నెల్లూరు

ప్రాణానికి ప్రాణం స్నేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్గాలు,వర్ణాలు వదిలితేనే స్నేహం
కలహాలు, ద్వేషాలు తెలియని స్నేహం
మధురం మధురం స్నేహం
సృష్టిలో తీయనిది స్నేహం
జ్ఞాపకాల చిరునామా స్నేహం
జీవితంలో తీయని మలుపు
మధురం మధురం స్నేహం
ఆపదలో ఆదుకొనే అమృతహస్తం
ఆనందానికి ప్రియమైన నేస్తం
బాంధవ్యాల కన్న మిన్న నేస్తం
మధురం మధురం స్నేహం
స్నేహానికి లేదు నిర్వచనం
ఎన్ని యుగాలైనా, ఎన్ని జన్మలైనా
చెరిగిపోనిది, తరిగిపోనిది, మరణం లేనిది
మధురాతి మధురమైనది స్నేహం
- మలుగు లక్ష్మీమైథిలి, 9441685293

వెలిగే కాంతిపుంజం

చిరునవ్వులు హృదయ ద్వారబంధాలకి
తోరణాలుగా అల్లితే
వసంతంలా చల్లగా, మెల్లగా
ప్రవేశించింది స్నేహితం
రెండు హృదయాల మధ్య
నిశ్శబ్దంగా మల్లెపందిరిలా
అల్లుకుని..పరిమళమై ప్రవహించింది
అందులో ఎన్ని జ్ఞాపకాల స్పర్శలు
ఎన్ని తీపి, చేదు అనుభవాల
ప్రతిధ్వనులు
అంతలోనే పెరిగిపెరిగి
నాచుట్టూ భద్రతా వలయంలో
చుట్టుకుంది. పూర్తి రక్షణతో
సంతోషం, దుఃఖం
బలం, బలహీనతలు ప్రవహించిన
క్షణాలు.. ఎన్నో
చివరంటూ..నాకు భరోసా అయి
నిలువెత్తు.. ఆసరాగా నిలబడిన
ఆ మధుర స్నేహబంధం
ఓ అందమైన ఆశ్రమం
జ్ఞాపకాల మూలల్లో
సదా వెలిగే కాంతిపుంజం.
- గోవిందరాజు సుభద్రాదేవి
చరవాణి : 9848627158

స్నేహం
బంధువా మీకాయన?.. అని అడిగారు
అంతకంటే ఎక్కువైన స్నేహబంధం అన్నాను.
సంఖ్యలో స్నేహితులెందరో ఉన్నా
సహవాసం హృదయానికి
హత్తుకుపోయేదే మిన్న
సద్భావన నిండినది స్నేహం.

మైత్రికి పరిపూర్ణత ఏదనుకుంటే
స్నేహం సాకారం అయిందా అనుకుంటే
ఆవస్యకతకు స్నేహం ఆదుకోవాలనుకుంటే
ఆవస్యకతకు ‘‘ ఆదుకోవడమే’’ ‘‘స్నేహం’’ అంటుంది ఆధునికం!
అందుకే అనిపిస్తోంది..
మిత్రుడు వేరు, మైత్రి వేరు!
స్నేహితుడు వేరు, సఖ్యత వేరు!

విజయానికి దోహదపడి,ప్రత్యక్ష యుద్ధం చేయని
వాసుదేవుని లాంటి హితుడు, స్నేహితుడు,
హేతుబద్ధం కాని దుర్యోధనుని మూర్ఖత్వ
విధానాలు తెలిసినా
మరణం వరకు మాసిపోని కర్ణుడి మైత్రీబంధం,
స్థాయినెంచక సుధామను అక్కున చేర్చుకొని
అటుకులు తిన్న ఆ పరమాత్మ
అహంలేని స్నేహం,
సీతానే్వషణ, రావణ సంహారం వరకు
వారధి నిర్మించిన
వానర, ఉడుతా భక్తి స్నేహం,
గుహు, సుగ్రీవ, హనుమంత, విభీషణుల
సఖ్య భక్తి కావాలి.

ఎవడి దగ్గర పడితే వాడి దగ్గర ఏడవకు
అధరాల వెనుక ఆర్తిని అర్థం చేసుకొనే
ఆప్తమిత్రుని ముందు ఏడవమన్నారు
పది రూపాయలతో సుస్నేహాన్ని
పదిలం చేసుకొని
వంద రూపాయలతో దుస్సహవాసాన్ని
వదిలించుకోమన్నారు
గోల్డెన్‌షిప్పులు, డైమండ్ షిప్పులు,
వెండి షిప్పులుండొచ్చేమో కాని
ఫ్రెండ్‌షిప్పులాంటి షిప్పు విలువే వేరు!

దూరతీరాల స్నేహసంభాషణ వ్యక్తీకరణలో
దూరవాణి, చరవాణి, అంతర్జాల
ఆధునిక స్నేహాలున్నా
‘‘జాతీయ మైత్రీదినా’’నికి కారణభూతుడి,
మిత్రుడి మరణం భరించలేని ఆత్మాహుతుడి
హృదయస్పందన స్నేహబంధం కావాలి.

- వేదం సూర్యప్రకాశం,నెల్లూరు
చరవాణి : 9866142006