విశాఖపట్నం

వాస్తవానికి అద్దం పట్టిన కావ్యం కవితా స్పందన ( పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాల పొందిక, కవితా కదలిక, ఆశల ఆలోచన, ఊహల ఉత్తేజం, సాహిత్య విమర్శనాస్త్రాలు, జనజీవన వ్యథలు, అభాగ్యుల ఆర్తనాదాలు, జన జాగృతికై జన హృది నగారా మోతలు, సమస్యల పరిష్కార మార్గాలు రూపుదిద్దుకున్న కవితా స్పందనను ఆవిష్కరించారు తన రెండవ రచనగా కవి పుల్లా రామాంజనేయులు. చేయి తిరిగిన రచయితే కాక చిత్రకళా ప్రవీణులు. ఆయన ఎన్నో ప్రశంసలు పొందిన వ్యక్తి. అరవైకి పైబడిన ఇందలి కవితలు ఆకాశవాణిలో, పలు కవి సమ్మేళనాల్లో వెలుగు చూశాయి. పలు పోటీలలో బహుమతులు పొందాయి.
చదువుకునే కార్మికులు ఈ బడి కార్మికులు మర యంత్రాలు, డాలర్ ధనార్జనపై ధ్యాస, నోట్లతో కోటలు కట్టాలనే పేరాశ, చిన్నారులంతా ట్యూషన్ ఫ్యాషన్‌లో ఇరుక్కున్నారు. ఆటల్లేవు. పాటల్లేవు. ఈలల్లేవు, గోల లేదు. ప్రగతి పత్రాలే ర్యాంకుల కొలబద్ధ. కన్నవారి కలల ప్రపంచాలే నేటి నాగరికత అని ఈ దు:స్థితి నుండి బయటపేదెప్పుడని కవి ఆవేదన చెందుతారు. గురువును భావితరాల్ని మార్చే సంస్కర్త/ ఎగిసే గువ్వలకు తాను రెక్కలై/పాడే పిట్టలకు తాను స్వరమై/నడిచే జీవనానికి తాను పాదమై, సాగే స్రవంతి అంటూ గురుస్థానానికి పవిత్రతని దృశ్యమానం గావిస్తారు. వామనుడు అడిగిన మూడడుగుల నేల మాకు కావాలి. మా జనం కోసం, మా జగతి కోసం, ప్రగతి కోసం. మేము నిలబడేందుకు అంటూ అణగారిన వర్గాల వారికి దన్నై దిక్కై మేల్కొలపడం స్వాగతించదగింది. ఎవరో వస్తారన్న ఆశ వదిలి, నేనే చేయాలన్న ధ్యాస పెరిగి, ముందడుగు వేసి పయనిస్తే తల దించుతాయి ప్రళయాలు కూడా అంటూన్న పంక్తులు ’కర్మణ్యేవాధికారస్తే’ అన్న గీతావాక్య ప్రబోధాన్ని కవి ధ్వనింపజేస్తాడు. మమతల్ని మాయల్ని మట్టుబెట్టాలని మనిషిని మేల్కొలుపుతాడు. ‘నిర్భయ’ గురించి మానవ మృగాలు విచ్చలవిడిగా కాటేస్తూ మెదళ్లను కామక్రియలు తొలుస్తుంటే చీరతో చెట్టుకు చుట్టి, కళ్లతో కాల్చేస్తున్న కీచకుల రాక్షసానందం ఎన్నాళ్లంటూ తన కవితాక్షరాలతో గర్జిస్తాడు. సారా మైకంలో చేయరాని ఘతాకాలు, ఊరువాడ ‘్ఛ’ కొట్టినా, అస్తిపాస్తులన్ని సారా సీసాల్లో ఆవిరవుతున్నా, చచ్చే దాకా వదలడు సారా బానిసై అంటూ నిరశిస్తాడు. సోమరితనం ఎవరికీ తగదని, ముడుచుకుని ఊరకే కూర్చోకు, ముందడుగు వేసి గమ్యాన్నందుకోమంటూ యువతకి పిలుపిస్తాడు. బాలకార్మికులు పత్తి చేతలల్లో పురుగులైనారు. కార్కానా కోరలకు ఆహుతైనారని ఆవేదనతో వాపోతాడు కవి. ఇలా చాలా కవితల్లో శ్రమైక జీవనాన్ని, దేశభక్తిని, మానవతని, చైతన్యాన్ని కలిగిస్తాడు.

- చెళ్లపిళ్ల సన్యాసిరావు, సెల్ : 9293327394.