రాజమండ్రి

డబ్బుకు లోకం దాసోహం ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెన్నీ ఐ లవ్ యు రా! నీవు లేకుండా ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను తెలుసా! చేతుల్లోకి ఆమె మోము తీసుకుని నుదుటిపై చుంబించాడు రాహుల్. అతని వంక ఉదాసీనంగా చూస్తోంది జెన్నీఫర్.
‘ఏం మాట్లాడవేం! నీ బాధ నాతో షేర్ చేసుకో రాదా?
నేనేమన్నా పరాయివాడినా! త్వరలోనే గదా! మనం పెళ్లి చేసుకునేది! రాహుల్ ముఖంలో లాలన.
‘అబ్బే అదేంలేదు పొడిపొడిగా అంది.
డబ్బు, డబ్బు, డబ్బు, ఈ డబ్బు ఎటువంటి వారినైనా విడదీస్తుంది. చులకన చేస్తుంది. హత్యజేయిస్తుంది. అన్యాయాలు, అక్రమాలు ఒకటేమిటి? డబ్బుకు విపరీతమైన శక్తి ఉంది. ఆమె జీవితాన్ని చదువుకుంది. తండ్రికి పక్షవాతం, అమ్మకు స్థూలకాయం. ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్మునికీ తను అక్క. పాత సినిమాల్లో ఉన్న కష్టాలన్నీ తనకున్నాయి. ప్రతినెలా జీతం కోసం ఎదురుచూపు. ఇంకా కష్టపడదామన్నా లేని ఉద్యోగాలు. రాత్రుళ్లు పార్ట్‌టైమ్ చేద్దామంటే ఒకటి రెండుసార్లు రోడ్లపై తాగుబోతు వేధింపులు. తండ్రి అసహాయత, తమ్ముడు బాల్యం, ఇంటికి మగవాళ్లే అయినా తనను, తన కుటుంబాన్ని కాపాడలేకపోతున్నారు. అందుకే మానుకుంది. ఇప్పుడు ఈ రాహుల్ నవ మన్మధుడేంగాదు. తనకు అతను లేకపోతే బ్రతకలేనంత ప్రేమ లేదు. అలా అని ఎప్పుడూ చెప్పలేదు. మరి అతనికి కూడా మాటల్లో ఉన్నంత ప్రేమ మనసులో లేదని అనుమానం తనకు.
‘ఏయ్! జెన్నీ ఏంటి ఆలోచిస్తున్నావ్’
‘మరేం లేదు రాహుల్ అంది మెడలో క్రాస్‌ని తిప్పుతూ’
‘డబ్బేమన్నా కావాలా! ప్రేమగా ముంగురులు సవరిస్తూ అన్నాడు.
‘అహహ! అది కాదు అంది జెన్నీ’
‘లేదురా! మనం ఒకరికొకరం తోడుగా ఉండాలి, ఎంతోకొంత పంచుకోనీ నన్ను కూడా
మాటల్లోనే ఇద్దరూ జెన్నీ ఇంటి దగ్గరకొచ్చారు.
‘అక్కా! డబ్బు తెచ్చావా! మిగిలిన పదివేలు కట్టనిదే కాలేజ్‌కి రావద్దంటున్నారు సార్! ఏడస్తూ అంది జెస్సీ
‘ఏయ్ ఇంత చిన్న విషయం నాకెందుకు చెప్పలేదు. అదే నాకు అవసరమైతే నువ్వివ్వవా!
‘లేదు రాహుల్ నేనేదో ఏర్పాటుచేస్తాను’ అని కాళ్లు కడుక్కుని లోనికెళ్లింది.
క్షణంలో రాహుల్ బయటకు వెళ్లి పదివేలు డ్రా చేసుకొచ్చి వద్దంటున్నా వినకుండా ఇచ్చాడు.
రేపు ఫీజు కట్టమని చెప్పి వెళ్లిపోయాడు.
తనకు తెలుసు ఈ రాహుల్ దగ్గర వాడేంకాదు.
తనకు సాయం చేస్తే వాళ్లలో కొంత చొరవ, చనువు చూపించ తామరాకుపై నీటిబొట్టులా ఉంటాడు. జెన్నీకి కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలున్నాయి. ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకోవాలంటే అప్పైనా సరే అర్హత ఉండాలనుకుంటుంది. అవే తన చెల్లెళ్లు, తమ్ముడికి పాఠాలుగా బోధిస్తుంది.
ఇప్పుడు అతనిచ్చిన డబ్బు ఆమెకు సంతోషాన్నివ్వలేదు. ఏ బంధం లేకుండా తన మనసు అంగీకరించడంలేదు. అసలు తనది, అతనిది ప్రేమో, కాదో తనే తేల్చుకోలేకపోతుంది తను. భారంగా కళ్లు మూసుకుని తర్వాత కలత నిదురపోయింది జెన్నీ.

