రాష్ట్రీయం

విలీనం పూర్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో కలిసిన టిడిఎల్‌పి
ఎర్రబెల్లి లేఖకు స్పీకర్ ఆమోదం
బులెటిన్ విడుదల
పాలకపక్షంవైపు నేడు సీట్ల కేటాయింపు

హైదరాబాద్, మార్చి 10: తెలుగుదేశం శాసనసభాపక్షం టిఆర్‌ఎస్‌లో విలీనం అయింది. 12 మంది టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లో విలీనం అయినట్టు గురువారం బులెటిన్ విడుదల అయింది. తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన 12 మంది టిడిపి ఎమ్మెల్యేలు దశల వారిగా టిఆర్‌ఎస్‌లో చేరారు. టిడిపి శాసన సభాపక్షం సమావేశమై, టిఆర్‌ఎస్‌లో విలీనం కావాలని తీర్మానం చేసినట్టు ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పీకర్‌కు లేఖ అందించారు. ఈ లేఖను ఆమోదిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బులెటిన్ విడుదల చేశారు. విలీనమైన ఎమ్మెల్యేలకు పాలకపక్షం వైపు గురువారం సీట్లు కేటాయిస్తారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరఫున ఎన్నికైన 15 మంది ఎమ్మెల్యేలలో ఇదివరకే 10 మంది టిఆర్‌ఎస్‌లో చేరగా, తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు (మాగంటి గోపినాథ్, అరికెపూడి గాంధీ) చేరారు. కాగా తమను టిఆర్‌ఎస్ శాసనసభాపక్షంగా వారిరువురూ స్పీకర్‌ను కోరుతూ లేఖ అందజేశారు. తమ పార్టీ తరఫున గెలుపొంది టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని, వారి సభ్యత్వాలను రద్దు చేయాలని లోగడ ఎర్రబెల్లి దయాకర్ రావు టిడిపి శాసనసభాపక్షం నాయకునిగా ఉన్నప్పుడు స్పీకర్ ఎదుట పిటిషన్ దాఖలు చేశారు. ఇలాఉండగా టిఆర్‌ఎస్‌లో చేరిన వారంతా తాము పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారమే (మూడింట రెండో వంతు) విలీనమయ్యామని, తమ విలీనాన్ని గుర్తించి టిఆర్‌ఎస్ పక్షంగా గుర్తించాలని కోరారు. ఈ లేఖపై స్పీకర్ మధుసూదనాచారి అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్. రాజా సదారామ్‌తో, పలువురు న్యాయ నిపుణులతో చర్చించి చివరకు విలీనంగా గుర్తించారు.