కూర్చుని వెక్కిరించే వాళ్లం! పాపం ఆ చిన్నపిల్లాడు, చొక్కా చిరిగి, చెమటలు కక్కుతూ, పరిగెడ్తూ మావెనుకే వచ్చి, ‘నాన్నా! ఎత్తుకోవూ’ అంటూ దీనంగా అడిగేవాడు. ఆ నారిగాడే ఈ నిరంజన్. ఇది కలా? నిజమా? తమ కన్నా ఎన్నో రెట్ల ఆస్తి, సంఘంలో పరపతి, ఎంతో ఎత్తుకెదిగిన ఈ నిరంజన్ తండ్రి తమ దగ్గర వెట్టి కూలీగా చేశాడు! తెలిసీ తెలియని వయస్సులో ఎనె్నన్ని దెబ్బలు కొట్టించాం తండ్రితో. అయినా తమని చూడాలని కోరుకున్నాడా పిచ్చి మారాజు. ఎంత మంచి మనస్సతనిది. వెంటనే కన్నీళ్లు నిండిన హృదయంతో ఆ చిత్రంలో ఉన్న నిరంజన్ తండ్రి కాళ్లకి వందనమొనర్చాడు హరనాథ్. నిరంజన్‌కర్ధమైంది కామందుగారి అబ్బాయి అతడేనని.

- ఉప్పుకూలి శైలజ, సెల్: 9440247596
***

నీ ప్రేమ మధురం (మనోగీతికలు_

తల్లిలా మృదువుగా
ప్రేమను పంచుతావు
నాన్నలా జాగ్రత్తగా కాపాడుకుంటావు
దేవుడిలా ఎల్లవేళలా రక్షిస్తావు
ముద్దుగా గొడవ పడతావు
కోపంగా కసురుతావు
తియ్యగా తిడతావు
గురువులా తప్పులు సరిదిద్దుతావు
ఎలా జీవించాలో నేర్పిస్తావు
నాకు బాధవస్తే ఎవరికీ తెలియకుండా కన్నీరు కారుస్తావు
ప్రేమ అంటే చెప్పడం కాదు, చూపించడం అని తెలియజేస్తావు
నా ఆనందాన్ని చూసి మురిసిపోతావు
నా అమాయకత్వాన్ని చూసి
నవ్వుకుంటావు
అమ్మలోని ‘అ’ అయ్యావు
నాన్నలోని ‘న్న’ అయ్యావు
నీవు నాకు ‘అన్న’ అయ్యావు
అమృతం పంచావు

- పి విజయపావని, రాజమహేంద్రవరం
***
సంతోషం (మనోగీతికలు)

చందమామ ఉన్న ఆకాశంలో...
పరిమళించే రంగురంగుల పూవులలో...
వీచే గాలి తెమ్మెరలలో...
సముద్రపు అలలలో...
పచ్చని పంట చేలలో...
కురిసే వాన చినుకులలో...
కూసే కోయిలమ్మ గానంలో...
ఇవన్నింటితో నిండిన ప్రకృతిలో...
సంతోషం ఉంటుంది నీలో, నాలో...

- ఎన్. అన్నపూర్ణ, రాజమహేంద్రవరం
***

సత్యమేవ జయతే (మనోగీతికలు)

ఈ ప్రపంచం ఎందుకని
నన్ను ఒంటరిగా చూస్తుంది
పలకరింపుగా నవ్వదు
పరిచయమున్నట్టు చూడదు
అసలు నేనెవరో తెలీనట్టు,
నాతో సంబంధమే లేనట్టు
గట్టిగా మాట్లాడితే
నేనసలు జీవించి లేనట్టు
ఎందుకు?

తప్పుని ‘తప్పు’ అని చెప్పినందుకా?
నిజాల్ని మాట్లాడినందుకా?
అన్యాయం జరిగిందని అరిచినందుకా?
అవినీతికి సహకరించనందుకా?
నీకు తెలుసు ఈ లోకం కొత్తగా వౌనభాష నేర్చుకుందని
అయినా సరే
జరిగింది చెప్పడానికి నాకెందుకు భయం
మాటలొచ్చినా మూగదానిలా ఈ ప్రపంచం ఉన్నప్పుడు
అందరూ ఉన్న అనాథలా ఉండడానికి నాకెందుకు భయం
అయినా నాప్రక్క ‘సత్యం’ ఉన్నప్పుడు నేనెందుకు అనాథనవుతాను
ఇప్పుడు కాకపోయినా కొన్ని తరాల తరువాతయినా గెలిచేది సత్యమేగా!

- పిల్లా రమణబాబు,
గవరవరం చెరువుగట్టు
ప.గో.జిల్లా, సెల్:96526 59027
***

సృష్టిలో దృష్టి (మనోగీతికలు)

చూశాను నేను అద్దం
కనిపించిన ప్రతిబింబం భూతం
మనసైనది ఒక కాగితం
జరిగేను నాతో యుద్ధం
దాంతో మొదలైంది గందరగోళం
కాలాతీతమైన శక్తివలె
నా దరికి వచ్చింది ఒక కలం
ఆది తీసుకువచ్చింది నాలో ఆత్మవికాసం
ఇక ప్రతి అక్షరమైంది అజంతా శిల్పం
రావచ్చు నాకు కష్టం
కానీ నావద్ద ఉన్నది ఆనంద బాండాగారం
వరించినది నాకు విజయం
వెనువెంటనే చూశాను నేను అద్దం
కనిపించిన ప్రతిబింబం సంతోషం
అది ఆ శక్తి ఇచ్చిన స్నేహం
అయిపోతున్నది నా కలంలో ద్రవం
అపుడు అవగతమైనది
స్నేహం ఒక కలం
గడచిన మధురానుభూతులు
తిరిగిరాని కాలం

- ఎం.నీరజాదేవి
98667 79398
***

విలాపాగ్ని (మనోగీతికలు)

మత్తు గమ్మత్తులోకి
జారిపోయాక
విషాదాన్ని మదిలో
కుమ్మరించుకుంటే
దుఃఖపు ఛాయలు
వినోదం వివాదం
వింత చూస్తూ నేను!

క్లిక్‌చేస్తే చాలు
గూగూల్లో
విశ్వ సమాచారం
ఎంత గాలించినా
హృదయం లోతు మాత్రం తెలియదు!

పువ్వు చుట్టు ముళ్లుంటే
తలలో తరుముకోరు
చేతులతో ముట్టుకోరు
గుండెలో వేదన
గరళంలా తాగాల్సిందే!

చేరాల్సిన గమ్యానికి
ఎంత ప్రయాణం చేసినా
జీవిత అడ్డంకులు ఎదురై
సమానత్వం కూడలికి
దారి దొరకదు!

అబ్బ! ఎండకు
కమిలిపోయింది మొకం
వెలుతురు చూపునకు
బొప్పికట్టింది
నిర్మొహమాటం
నిర్మలత్వం!

- రవికాంత్, 96424 89244