రాజమండ్రి

యువతరం కదిలింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తలెత్తి ఆ కుర్రాడిని చూడవే.. రాజకుమారుడులో మహేష్‌బాబులా ఎంత లేతగా వున్నాడో’ అంది శ్రావ్య.
‘మీరు పొరబడ్డారు. పెళ్లిచూపులకి వచ్చింది మా అన్నయ్య వెంకట్. వాడికి వన్‌టవున్‌లో ఒక బంగారం షాపు, గాంధీనగర్‌లో కొత్తగా మరొకటి వున్నాయి. అతన్ని ఇష్టపడిన వారు ఈ దండను అన్నయ్య మెడలో వేయండి’ అని దండ టీపాయ్ మీద వుంచాడు మహేష్. అక్కడ కూర్చున్న ఆరుగురు అమ్మాయిలూ అతని మాటలకి తెల్లబోయారు. ఇంతలో ఒక అమ్మాయి లోపల నుంచి వచ్చి దండ వెంకట్ మెడలో వేసి మెరుపులా మాయమైంది.
ఆ సంఘటనకి అందరూ అవాక్కయ్యారు.
‘మా అక్కయ్య సౌదామిని. పుట్టుకతో కాలు కొద్దిగా సమస్య. దాని పెళ్లిచేశాక నా పెళ్లి చేద్దామని నాన్నగారు అనుకున్నా ఏ సంబంధం కుదరక ఇప్పుడిలా..’ తప్పుచేసిన దానిలా తలవంచుకుంది సౌమ్య.
‘నా పెళ్లి అయియిపోనట్లే. సౌదామినీ ఇటురా!’ అని పిలిచాడు. ఆమె కుంటుతూ వచ్చి అతని ఎదుట నిలబడింది. ఇప్పుడు మనిద్దరం అన్నా-వదినలుగా మా వాడికి పెళ్లిచేయాలి. ఇక్కడ అమ్మాయిలు ఎక్కువగా కనబడుతున్నారు కాబట్టి స్వయంవరం మా తమ్ముడికే. నీకు నచ్చిన అమ్మాయి మెడలో దండవేయరా’ అని ఒక దండ తమ్ముడి చేతికిచ్చాడు వెంకట్.
దానిని సౌమ్య మెడలో వేశాడు మహేష్.
‘పెళ్లంటూ లక్షలు ఖర్చు చేయడం మాకిష్టం వుండదు. మీరు ఏ గుళ్లోనో కన్యాదానాలు పెట్టుకోండి. అవి చాలా నిరాడంబరంగా వుండాలి. మీరు పెళ్లికి ఖర్చు చేయాలనుకున్న డబ్బుని అనాధ ఆశ్రమాలకి సగం, వృద్ధాశ్రమాలకి సగం డొనేషన్‌గా పంపండి. ఏమంటారు మామగారూ?’ నవ్వుతూ అడిగాడు వెంకట్.
‘నా అల్లుళ్లు ఇద్దరూ రత్నాలు. పెద్దల్లుడు మనుషుల్లో దేవుడైతే, చిన్నల్లుడు దేవుడి లాంటి మనిషి. ఈతరం వారిలో ఇంత మంచి భావాలా?! నా పెద్దకూతురికి జీవితాన్నిచ్చిన...’ ఆయన గొంతు బొంగురు పోయింది.
‘దేవుడిచ్చిన దానికి మనం ఏం చేస్తాం? మనసు ముఖ్యం’ అంటూ సిగ్గుతో తలవంచుకుంది సౌదామిని.

- వేమూరి రాధాకృష్ణ