ఉత్తర తెలంగాణ

ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువన ఉద్యోగంలో చేరి వారమయ్యింది.
ఆ స్కూలు, అక్కడి పరిసరాలు, వాతావరణం అన్నీ తనకు భాగా నచ్చాయి. తను పదవతరగతి విద్యార్థులకు బయాలజీ బోధిస్తుంది. అన్ని సెక్షన్ల విద్యార్థుల కంటే ‘ఎ’ సెక్షన్ విద్యార్థులు చదువులో ఎంతో ముందున్నట్లుగా ఆమె గుర్తించింది. వాళ్లపట్ల మరింత శ్రద్ధ చూపించి వాళ్లను ఉన్నతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకుంది.
ఆ సెక్షన్లో ప్రతిభ, మేఘన అనే ఇద్దరు విద్యార్థినుల మధ్య మొదటి ర్యాంకు కోసం ఎప్పుడూ పోటీ ఉంటుంది. ఇద్దరూ తెలివైన వాళ్లు. ఇద్దరూ పోటీపడి చదువుతారు. ఇద్దరి మధ్యన మంచి స్నేహం కూడా ఉంది.
ఆ రోజు త్రైమాసిక పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాల లిస్టులను నోటీస్ బోర్డులో ఉంచారు. ఇంటర్వెల్‌లో విద్యార్థులంతా తమ తమ ఫలితాలు చూసుకోవడానికై అక్కడ గుమిగూడారు. తమ మార్కులు, ర్యాంకులు చూసుకొని తరగతుల వైపు తిరిగి వస్తున్నారు.
నిస్తేజంగా కాళ్లీడ్చుకుంటూ తిరిగి వస్తున్న ప్రతిభను చూసింది భువన. తన దగ్గరికి రమ్మని సైగచేసింది. భువన దగ్గరకు నడుచుకుంటూ వచ్చిన ప్రతిభ వినయంగా చేతులు కట్టుకొని నిలబడింది.
‘ఏమయ్యింది ప్రతిభా! అలా ఉన్నావు’ అడిగింది భువన
‘నాకు ఈ సారి కూడా ఫస్ట్ ర్యాంకు రాలేదు మేడం’ నిరాశగా చెప్పింది ప్రతిభ.
‘అయితే ఏమయ్యింది? మరోసారి ప్రయత్నిద్దువుగానీ. ఈ మాత్రానికే బాధపడడం దేనికి? అయినా నీ పర్సెంటేజీ బాగానే ఉందిగా’ అంటూ ప్రతిభ మనసును తేలిక పరచేందుకు ప్రయత్నించింది భువన కేవలం ఇప్పుడే కాదు టీచర్ గత రెండు నెలలుగా నేను ఏ పరీక్షల్లోనూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోలేకపోయాను.’ ఏడుస్తూ చెప్పింది ప్రతిభ. ‘ఈసారి ఇంకా శ్రద్ధగా చదివితే ఫస్ట్‌ర్యాంక్ తప్పకుండా నీకే వస్తుంది. నువ్వేం బాధపడకు’ అంటూ ప్రతిభను ఓదార్చింది భువన.
ఓదార్చిందన్న మాటేకానీ భవనకు ఏమీ పాలుపోవడం లేదు. నిజానాకి ప్రతిభ చాలా తెలివైన పిల్ల. ఏకసంధాగ్రహి. ఎంతో శ్రద్ధగా చదువుతుంది. ప్రతిభతో పోల్చితే మేఘన అంత శ్రద్ధగా చదివినట్లుగా కనిపించదు. కానీ ఈ మధ్య ఫస్ట్‌ర్యాంక్ తరచుగా మేఘనకే వస్తుంది. బహుశా తనపైన ఏ ఒత్తిడి లేకపోవడం కారణం కావచ్చు. మరి ప్రతిభపైన ఏదైనా ఒత్తిడి ఉందా? దాన్ని తట్టుకోలేక తనిలా నిస్తేజంగా, నిరాసక్తంగా తయారై చదువులో వెనకబడుతోందా!? ఏమైనా సరే.
ప్రతిభను ర్యాంకు రాకపోవడం వెనక, ఆ అమ్మాయి ముభావంగా నిరాశగా ఉండడం వెనకున్న కారణాలను తెలుసుకుంటే తప్ప ప్రతిభ విషయంలో తగిన పరిష్కారం దొరకదన్న అభిప్రాయానికి వచ్చింది భువన. ఆ దిశగా తను ప్రయత్నించాలని నిర్ణయించుకుంది. ఆ రోజు సాయంత్రం
చివరి గంటలో క్లాస్ రూం బయట ఉన్న చెట్టుక్రింద కూర్చొని చదువుకుంటున్న ప్రతిభ స్కూల్ బస్సు వెళ్లిపోవడాన్ని గమనించలేదు. మిగతా విద్యార్థులంతా వెళ్లిపోయారు. ఆయా వచ్చి చెప్పడంతో ఈ లోకంలోకి వచ్చిన ప్రతిభ వెంటనే తన బ్యాగును సర్దుకొని స్కూల్ బయటకొచ్చి నిలబడింది.
