విజయవాడ

అం‘ద’రి శ్రేయోభిలాషి! (ఉరుము కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా!.. ఉరుము ఎలాంటి శబ్దాన్ని మనకి వినిపిస్తుందో? అలాగే అది ఎలాంటి సందేశాన్ని మనకి పంపిస్తోందో కూడా తెలియదు కదూ? ఇప్పుడు తెలుసుకుందాం!
యుగాలకి ముందు మన దేశంలో నివసించిన మహర్షులు గొప్ప తపస్సు చేసి ఆకాశంలో మెరుపులతో కలిసి ఉరిమే ఉరుము అసలు మనకి దేని గురించి చెప్తోందో తెలుసుకోడానికి ప్రయత్నించి చివరికి ఫలితాన్ని సాధించారు. ఉరుము ద్వారా సృష్టికర్త మనకి ఒక సందేశాన్ని ఇస్తున్నాడని తెలుసుకున్నారు. అదే ఈ ఉరుము కథ.
సృష్టి మొదలైన కాలంలో సృష్టి చెయ్యడానికి సృష్టికర్త ఒక్కడే ఉండేవాడు. ఆయనకి చాలా పేర్లున్నాయి. కానీ, ఇప్పుడు మనం ప్రజాపతి అనే పేరుతో పిలుచుకుందాం. ప్రజాపతి మొదట మూడు రకాల జాతుల్ని సృష్టించాడు. వాళ్లు- దేవతలు, మనుషులు, రాక్షసులు. వాళ్లు తమ తండ్రి ప్రజాపతి చెప్పినట్టు క్రమశిక్షణతో నడుచుకునేవాళ్లు.
ప్రజాపతి మూడు జాతులవాళ్లకి మూడు లోకాల్ని ఇచ్చేశాడు. దేవతల్ని, మానవుల్ని, రాక్షసుల్ని ఎవరి లోకానికి వాళ్లని వెళ్లి జీవించమన్నాడు. తండ్రి చెప్పినట్టు దేవతలు స్వర్గలోకానికి, మనుషులు భూలోకానికి, రాక్షసులు నరకలోకానికి బయలుదేరారు. వాళ్లు తమ లోకాలకి వెళ్లేముందు తమ తండ్రిని కలవాలనుకున్నారు. ఎప్పుడూ వౌనంగా కూర్చుని ఉండే తమ తండ్రి ప్రజాపతిని మొదట దేవతలు కలుసుకున్నారు.
‘తండ్రీ! మేము మా లోకానికి వెళ్లబోయేముందు మీరు మాకు ఏదేనా ఒక మంచి సందేశం ఇవ్వండి!’ అని అడిగారు.
వారి మాటలు విన్న ప్రజాప్రతి మొదట వాళ్లకి ఎంత జ్ఞానం వుందో తెలుసుకోవాలని అనుకున్నాడు. వాళ్లకి పదానికంటే చిన్నదైన ఒక అక్షరాన్ని చెప్పి ‘మీకు నేను చెప్పింది అర్థమయిందా?’ అన్నాడు. ఆ అక్షరం ‘ద’.
దేవతలు తండ్రితో ‘అర్థమయిందండీ! మీరు ఒక పదంలోని మొదటి అక్షరం మాత్రమే చెప్పారు. ఆ పదం ‘్ధన్యత’. అంటే ఎవరిని వాళ్లు స్వయంగా నియంత్రించుకోవాలి. అప్పుడే ధన్యులమవుతాం అని చెప్పారు మీరు. మేము అలాగే నడుచుకుంటాం’ అని సమాధానమిచ్చారు.
దేవతలు చెప్పింది విని ప్రజాపతి ‘మీరు సరిగ్గానే చెప్పారు, వెళ్ళిరండి’ అని వారి లోకానికి వాళ్లని పంపించేశాడు.
దేవతలు వెళ్లిపోయాక మనుషులు వచ్చి ‘తండ్రీ! మేము వెళ్లేముందు మాకు కూడా ఏదైనా మంచిమాట చెప్పండి’ అని అడిగారు.
ప్రజాపతి వీళ్లకి కూడా ఎంత జ్ఞానం ఉందో తెలుసుకుందాం అనుకుని వాళ్లకి కూడా ‘ద’ అనే అక్షరం చెప్పాడు. తరువాత ‘మీకు నేను చెప్పింది అర్థమయిందా?’ అని అడిగాడు.
మనుషులు ‘అర్థమయిందండి! మీరు పదానికి మొదటి అక్షరం మాత్రం చెప్పారు. ఆ పదం ‘దానం’. అంటే ఎప్పుడూ దానం చేస్తూ ఉండమని కదండీ! మీరు చెప్పినట్టే నడుచుకుంటాం!’ అని సమాధానమిచ్చారు. వాళ్లు చెప్పింది విని ప్రజాపతి ‘అవును. మీరు బాగా అర్థం చేసుకున్నారు, వెళ్ళిరండి!’ అని వారి లోకానికి వాళ్లని పంపించేశాడు.
మనుషులు వెళ్లిపోయాక రాక్షసులు వచ్చారు. ‘తండ్రీ! మేము మా లోకానికి వెళ్లబోయేముందు మాకుకూడా ఏదైనా ఒక మంచి మాట చెప్పండి’ అని కోరారు.
వాళ్ల మాటలు విని ప్రజాపతి ‘వీళ్లు కూడా ఎంత జ్ఞానవంతులో తెలుసుకుంటాను’ అనుకుని వాళ్లకి కూడా ‘ద’ అనే అక్షరం చెప్పాడు. తరువాత వారిని ఏమర్థమయిందో చెప్పమన్నాడు.
రాక్షసులు ప్రజాపతితో ‘తండ్రీ! మీరు ఒక్క పదం కూడా చెప్పకుండా ఒక్క అక్షరమే చెప్పారు. అయినా కూడా మాకు మీరు ఏం చెప్పారో చాలా బాగా అర్థమయింది. ఆ పదం ‘దయ’. అంటే ఎప్పుడూ దయ కలిగి ఉండమని చెప్పారు కదండీ!’ అన్నారు.
ప్రజాపతి వాళ్లు చెప్పింది విని ‘అవును. మీకు చాలా బాగా అర్థమయింది వెళ్ళిరండి!’ అన్నాడు.
దేవతలు, మనుషులు, రాక్షసులు ప్రజాపతికి వినయంగా నమస్కారం చేసి ఎవరి లోకాలకి వాళ్లు వెళ్లిపోయారు.
ఈ కథ వల్ల ఏం తెలిసింది? రాక్షసులు స్వతహాగా క్రూర స్వభావం కలిగినవాళ్లు. అయినా కూడా అప్పుడప్పుడు దయాదాక్షిణ్యాలు చూపిస్తారు. ఎందుకంటే, వాళ్లకి ఎప్పటికైనా ఇంకా కొంచెం పైస్థాయికి ఎదుగుతాము అనే నమ్మకం ఉంది.
మనుషులు బాగా స్వార్థపరులు. భూమి మీద వాళ్లకి ఒకళ్లకొకళ్లు తప్పకుండా సహాయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం దానధర్మాలు చెయ్యాలి. ఎందుకంటే, దానివల్ల వాళ్లు పైకి ఎదగడానికి అవకాశం ఉంది.
దేవతలు స్వర్గంలో ఉండి ఎప్పుడూ విందులు, వినోదాలతో కాలక్షేపం చేస్తుంటారు. ఆ పరిస్థితిలో వాళ్లు దేనికీ సమయాన్ని కేటాయించరు. కనుక, వాళ్లు అసలు విషయాన్ని మర్చిపోతారు. వాళ్ళని వాళ్లు నియంత్రించుకోకుండా ఎప్పుడూ వినోద కాలక్షేపాలతోనే గడిపేస్తే తాము చేసుకున్న పుణ్యం ఖర్చయిపోతుందని, తరువాత మళ్లీ జన్మ ఎత్తాల్సి వస్తుందన్న నిజాన్ని గ్రహించలేరు.
ప్రజాపతి అందరికీ ఒకే అక్షరాన్ని చెప్పాడు. కానీ దేవతలు, మనుషులు, రాక్షసులు తమ జాతిని బట్టి, తమకున్న జ్ఞానాన్ని బట్టి అర్థం చేసుకున్నారు.
పూర్వం ప్రజాపతి చెప్పిన మాటలే ఇప్పటికీ ‘ద.. ద.. ద..’ అనే అక్షరాలతో వినిపిస్తోంది ఉరుముల శబ్దం. అన్నిరకాల జీవరాసులకి మళ్లీ మళ్లీ చెప్పడం కోసం సృష్టికర్త అయిన ప్రజాపతి ఇప్పటికీ ‘ద.. ద.. ద..’ అనే పెద్దశబ్దం చేస్తూ మంచి నడవడికతో బాగా పైకి ఎదగడానికి ప్రయత్నించమని ఉరుముతూ చెప్తూనే ఉన్నాడు.
***

