నెల్లూరు

కృతజ్ఞత బాగుంది (స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత వారం మెరుపులో గౌతమి గారి కలం నుంచి రాసిన కృతజ్ఞత కథ చాలా బాగుంది. కథలో చెప్పదలచిన సందేశాన్ని క్లుప్తంగా చెప్పిన తీరు బాగుంది. కథలో పాత్రల సంభాషణలు, కథను అందంగా మలిచిన విధం కథను చివరి వరకు ఆసక్తిగా చదివించింది. ముఖ్యంగా మాస్టారు అప్పదాసు, విద్యార్థి సుందరం మధ్య వచ్చే సంభాషణలు చాలా బాగా కుదిరాయి. సమాజానికి సాయం చేస్తే పదిమందికి ఉపయోగపడుతుంది. ఆ సాయాన్ని పొందిన వారు వృద్ధిలోకి వచ్చి మళ్లీ పదిమందికి సాయం చేస్తే కృతజ్ఞతగా వుంటుందని చక్కటి సందేశంతో కథను మలిచిన గౌతమి గారికి ధన్యవాదములు. గౌతమి గారి పుస్తక సమీక్షలు కూడా చాలా బాగుంటాయి.
- పుప్పాల పవన్‌కుమార్, ఆర్ సి రోడ్డు, తిరుపతి
- దాసరి సునీత, గూడూరు
- అయనవోలు సుబ్బరావు, చిత్తూరు

హేట్సాప్ వడలి రాధాకృష్ణ..
గత వారం మెరుపులో విభిన్న కోణంలో ఆలోచించి వడలి రాధాకృష్ణ రాసిన ప్రియదర్శనపేటిక కవిత సూపర్. నిజంగా ఆనాటి అపురూప కళాఖండాలను కూడా ఈరోజుల్లో కవితకు ఉపమానంగా వాడుకోవచ్చు అని నిరూపించారు. నిజంగా ప్రియదర్శన పేటికను మాకు మళ్లీ గుర్తుచేసి దానిని అప్పుడు ఎలా వాడుకున్నారు, ఈరోజుల్లో ఈ విషమాయాజాల సమాచార విప్లవాన్ని (ఇంటర్నెట్, ఫేస్‌బుక్, ట్విట్టిర్) ఎలా వాడుకుంటున్నారు, తద్వారా కలిగే దుష్ప్రరిణామాలతో సమాజం ఎలా పయనిస్తుంది అంటూ అంతర్గతంగా ఆవేదనతో రాసిన కవిత సూపర్. నిజంగా హేట్సాప్ వడలి రాధాకృష్ణ గారు.
- కాకుటూరు రమాప్రభ, కావలి
- హేమంతకుమార్, అద్దంకి
- సావిత్రి మొగల్లూరు, నాయుడుపేట
***

రచనలకు
ఆహ్వానం
నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net