ఇంటికి వెళ్లడానికని బయటకు వచ్చిన భువనకు ప్రతిభ కనిపించింది. కారణం తెలుసుకొని ‘ఇంటి దగ్గర దిగబెడతానం’టూ ప్రతిభను తన స్కూటీపై ఎక్కించుకొని బయలుదేరింది. అరగంట తరువాత ప్రతిభను ఇంటి వద్ద దింపేసింది భువన. ఆయా ఆమెను రిసీవ్ చేసుకుంది.
***
మరునాడు.
ఇంటర్వెల్‌లో ప్రతిభను తనవద్దకు పిలిపించుకుంది భువన.
‘ప్రతిభా మీ అమ్మానాన్నలు ఏం చేస్తారు?’
‘ఇద్దరూ ఆఫీసర్లే టీచర్. నాన్నగారేమో ఫారెస్ట్ డిపార్ట్‌మెంటులో పనిచేస్తారు. మమీది రెవెన్యూ డిపార్ట్‌మెంట్.’
‘అలాగా రోజూ ఆఫీసుకు ఎప్పుడు వెళతారు?’
‘ఇద్దరూ ఉదయం ఎనమిదింటికల్లా బయలుదేరుతారు. సాయంత్రం ఏడున్నర తరువాత తిరిగివస్తారు’.
‘మరి నీ ప్రిపరేషన్! అదే నీకు టిఫిన్, భోజనం..వగైరాలన్నీ..
‘మా ఆయా చూస్తుంది మేడం’
‘ఓహో! అలాగా..మరి నీకు ఫస్ట్‌ర్యాంక్ రాకపోతే మీ వాళ్లేమైనా అంటారా? ఐ మీన్..కోప్పడడం, పనిష్మెంటివ్వడం..’
‘అదేంటి ప్రతిభా సమాధానం చెప్పు?’
వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ అమ్మాయిని అనునయంగా దగ్గరకు తీసుకుంది భువన.
‘ప్రతిభా నువ్వేం బాధపడకు మీ అమ్మానాన్నలతో నేను మాట్లాడుతా నువ్విక ఈ విషయం మరిచిపో..హాయిగా నీకు నచ్చినట్లుగా చదువుకో..ఆనందంగా ఆడుకో..పాడుకో మీ వాళ్లు నినే్నమీ అనకుండా చూసే పూచీనాది..సరేనా!’
‘నిజంగానా టీచర్!!?.. ఏడుస్తున్న ప్రతిభ కళ్లల్లో మెరుపులా సంతోషం తళుక్కుమంది. ఆశ్ఛర్యంతో మొహం విప్పారింది.
‘ఐ ప్రామిస్ యు’ అంటూ రెండు చేతులూ సాచింది భువన.
‘్థంక్యూ టీచర్’ ఆనందంగా భువన చేతుల్లో ఒదిగిపోయింది ప్రతిభ.
***
ముందుగా సంప్రదించి అపాయింట్‌మెంట్ తీసుకొ ఓ ఆదివారం నాడు ప్రతిభ తల్లిదండ్రులను కలిసింది భువన. పరస్పర పరిచయాలు, ప్రశ్నలు, జవాబులు అయ్యాయి. కాఫీలు, ఫలహారాలూ పూర్తయ్యాయి.
‘్ఫస్ట్ ర్యాంక్‌కోసం ప్రతిభను కష్టపెట్టవద్దని, తన మీద ఉన్న ఆంక్షలన్నింటినీ తీసివేయాలని, తగినంత స్వేచ్ఛనిస్తే తనలోని అసలైన జీనియస్ బయటకు వస్తుందని వారికి అర్ధమయ్యేలా వివరించింది. ఇవన్నీ చేశాక అప్పుడు ఫలితాన్ని చూడండని కోరింది.
మొదట్లో ఒక మూన్నాలుగు సార్లు ప్రతిభకు ఏ ర్యాంక్ వచ్చినా ముందు మనస్పూర్తిగా ప్రశంసించుమని, అభినందన పూర్వకంగా వెన్నుతట్టుమని సూచించింది. అలా చేస్తే తరువాత నుండి ఫస్ట్ ర్యాంక్ ఎప్పుడూ తనకే వస్తుందని భరోసా ఇచ్చింది.
భువన చెప్పినట్లుగా చేయడానికి అంగీకరించారు ప్రతిభ తల్లిదండ్రులు, వాళ్ల నుండి మాట తీసుకొని బయలుదేరింది భువన.
***
ఎప్పటికప్పుడు భువన సూచనలను తూ.చా.తప్పకుండా పాటించారు ప్రతిభ తల్లిదండ్రులు. ఆమె ఆలోచన సత్పలితాన్నిచ్చింది. అంచనా నిజమయ్యింది. ఆ యేడు జరిగిన పదవతరగతి వార్షిక పరీక్షలను బాగా రాసిన ప్రతిభ ఆ స్కూల్‌కే కాకుండా జిల్లాకే ఫస్ట్ ర్యాంక్‌లో వచ్చింది. ఆమె ఆనందానికి అవధుల్లేవు. ప్రతిభ తల్లిదండ్రులది కూడా అదే స్థితి. భువనకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెప్పారు వాళ్లు.
‘మంచి టీచర్’ అనిపించుకున్నందుకు భువనకూ సంతోషంగానే ఉంది.
‘పిల్లలపైన ఒత్తిడి లేకుండా చేయగలిగితే వారిలోని అసలైన ప్రతిభ’ బయటకు వస్తుంది.

- సరస్వతి యశస్విని కరీంనగర్, సెల్.నం.9963499137