నెల్లూరు

స్నేహమే దైవం (చిరుకవితలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్యాగమనే జలంతో ఎదిగే
పచ్చని మొక్క
స్వార్ధమనే కలుషమంటని
అగ్నిహోత్రం
జడివానకు జడవని గిరి శిఖరం
సుడిగాలికి కొడిగట్టని దివ్యదీపం
ఋతువేదయినా శ్రుతి తప్పని గానం
నీడ కూడా దూరమైన
కటిక చీకటిలో
వీడిపోనని తోడు నడిచే వెలుగురేఖ
నీ గుండె గాయానికి చెమ్మగిల్లే నయనం
నీ ఆనందానికి పొంగిపోయే హృదయం
తల్లితండ్రి గురువు దైవం సర్వస్వం
నమ్మకానికే నమ్మకమైన
ఆత్మబాంధవ్యం
నారికేళ సలిల ధారాసమనిర్మలం
అర్పించడమే గాని
ఆశించడమెరుగని సౌశీల్యం
ఒకే రాగం పలికే రెండు గొంతులు
ఒకే భావం తెలిపే రెండు మనసులు
ఒకే ప్రాణమై బతికే
రెండు తనువులు జంటగ నడయాడే శివకేశవులు స్నేహితులు
- చిరమణ వెంకట రమణయ్య
తూర్పువీధి, గూడూరు
చరవాణి : 9441380336

స్నేహదీపం

స్నేహ దీప కాంతి ధగధగలు
వేదనల చీకట్లు తొలగించు
స్నేహామృత రసధారలు
వాడిన జీవిత కుసుమమును వికసింపజేయు
మధురభాషణము మదిని శాంతపరచు
రెండు దేహాల గూటిలో వెలిగే ఒకే ఆత్మదీపం
రెండు గుండెల చప్పుడు వినిపించే
ఒకే ఐక్యరాగం స్నేహం
చీకటి దారిలో కాంతిపుంజం
వేదనాభరితమైన హృదయాలకు దివ్యౌషధం స్నేహం
స్నేహమే నా ఊపిరి
స్నేహమే నాకున్న సిరి

మోపూరు పెంచల నరసింహం,
చరవాణి : 7386362476

మధురానుభూతి

మధురం మధురం స్నేహం
కలకాలం నిలిచేది స్నేహం
నిలువెత్తు నిస్వార్థం స్నేహం
మదినిండా అనుక్షణం
మెదిలేది స్నేహం
కష్టాలనే ముళ్లబాటలో
ఆదుకునేది స్నేహం
అందరికీ మార్గదర్శకం
కుచేల, కృష్ణ భగవాన్‌ల స్నేహం.

బి. సుహాస్
నెల్లూరు
ఫోన్: 9491343689