ఉత్తర తెలంగాణ

రమణీయ దివ్యశతకం నందనందనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నన్నయ నుండి నేటి ఆధునిక కవితా యుగం వరకు అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న ప్రక్రియ శతకం. సంస్కృత, ప్రాకృత వాజ్మయం శతక ప్రక్రియకు తెలుగు శతక ప్రక్రియ ప్రతిబింబమే. అయితే తెలుగులో ఈ ప్రక్రియ ఎంతో విశిష్టతను సంతరించుకుని ముందుకు దూసుకుపోతోంది. తాజాగా విడుదలైన నందనందనంలో రచయిత తనకు ప్రీతిపాత్రమైన శ్రీకృష్ణ లీలలను ప్రధానాంశంగా చేసుకున్నారు. రసగుళికల వంటి 126 పద్యాలను సరళమైన శైలిలో రాసి అందించారు. గోపికా బృంద రమణ అనే మకుటాన్ని ఉపయోగించి రాశారు. శ్రీకృష్ణుని బాల్యం నుండి మధురానగర నివాసం వరకు గల సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు రాసిన తీరు పాఠకులను రంజింపజేస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. కృష్ణుడు మట్టిని తిన్నప్పుడు తల్లి అదిలించి నోరు తెరవమని పేర్కొనగా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. ఈ ఉదంతాన్ని చిన్నచిన్న పాదాలతో రచయిత వివరించిన తీరు ఆకట్టుకుంటుంది. విశేషం ఏమిటంటే రచయిత గెడ్డాపు అప్పలస్వామి నిర్యాణం చెందిన చాలా సంవత్సరాలు గడిచాక, ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఆయన కుటుంబ సభ్యులు రాజాం పట్టణంలో ఆవిష్కరింపజేశారు.

- వాండ్రంగి కొండలరావు, సెల్ : 0490528730