రాజమండ్రి

‘విధ్వంసక ముఖచిత్రం’ తిలకిద్దాం! (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుస్తకం కవి / రచయిత చిరునామా అని ఓ ప్రముఖ కవి కితాబు. నిజమే మరి తన రచనలు ఒక చోట నిక్షిప్తం చేసుకుని ముద్రించుకున్న పుస్తకం కవిని తెలిపే చిరునామా. అయితే దానికి ఓ నలుగురు కవులో, రచయితలో రుజువుపరిచే సాక్ష్యాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. సమాజానికి బాధ్యుడు కవి. సామాజిక స్పృహకు స్ఫూర్తికారకుడు కవి.
రుగ్మతలతో.. వేదనలతో.. కన్నీళ్లతో రాజకీయ దగుల్బాజీతనంతో విధ్వంసానికి పూనుకునే అనేకానేక సంఘటనలకు, సమస్యలకు ముఖ చిత్రాలు గీసిన కవి సరికొండ నరసింహారాజు. అతని కవిత్వం పేరు ‘ఒక విధ్వంసక ముఖచిత్రం’ చూడండి. నిప్పులు కురిపించి నిరసన తెలిపి జ్వలిత మానమైన చైతన్యంలోకి తెచ్చి మనల్ని స్పృహకారకుల్ని చేస్తాడు. చైతన్య సుగంధమై/ జనం గుండెలో పరిమళిస్తాడు.
అనుభూతికర కవిత్వం కాదు.. అలాగని అనుభవపూర్వకము కాదు. అంతా ఆలోచనామయం. స్పష్టంగా చూచి స్పందించిన హృదయ ఆవేదన ఉంది. ప్రస్తుత దుస్థితికి కారణభూతాలను విశే్లషించే ప్రయత్నం చేశారు. దానికి కారణ శక్తులను పట్టుకుని చూపే ప్రయత్నమూ ఉంది. నేలతల్లి రంగు, రుచి, వాసన తానే అయినప్పుడు/ తనను తానే విత్తుకుని/ కవి మొలకెత్తుతాడు. ‘ఒక విధ్వంసక ముఖచిత్రం’ తనను తాను ఆవిష్కరించుకున్న కవి తన తొలి కవితలో అనేక బహుముఖ విధ్వంసకర చిత్రాలు చూపించారు. ఈ శీర్షికే పుస్తకానికి టైటిల్ అయింది. జాతీయ స్థాయిలో ఉత్తమ కవితా పురస్కారం అందుకున్న కవిత. మంచి అభివ్యక్తీకరణతో సాగిన కవిత ‘దళిత మిణుగురుల దండు కదిలిందిరో..’ అంటూ కదం తొక్కిన కవి. ఎత్తుగడతోనే గొప్పగా హత్తుకున్నది ‘కాకులైనా..కోకిలలైనా/ వసంతానికి ఊడిగం చేస్తూనే ఉన్నాయ్/ గొంగళి పురుగులు పురుడు పోసుకుంటే/ రెక్కలొచ్చిన సీతాకోక చిలుకలు/ రెట్టవేస్తూ ఎగిరిపోతున్నాయ్..’ అంటారు. రిజర్వేషన్ ఫలాలు అందుకున్న వాళ్లు అందని వారికోసం, అర్హుల కోసం ఏం చేస్తున్నారో.. ఏనాడు భావ స్వాతంత్య్రం వస్తుందో/ ఆనాడే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టు.. అని వాడుకు పేట మధ్య గునపాన్ని దిగేసి మరీ చెప్పారు.
వచన కవిత్వంపై చులకన భావం ఉంది పద్యకవులకు, అయితే ఇదొకసారి చదివి చూడండి ప్రతీ కవితలోను బోలెడన్ని ప్రతీకలు చాలా స్పష్టంగా అగుపిస్తాయి. యతిప్రాసలు, గణ విభజనలు లేకుండానే తదాక్యం చెందే అనుభూతి పొందకపోతే కవిత్వంపై ఒట్టు. ఆట వెలదులు ఆటలాడించినా, తేటగీతులు ఆలపించినా/ సంగతుల గతులు నిర్దేశించినా/ వచన ఖడ్గాలను ప్రయోగించినా/ గంగి గోవుపాలు కడివెడు త్రాగించినట్టు2 అంటారు తన ‘అక్షరాలదారిలో...’ కవి అన్నవాడు ఎలా ఉంటాడో.. ఉండాలో చెప్తున్నాడు చూడండి.. తనను తాను నరుక్కొని ముక్కలు ముక్కలుగా/ కాగితంపై అతికించినట్టు/ నరాల దారాలతో సాహిత్యమాలలల్లినట్టు/ పేగులపై రాగాలు పలికించినట్టు/ తాను అదృశ్యమై అక్షరాల్లో సాక్షాత్కరించే/ అంతర్ముఖుడు కవి2- అలాంటి కవి జనానికి ఏమిస్తాడో తొందరపడక చూస్తే మనకే అర్థమవుతుంది.. అది సరికొండ వారి విశ్వరూప దర్శనం.
