నెల్లూరు

కుంతల! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ‘నిమ్మనపల్లి’ ప్రాంతంలో నున్న, ‘బాహుదానది’ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఏరు పసిపిల్ల లాంటిది. ఎంతవద్దన్నా ప్రవహిస్తుంది. పిల్లపిల్ల అలలతో అలరారుతూ నవ్వుతూ తుళ్లుతూనే ఉంటుంది. స్వచ్ఛంగా ప్రకృతిని పలకరిస్తుంది. అక్కడున్న వారి హృదయాలను తట్టి పలకరిస్తూనే ఉంటుంది. ఎవరిమీదా కోపం చూపడం తెలియనిది. ఎవరు కాళ్లు పెట్టినా సుతారంగా పలకరిస్తుందే తప్ప! తనలోకి లాగేయాలనే ఆలోచన లేనట్లుంటుంది.
ఇవన్నీ ఎదురుగా ఉన్న ‘‘కుంతల’’కి వింతగా ఉంది. ఒకవైపు తనలా నేనెందుకు లేను? అనుకుంటూ ఆలోచిస్తుంది.
ప్రవాహం కొద్దిగా తగ్గింది. అనుకున్నదే తడవుగా మెల్లగా కిందికి దిగింది. పాదాల్ని మునిగేలా ఉంచి అక్కడున్న గట్టుపైన ‘కానుగ చెట్టు కొమ్మను’ పట్టుకుని కూర్చుంది. హాయిగా ఉంది. ఎండవేడిమితోనూ, గుండె వేడితోనూ అలసిపోయిన శరీరానికి ఎంతో స్వాంతనగా ఉంది.
బరువెక్కిన గుండె కాస్త తేలిక పడ్డట్లయ్యింది. అలాగే కొంగును చుట్టుకుని వెల్లకిలా పడుకుంది. ఆకాశం కేసి చూస్తుంటే ఏదో ఒక వింతలోకం ఇక్కడ దాగుందానిపిస్తుంది.
ఆకాశంలోని నక్షత్రాలన్నీ ముగ్గుల్లా, అక్కడక్కడ ఏవేవో రంగులు కదలినట్లుగా, అక్కడక్కడా కనిపించే మేఘాల తాలూకు చిహ్నాలన్నీ మనం ఊహించుకున్న జంతు రూపాలు ప్రాణం పోసుకున్నట్లుగా ఉన్నాయి.
నిజమే! ఆకాశం ఎంతో బావుంది. నేను..? ఎందుకు ఇలా? ‘నాలో ఆనందం ఆవిరైంది.’ జీవితంలో సంతోషం లేదు? అది ఎక్కడుంది? అనుకుంటూ- ఒక్కసారి తన పొట్టను తడుముకుంది. తమకంగా లోపల ఉన్న బిడ్డ ‘అమ్మా! ననే్నమీ చేయవు కదమ్మా’ అన్నట్లు వినిపిస్తోంది...
ఆ మాటలకు ‘కుంతల’ స్పందిస్తోంది. ‘నేనేం చేయనమ్మా? జీవితం కావాలంటే, నిన్ను చంపేయాలంటమ్మా. నువ్వే కావాలంటే జీవితం నాతో రాదంట మరి నేనేం చేయగలను? అసహాయురాలిని. నాలుగురాళ్ళు సంపాదిద్దామన్నా చదువు లేదు. పని కూడా అంతంత మాత్రమే! ఏ కూలో నాలో చేద్దామనుకుంటే, నువ్వు కడుపులో ఉండగా అది కూడా చేయకూడదంట. ఏం చేయను తల్లీ? నాకంటూ ఎవరూ లేకపోయే. నేను ఒక అనాధను. ఇష్టపడి ‘మీనాన్న పాంచాలుడు’ పెళ్ళి చేసుకున్నాడు. నెల తప్పానంటే సంతోషడినాడు. ఐదు నెలలు వచ్చేంతదాకా ఊరుకున్నాడు. తీరా అదేదో ఫొటోలో తెలిసిందట నువ్వు ఆడబిడ్డవని. అంతే వెంటనే నా దగ్గరకు వచ్చి నిన్ను చంపేయమని ఒకే గొడవ.