ఇంటికి వచ్చిన రాహుల్‌కి నిద్ర పట్టడంలేదు. తనకు పాకెట్ మనీగా ఇచ్చిన డబ్బును తను ఎమోషనల్ అయి జెన్నీ చెల్లికి ఇచ్చాడు. జెన్నీ ఇంప్రెషన్ సంపాదించాలని, ఆమె తీసుకోకుండా రిటన్ చేస్తుందని, అప్పనంగా కీర్తి సంపాదించాలని వేసి ప్లాను ఈవిధంగా బెడిసికొట్టింది. రేపు తను రిటన్ చేయకపోతే తన గతేంకాను. ఈ నెలంతా ఎలా గడపాలి? నిద్ర పట్టడంలేదు. మరునాడు 12 గంటలకు వెళ్లాడు.
‘రాహుల్ గారూ థ్యాంక్సండి. మీ వలన నేను టైమ్‌కి ఫీజు కట్టగలిగాను’ నవ్వుతూ అంది జెస్సీ.
రాహుల్ గుండెలో రాయిపడింది. ఛీఛీ అమ్మాయిలు ఎంత నిస్సిగ్గుగా తీసుకుంటారు. తను ఇస్తే తీసుకోవడమేనా! రిటన్ చేయవద్దు. ఇన్ని రోజులుగా అతనికి ఆకాశమంత ఎత్తుకి ఎదిగిన జెన్నీ చాలా మరుగుజ్జుగా, చులకనగా, ఇష్టంలేని దానిలా అనిపిస్తుంది. ఈ ఆడవాళ్లు డబ్బు కోసం వెంట పడతారనే తండ్రి, తల్లి మాటలు గుర్తుకొచ్చాయి.
మరి తను ప్రేమిస్తున్నాడా! లేదా! మరితను జెన్నీని ముద్దు పెట్టుకుంటాడు. ఐ లవ్ యు చెప్తాడు. మరి ఇదంతా ఇన్‌ఫాచ్యుయేషన్. వయసులో ఉన్న వారికి మధ్య కలిగే ఆకర్షణ అంతే. తనేంటి ఇంత పిచ్చిగా డబ్బులిచ్చేశాడు. అయినా డబ్బును ఆశపడితే అది ప్రేమేకాదు. తనేం హీరో కాడు. ఈమె వళ్లో డబ్బులు పోసి ఉద్ధరించడానికి. ఈ ఆడవాళ్లంతా తమ అందాన్ని ఎరగా వాడి తనలాంటి వాళ్లని మెస్మరైజ్ చేస్తారు.
నిజంగా జెన్నీ తనను అలా చేసిందా! చేసే ఉంటుంది. ఇన్నాళ్లు దాచుకుని ఇప్పటికి బయటపడింది. నేనే ఇచ్చేలాగా, తను అడగనే అడగకుండా బెట్టుగా లాక్కోనిచ్చింది. తను ‘కో’ అంటే కోటిమంది అమ్మాయిలు వస్తారు. ఇలా ఖర్చు పెడుతూ పోతే తన ఆస్తిపాస్తులన్నీ ఇలాగే కరిగిపోతాయి. ఇక ఈమెతో బంధం కట్ చేయాలి. అందందేముంది? పదిరోజులు కలసి ఉంటే కుక్క పిల్లపైనైనా ప్రేమ పుడుతుందని నానే్న అంటాడు. ఇక ఈ విష వలయం నుండి బయటపడాలి. ‘ఏదో సాకు జెప్పి ఆ డబ్బు కూడా తీసుకోవాలి’ ఆలోచిస్తూ ముందుకు నడుస్తున్నాడు.
ఎదురుగా జెన్నీ చకచకా నడుస్తూ ఎదురైంది.