ఒక పేజీ కవితలో భృకుటి ముడివేసి మనల్ని తెగలాగుతాడు కవి ఆలోచనల్లోకి ‘తెల్లబోయిన తోలు’ కవిత. వర్ణ వివక్ష మీద ఇప్పటికే జరుగుతున్న మారణకాండకు ఇది మచ్చుతునక అవుతుంది. అలాగే కుదేలయ్యే మనిషి గురించి ఐదు ప్రతీకలలో ఎత్తుపొడిచి మరీ ఉద్యుక్తుణ్ణి చేస్తారు కవి నరసింహారాజుగారు. అపజయాలతో తననుతాను అథఃపాతాళంలోకి పాతేసుకునే మనిషి కోసం ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తాడు ఈ కవి. భరత మాతను బిచ్చగత్తెను పోలిక చేసి చూపిన కవిత ఒక పేజీలో దర్శనమిస్తుంది ‘ఒకానొక బిచ్చగత్తె’గా. చందమామ రాట్నంలో వెనె్నల దూది ఏకుతోంది2 కవితా పాదం మొత్తం కవితకు బిగింపునిస్తుంది. అయితే సాంద్రత కొద్దీ ఎంత చిక్కని కవిత్వం రాసినా అది పాఠకుల చెంత నిలిస్తేనే అర్థవంతమవుతుంది.
నవ్వుల మీద వేసిన మంచి సెటైర్ లాంటి కవిత ‘స్మైల్ ప్లీజ్’ అంటూ మనల్ని వెక్కిరిస్తాడు. ఏ నవ్వు ఎక్కడ ఒలుకుతుందో తేట పరిచి చెప్పారు. నవ్వుని ఆక్సిజన్‌లా పీల్చుకొంటేనే గాని బతుకు గమ్యం సాగదంటారు.
కవిత్వం ఎవరెవరికి విన్పించాలో ఘంటాపథంగా చెప్పారు దిగంబర కవి నగ్నముని. అంచేత ఎవరెవరికి చెబితే వారు సింహరూపాలు ధరించి తిరగబడతారో బెబ్బులిలా పోరాడతారో ఈ కవిత్వం చదివితే తప్పక తెలుస్తుంది. తన కవిత్వ ఆనవాలు ఈ కవితా సంపుటిలో తప్పక దొరుకుతుంది. ముంగర జాషువా గారైతే కవితా దృశ్యాన్ని శీతల వర్ణాలతోగాక ఉష్ణవర్ణాలతో చిత్రీకరించాడనటం నిజం. అందువల్లనే ఇది ఒక విధ్వంసక ముఖచిత్రం2 అయిందనటం అంతే నిజం. ‘సమర్థులు రాయకపోతే.. అసమర్థులు రాస్తే, సమాజానికి సాహిత్యానికి చాలా నష్టం’ అంటారు శతాధిక గ్రంథకర్త, కవి పండితులు డాక్టర్ మలయశ్రీ. ప్రజల నాల్కలపై నిత్యహాసం చెయ్యక్కర్లేదు కానీ జనం నోళ్లల్లో నానితేనే ప్రజాసాహిత్యమనబడుతుంది. లేదంటే కవి పుంగవుల మధ్యే గొప్ప సాహిత్యమై నిలిచిపోయే ప్రమాదముంది. సరికొండ వారి కవిత్వాన్ని తెలుగు రాష్ట్రాల్లోని కవులు కాపు కాసేశారు. కవిత్వాన్ని చదవటానికి ముందు ఏడుగురు ప్రసిద్ధ కవులు వెనక మరో ఏడుగురు సుప్రసిద్ధ కవి ప్రముఖుల సిఫార్సులున్నాయి. మంచి కవిత్వం మనుగడ సాధ్యం. కవితోత్తమాన్ని పుణికిపుచ్చుకుంది ఈ పుస్తకం. ఈ కవి రెండు ఉత్తమ కవితా పురస్కారాలందుకున్నారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఈ కవి ఇంకా ఇంకా ప్రజలను ఉద్దీపన చెందే కవిత్వం రాస్తారని ఆశిద్దాం!
ప్రతులకు
అన్ని పుస్తక కేంద్రాల్లోను,
సరికొండ నరసింహారాజు
ఎ-116, పైలాన్ కాలనీ
నాగార్జున సాగర్
నల్గొండ జిల్లా - 508203
సెల్ : 94413 64022
- రవికాంత్, 9642489244
***
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net