ఇప్పుడు చంపేస్తే నీ భార్య కూడా చనిపోతుందని డాక్టర్లు రామలక్ష్మి, రెడ్డెమ్మగార్లు ఎంతచెప్పినా వినకుండా నేను చచ్చినా పర్లేదంట. నాకు ఆడపిల్ల మాత్రం వద్దంటున్నాడు మీ నాన్న పాంచాలుడు.
డాక్టర్ రామలక్ష్మిగారు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా తీరు మారలేదు. ఇదే విషయంపై మాటలు కాస్త, ఏకంగా పెద్ద గొడవే అయ్యింది.
బిడ్డను తీయించుకుంటేనే ఇంట్లో ఉండమన్నాడు. లేకుంటే వెళ్ళమని బయటకు గెంటాడు మొగుడు! మీనాన్న!
సరే అనుకుని ‘అబార్షన్’ చేయిద్దామనుకున్నా.. కానీ నా మనస్సు ఒప్పలేదమ్మా.
ఇందుకో కారణం ఉంది. మా అమ్మ ఇలాక్షి చనిపోతూ చెప్పింది కదా? నేను నీ కడుపున పుడతానే అని. బిడ్డనైతే చంపే హక్కు మీనాన్న పాంచాలుడుకు ఉందేమో, కానీ మా అమ్మవు నువ్వు. నిన్ను చంపే హక్కు నాకు లేదు కదమ్మా!’ అంటుంది మరోసారి పొట్టను తడుముకుంటూ.. కుంతల..
‘హమ్మయ్య! అయితే నువ్వు నన్ను చంపవని అర్థమయ్యింది. చాలా ఋణపడి వున్నాను’
‘అమ్మా నాకు నాన్నతో కూడా ఆడుకోవాలని ఉందమ్మా! అయితే నేను చెప్పేది నువ్వు వింటావమ్మా?’ అంది లీలగా బిడ్డ.
‘ఏందీ నువ్వు నాకు ఉపాయం చెబుతావా? బావుందమ్మా? గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించిందట’ అంది కుంతల సున్నితంగా కడుపుపై కొడుతూ.
‘నేను నీకు బిడ్డను కానమ్మా! మీ అమ్మను కదా!’ అంది చిలిపిగా.
‘నువ్వు ముందు ఇంటికి వెళ్ళు!’
‘ఇంటికా! అమ్మో ఇంకేమయినా ఉందా?’ అంది భయపడుతూ కుంతల.
‘నేను చెప్పింది చెయ్యి! అంతే!’ అంది హుకుం జారీచేస్తూ.
‘సరే! తర్వాత!’ నవ్వుతూ అడిగింది.
‘నేను చెప్పినట్లు చెప్పు. ఇపుడు ఐదు నెలలు అయ్యింది. ఇప్పుడు అబార్షన్ చేస్తే నేను చచ్చిపోతాను. అందుకని ఏకంగా బిడ్డ పుట్టాక ఎక్కడో ఒకచోట పడేసి మనం హాయిగా ఉండవచ్చుకదా అని చెప్పు.’
‘లేదు లేదు.. నేను అంతటి పాపపు పని చేయలేను. అప్పుడు చెత్తకుప్పలో పడేసి నిన్ను కాదు.. మా అమ్మని బాధ పెట్టలేను’ అంది తల్లడిల్లుతూ కుంతల.
‘అరె! నువ్వాగు! నేను చెప్పినట్లు చేయి. నేను నీకు అమ్మనయితే, నాకు నువ్వు అమ్మవు కావా? చెప్పు అమ్మ ఏమి చెప్పినా నీ బాగు కోసమే కదా?’
‘అవునవును. ఇప్పుడేం చేయాలో చెప్పు!’
‘నువ్వు ముందు ఇంటికి వెళ్ళు. చీకటి పడుతోంది. రోజులు బాగా లేవు. ఇక మానవ మృగాలు నిన్ను ఏదైనా చేస్తే ఏమాత్రం ఆలోచన లేకుండా కేవలం ఆధునికంలో ఉన్న అమ్మను కాపాడుకోవాలి కదా’ అనగానే వెనువెంటనే ఇంటిముఖం పట్టింది కుంతల.
‘ఏమే? మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఆ పాపిష్టిదాన్ని మోసుకుంటూ ఇంటికి వచ్చావు?’ అన్నాడు మొగుడు పాంచాలుడు.
‘మరేమో.. నాకో ఆలోచన వచ్చిందయ్యా’ అంది అక్కడే ఇంటిముందు అరుగుపై కూర్చుంటూ కుంతల.