వేదిక
‘కవితా సృజన’ చిరుపురస్కారాలు
తెలుగు సాహిత్య రంగంలో శిఖర సమానుడు, కవి, విమర్శకుడు డాక్టర్ అద్దేపల్లి రామమోహనరావు పేరుతో వర్ధమాన కవులకు ‘కవితాసృజన’ చిరుపురస్కారాలు-2016 ఇవ్వాలని ‘సాంస్కృతీ సమాఖ్య’ (యువసాహితీ వికాస వేదిక) భావిస్తోంది. మంచి కవిత్వం రాసేవారినే కాదు, రాయని వారిని కూడా గుర్తుపెట్టుకుని సాంస్కృతీ సమాఖ్య ద్వారా అద్దేపల్లి ప్రోత్సహించేవారు. ఒక కుగ్రామంలో వుండే అతి సాధారణ కవి నుండి ఊరూవాడల్లో ప్రాచుర్యంలో వుండే ప్రముఖ కవుల వరకు అందరితో ఆయనకు సత్సంబంధాలు కొనసాగాయి. అలాంటి వారందర్నీ సమీకరించి, అద్దేపల్లి అంతేవాసులుగా గుర్తించి ‘కవితాసృజన’ చిరుపురస్కారాలు-2016 ఇచ్చి గౌరవిస్తాం. మన రెండు తెలుగు రాష్ట్రాలలో, రాష్ట్రేతర ప్రాంతాల్లోని కవులంతా తమకు అద్దేపల్లితో వున్న పరిచయం, కవిత్వ ప్రయాణమూ, ప్రచురించిన కవితా సంపుటాల వివరాలు, తదితర విశేషాలు ఇరవై లైన్లలో మినీవ్యాసంగా రాసి జతపరచాలి. వాటిని ‘సమాఖ్య ప్రధాన కార్యదర్శి వి శిరీష్‌కుమార్, సాంస్కృతీ సమాఖ్య, నున్న-521212, (వయా) విజయవాడ’ చిరునామాకు పంపాలి. ఇంకా వివరాలు కావలసిన వారు 9985785322కు ఫోన్ చేసి మాట్లాడవచ్చని శిరీష్‌కుమార్ ఒక ప్రకటనలో సూచించారు.

భమిడిపాటి బాలాత్రిపురసుందరి, విజయవాడ. చరవాణి : 9440174797