ఆంధ్రప్రదేశ్‌

మెరక ప్రాంతాల్లో సాగు ఆపటమే శ్రేయస్కరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నీటి లెక్కలతో అదనపు వినియోగానికి అడ్డుకట్ట
* తేడా వస్తే 8.50లక్షల ఎకరాలకు నష్టం
గోదావరిలో నీటి లభ్యత అసాధారణంగా తగ్గిపోతున్న పరిస్థితుల్లో కనీసం ఈ దశలోనైనా ఉభయగోదావరి జిల్లాల్లోని మెరక ప్రాంతాల్లో రబీ సాగును నిలిపివేయాలని సాగునీటి రంగ నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం గోదావరిలో ప్రధాన ప్రవాహంలో కేవలం 2వేల 500క్యూసెక్కులు మాత్రమే నమోదవుతుండటంతో, గోదావరి డెల్టాకు అవసరమైన నీటి కోసం పూర్తిగా సీలేరు జలాలపైనే ఆధారపడిన సంగతి విదితమే. గోదావరి డెల్టాలో రబీకి ఇలాంటి పరిస్థితి ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని, రబీ సాగు కీలకదశకు చేరుకున్నపుడు చేతులెత్తేసే పరిస్థితి తలెత్తితే ఉభయ గోదావరి జిల్లాల్లోని సుమారు 8.50లక్షల ఎకరాల్లోను పంట దెబ్బతింటుందని సాగునీటి రంగ నిపుణులు సూచిస్తున్నారు.