విజయవాడ

జలమే సృష్టికి మూలం ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి సింధువు వేలకోట్ల వర్షపు నీటి బిందువులకు మూలమైతే
కురిసే ప్రతి వర్షపు బిందువు పుడమితల్లికి ఆయువుపట్టే!
ఒడిసి పట్టే ప్రతి వర్షపు బొట్టే ప్రగతికి తొలిమెట్టైతే
నీటి పొదుపుకి వేసే ప్రతి మెట్టు పచ్చదనానికి ప్రాణం పోసినట్టే!
పట్టుపట్టు ప్రతి బొట్టు వెయ్యికోట్ల జీవుల దాహం తీరేట్టు..

మన, రాబోయే తరానికి కావాలి జీవజలం
భగీరథ ప్రయత్నం చేయాలి నదులన్నీ నింపాలి
పారే ప్రతి నది పుడమికి పచ్చని చీర కడితే
ప్రతి జీవి జీవిస్తుంది ప్రతి జీవి హర్షిస్తుంది

చేయిచేరుూ కలపాలి కరవుకాటకాన్ని తరమాలి,
ఎండిన గొంతులను బీటలువారిన పొలాలను తడపాలి
ఇంగుడు గుంతలు తవ్వాలి పాతాళగంగను పెంచాలి
ప్రతి బిందువును పొదుపుచెయ్యాలి ఒక్కో సింధువుగా మార్చాలి
గళాలన్నీ ఏకం చేసి ‘సుజలాం-సుఫలాం’ అని గొంతెత్తి చాటాలి

- టి ప్రసాద్‌బాబు, తొర్రగుంటపాలెం, కృష్ణా జిల్లా.
చరవాణి : 9492483278
**

సహజీవన వేదం (మనోగీతికలు)

వాసనలేని పూలు భువి పైగలవెన్నియొ, యైన వ్యర్థమే!
వాసి గడించదే గరిక వక్రపుతుండము వాని పూజకై
వాసన యున్న గంధఫలి వర్జనమైనను దైవ పూజకున్
స్తీ సముదమున్నన్ జడను జేర్చదె? వ్యర్థమె వానిపుట్టుకే!

శివజూటమ్మున నున్న గంగ భువిపై జేరన్ ప్రజానీకము
త్సవముల్ గిత్యవముల్ పొనర్చి జల శౌచమ్మున్ జెడన్ జేసినన్
లవమైనన్ నది కోలుపోయినదె? మర్యాదన్, సదాభక్తితో
భవనాశమ్మునకై జనమ్ముచని ఆప్లావమ్మటన్ జేయరే!

బసుమపు రాశిలేయిది అవాంఛిత మంచని పారపోయుచో
పసగల అగ్నిరేణువులు ప్రక్కల దాగి కరాల గాల్చుకు
లసమ మిదేమి ఈదుకొని ఆవలి యొడ్డుకు జేరవచ్చు సా
హసమొనరించియన్న, కలహంసలె కావు మొసళ్లునుండవే?

త్వరపడి పల్కరాదిత డవాంఛితుడంచును, హీనుడంచు, ని
ద్దరకె భరమ్మటంచు, బహుధా వచియింప జుగుప్సకల్గదే?
అరయగ సంఘమందున ననాదరణీయుడెవండులేడు, అం
దరియెడ జూపగావలె సదా సమదృష్టి, విశాల భావమున్

ఈ కమనీయ సృష్టిని సహేతుక ముండుట హెచ్చుతగ్గులున్
ఏకముఖమ్ము తోడ జనియించని వారలు, బీదలు సాదలుక్
ప్రాకట భాగ్యమంతులు, నపార దయాత్ములులేరె? ఆత్మలో
ఏ కలుషమ్ము లేకునికియే సహజీవన వేదవౌ సుమీ!

- కలవకొలను సూర్యనారాయణ, గుంటూరు. చరవాణి : 9849268659
**

‘పశ్చిమ కృష్ణ’కు బిడ్డను నేనై... (మనోగీతికలు)

మ॥ ఇట ‘కొట్టర్వుల’ పాద చిహ్నములు లేవీనాడు; తద్భావన
స్ఫుట మూర్తిత్వము మాత్రమున్నదిలె; తత్స్ఫూర్తి ప్రపూర్ణంబులౌ
ఘటికల్ గర్భమునందిముడ్చు కొనియెన్‌గా నాదు గుంటూరు; నే
డిట యేదో అనుభూతి పండు మదిలో; ఈ జాడ తిక్కన్నదో!
సీ॥ ఒకరాజు చిమ్మెగా యుఱు కప్పురపు నీళు
లా కొండ వీట నాహ్లాదమేచ!
క్షతజ కుంకుమ దిద్ది జాయలు మాంచాల
లంపరే యనికిట తెంపు ధృతుల!

మంగళగిరిలోన మా గొప్ప తిరునాళ్ళ
తీండ్ర పిల్లలు కత్తి త్రిప్పలేదె?!
కోటేశ్వరస్వామి కోటి దివ్యప్రభ
లావహించెనుగ మా అశ్వపతుల!

తే.గీ॥ ఆ ఘన స్ఫూర్తిదంబులై యలరు తొంటి
స్వర్ణ చరితల గంభీర భవ్య చిహ్న
గర్భితంబైన రుూ భూమి ఖండ మందు
పరవశింతును గుంటూరు వాడనగుట

సీ॥ ఇక్కడి మాతాత లెంత కృతార్థులో
తిక్కన్న మధువాణి తీపిఁ జూచి
ఇచటి మా పెద్దలదెంత సద్యస్స్ఫూర్తొ
‘కొండ వెంకప్ప’ ముందుండ నడల

ఈ యూరి మాయన్న లెంత ధన్యాత్ములో
‘కాశి కృష్ణ’ ధిషణ గరిమ గాంచి
ఈ వాడ వారందఱెంతభినంద్యులో
‘శ్రీనాథ పీఠ’ ప్రభృతులు గలిగి

తే.గీ॥ ఇట నెచటఁ జూచినను గళలేనట! అది
యెంత శ్రీయొ! అదెంత అదృష్టమోను!
ఇచట నాకాలి గోటితో మృత్తునెత్త
కమ్ర సంస్కృతి మొలక సౌగంధ్య మెగయు

సీ॥ చూతును జంధ్యాల శుక్తి రూప ప్రభ
లామూల నొక పౌరు నాస్యమందు
కందును జాషువా కవితాభిరామతా
మూలనొక కవీశు ముఖమునందు

స్మరియింతు జమ్ముల మడకార్య వాగ్ధార
నొక యుపన్యాసకు నుక్తిశక్తి
హ్లాదింతు కోగంటి యధ్యాపకత్వమా
ప్రక్కనుపాధ్యాయు పాఠనమున

తే.గీ॥ ‘వావిలాల’, ‘మల్లంపల్లి’ వాక్సుధలను
‘స్ఫూర్తి సిరి భాస్కరు’ని బాస సొబగు బిగువు
‘ఎక్కిరాల’, ‘మన్నవ’ హృద్య కృతుల స్మృతిని
శశ్వ దనుభూతి సిరివెల్గు సౌరు నాదె
(విశ్వనాథ వారి
‘ఆంధ్ర ప్రశస్తి’ స్ఫూర్తితో)

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం
చరవాణి : 9849779290