ఆమె ముఖంలో నిన్నటి దైన్యంలేదు. ఎంతో చురుకుగా, చలాకీగా ఉంది. పొడవాటి జడ చురుకుగా కదులుతుంది. కళ్లు మెరుస్తున్నాయి.
కనుబొమ్మలు నాట్యం చేస్తున్నాయి. ఇదేమిటి? తాను ఎందుకు వివశుడౌతున్నాడు. పదివేలు తీసుకుంది ఇక ఇలాగే దివాళా తీయిస్తుంది. రాహుల్ సీరియస్‌గా ఇంటికి వెళ్లే వస్తున్నాను అన్నాడు.
‘సో! సారీ!రాహుల్ పద కాఫీ ఇస్తాను’
‘అవసరం లేదు’ కఠోరంగా అన్నాడు.
జెన్నీ అనుకుంటుంది. ఇదంతా తనపై ప్రేమ. తను సమయానికి లేనందుకు అలుగుతున్నాడు. నిజంగానే మగవాళ్లని గూర్చి తాను తప్పుడు అభిప్రాయానికి వచ్చానని అనుకుంది. ఆమె దృష్టిలో రాహుల్ హిమపన్నాగంలా ఎదిగిపోతున్నాడు. చెయ్యి పట్టుకుని ఇంటికి దెచ్చి కూర్చోబెట్టింది. లోనకి వెళ్లి కాఫీ దెచ్చి ఇచ్చింది. ఇన్నిరోజులుగా ఆమె చేతి కాఫీ అమృతంలా ఉండి ఇప్పుడే విషంలా మారినట్లనిపించింది రాహుల్‌కి.
ఎలాగో గటగటా త్రాగేశాడు. ఇక బయల్దేరతాను
కందగడ్డలా మొహం పెట్టి అన్నాడు.
‘జస్ట్ మినిట్ రాహుల్’ ఆమె లోనికి వెళ్లి కవరు తెచ్చి ఇచ్చింది.
‘ఇ.. ఇదేమిటి?’ ప్రశ్నార్థకంగా చూశాడు.
‘రాహుల్! నేను నీకు చెప్పనేలేదు కదా! పోస్టల్ ఆర్‌డి క్లోజ్ చేశాను. అవసరానికి ఆదుకోవడానికే గదా ఈ సేవింగ్స్ కళకళలాడుతున్న మొహంతో పచ్చి దానిమ్మ గింజల నవ్వుతో చెప్పింది జెన్నీ.
హఠాత్తుగా అతని దృష్టి ఆమె చేతులపైబడింది. ఎప్పుడూ మెరుస్తూ ఉండే బేంగిల్ ఆమె చేతికి లేదు. అవును తను ఆ గాజు అమ్మేసుంటుంది. లేదా తాకట్టు పెట్టుంటుంది.
ఛీఛీ తను ఎంత చులకనగా చూశాడామెను. ఆ విష బీజం తన గుండెల్లో వట వృక్షమై ఎంత వికృత రూపం దాల్చింది. సరిగా కవరు పట్టుకోలేక టేబుల్‌పై విడిచిన కవరును జెస్సీ అతని జేబులో పెట్టింది. థ్యాంక్యూ! అని మళ్లీ మనసారా చెబుతున్న ఆత్మాభిమానం గల అక్కాచెల్లెళ్లను జూస్తూ డబ్బు ఎంత పాపిష్టిది అని చర్చికి వెళ్లి జీసస్ వద్ద మోకరిల్లి తన పాపాలను క్షమించమని వేడుకున్నాడు రాహుల్.

- సుధా శశిరేఖ, సెల్: 9441599321
**

పుస్తక సమీక్ష

మానవతను మేల్కొలిపే కిరణాలు

ప్రపంచంలోకెల్లా భారతదేశంలోని సంస్కృతీ సంప్రదాయాలు మానవుని జీవనానికి ఎంతో మేలు కలిగేలా తోడ్పడుతున్నాయి. ఎందరో రుషిపుంగవులు తమ జీవితాలను త్యాగం చేసి తపస్సులు, పరిశోధనలు చేసి ఆ సంప్రదాయాలను మనకు అందించారు. అయితే, పాశ్చాత్య సంస్కృతి మూలంగా ఇవి కనుమరుగైపోయే పరిస్థితికి చేరుకున్నాయి. తత్ఫలితంగా మానవుని జీవన విధానం కూడా మారిపోతోంది. అంతా స్పీడ్ యుగం వచ్చేసింది. వినోద సాధనాలు కాళ్ళ దగ్గర తిరుగుతుండడంతో అనుబంధాలు, ఆప్యాయతలు, పలకరింపులు మట్టికొట్టుకుపోయి, బద్ధకం పెరుగుతోంది. మొలకెత్తిన వివాదాలు ముదిరి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇటువంటి అస్తవ్యస్త బతుకుల నడుమ మానవత్వం ఎలా ఆహుతవుతోందన్న విషయాన్ని తెలియజెప్పి, భారతీయుడిలోని ఉన్న ఆ ఆదర్శ వ్యక్తిత్వాన్ని, మానవత్వాన్ని మేల్కొపిన కిరణాలు.. విశాఖ రచయితల సంఘం ప్రతినిధి అడపా రామకృష్ణ ఆధ్వర్యంలో వెలువడిన ‘విశాఖ కథా తరంగాలు’. ఈ కథా సంకలనంలో మొత్తం 21 కథలు ఉన్నాయి. ఇందులో కొన్ని వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి కాగా, మరికొన్ని ఈ సంకలనానికి ప్రత్యేకంగా రాసివిగా ఉన్నాయి. వాస్తవాన్ని ఆధారంగా చేసుకుని మలిచిన కథ ‘ఇది మరో దిద్దుబాటు’ (రచయిత గుండాన జోగారావు), సుసర్ల సర్వేశ్వర శాస్ర్తీ రాసిన ‘పాపం సుబ్బారావు’, ఎన్.జగదీశ్వరి కలం నుంచి వెలువడిన ‘బంగారు పట్టీలు’, శ్రీ చరణ్‌మిత్ర ‘మనసు పరిధి స్వలం’, అడపా రామకృష్ణ ‘తప్పెవరిది?’, ‘డ్రైవర్ బాబు’ (రాగతి రమ), నందచైనత్య ‘దీపకళిక’, మేడా మస్తాన్‌రెడ్డి ‘స్వామికార్యం..!’, టి.శ్రీనివాసరావు ‘జనని’, శ్రీనివాస్ ‘కర్మయోగి’, భమిడిపాటి సుబ్బారావు రాసిన ‘మానవత్వం’, రాజేష్ యాళ్ళ ‘నీలకంఠం’, అంగర కృష్ణారావు ‘బాకీ కథల కమామిషు’, డాక్టర్ రేవరకొండ సహదేహరావు రాసిన ‘సాధనతో...’, వివి కూర్మారావు ‘తాపత్రయం’ చక్రరావు ‘కంట్లోనలుసు’, ఎం.ఉండవిల్లి ‘అమ్మ’, రావులపల్లి రామలక్ష్మి ‘హుద్‌హుద్’ కథలు ఈ సంకలనంలో ఉన్నాయి. సీనియర్ రచయిత అడపా రామకృష్ణ కొంతకాలం దూరంగా ఉండి, మళ్ళీ సాహిత్య సేవలోకి రావడం ప్రశంసనీయంగా చెప్పుకోవచ్చు. వచ్చిందే తడవుగా విశాఖ రచయితల సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఉన్న ఔత్సాహిక రచయితల రచనలను శ్రమపడి సేకరించి, ‘విశాఖ కథా తరంగాలు’గా వెలువరించడం వర్ధమాన రచయితలకు సంబరమే.

- జి.కృష్ణమూర్తి,
సెల్ : 9493802010.