‘ఏమిటో ఆ ఆలోచన?’ అన్నాడు మొగుడు పాంచాలుడు. విషయం అంతా వివరంగా విన్న తర్వాత ‘మరి మనం పారేస్తే, టీవీలలోను, పేపర్లలోను మనసులేని తల్లిదండ్రులని రాత్తారేమోనే’ అన్నాడు బీడీ పొగవదులుతూ!
‘మనకు మనస్సులేడివయ్యా! కన్న బిడ్డను చెత్తలో పడేసినంక ఇంకా మనస్సున్నదంటే నమ్ముతావా? ఈ ఊళ్ళోవాళ్ళు, ఈ జనాలు నమ్ముతారా? అవేమీ మనస్సులో పెట్టుకోవద్దు’ అంది కుంతల.
‘అంతేనంటావా?’
‘అంతేకదా మరి’ అంది వంతపాడుతూ కుంతల.
‘సరే అట్టయితే బిడ్డ పుట్టినాక నువ్వు ఏడ్వకూడదు మరి’ అన్నాడు పంచె బిగించి కట్టుకుంటూ పాంచాలుడు.
‘అమ్మా! తర్వాత ఏం చేస్తావు’ అంది నవ్వుతూ కుంతల బిడ్డతో..
‘ఒక్క రెండు నెలలు గడవనీ.. సీమంతం చేయాలని పాంచాలుడను తొందరపెట్టు’
బిడ్డ బోధించినట్లే పాంచాలుడుని తొందరపెట్టింది. ‘మనకు వద్దనుకున్న బిడ్డకు ఇవన్నీ ఏమిటికే? సరిపెట్టుకో’ అన్నాడు కాస్త చిరాకుగా పాంచాలుడు.
‘అయ్యో నా మొగుడా! నీకు తెలిదయ్యా. ఇలా చేస్తేనే రేపు మనం పారేసినా మనపై ఎవరికి అనుమానం రాదు’ అంది గడుసుగా కుంతల. పాంచాలుడుకి కూడా నిజమేననిపించింది. ‘సరేయే! అట్టే కానీ’ అని లోపలకి వెళ్ళిపోయాడు.
కుంతల సంతోషానికి పట్టపగ్గాలు లేవు. నిజంగానే మా అమ్మే తనకు పుడుతోందని నమ్మేసింది. అమ్మే తన జీవితాన్ని ఒక తాటిపై నడుపుతోందని బలంగా నమ్మింది కూడా.
అనుకోని రీతిలో సీమంతం ఘనంగా జరిగింది. కుంతలకి తెలియని భయం కలుగుతోంది. మనస్సులో ఒకటే వేదన. తొమ్మిదోనెల వచ్చేసి దాదాపు రెండు వారాలు గడచింది. ఇక పుడితే పారేయాలా అనే భయంతో వణికిపోయింది.
అదేమాట బిడ్డను ‘అమ్మా ఇప్పుడేం చేయాలి?’ అని అడిగింది కూడా.
‘పాంచాలుడుకి నమ్మకమైన కోయదొరకు డబ్బులిచ్చి నేను చెప్పినట్లు చెప్పు’ అంది.
అంతా విన్న తర్వాత కుంతలకి ఆశ్చర్యమయింది. సరేనంది. సాయంత్రం పోలేరమ్మ దేవాలయానికని చెప్పి బయలుదేరి దారిలోని అంజనాద్రికి డబ్బులిచ్చి తాను చెప్పమన్నది చెప్పమని, రేపు తను మళ్ళీ దేవాలయానికి వెళ్ళే సమయానికి నా మొగుడు పాంచాలుడు ఇంట్లోనే ఉంటాడని కూడా చెప్పింది.
‘అంబపలుకు జగదంబ పలుకు అంటూ వచ్చిన అంజనాద్రిని చూసి ఆశ్చర్యపోయాడు పాంచాలుడు’ చాలా యేళ్ళ తర్వాత అంజనాద్రి వచ్చాడే అనుకుంటూ బయటకు వచ్చి కూర్చున్నాడు.
‘ఏందన్నా అంజనాద్రి దొరా మళ్లీ వేసం కట్టినావు. నాలాగే నీకు కష్టాలొచ్చినాయా’ అన్నాడు పాంచాలుడు బీడీ ముక్కను ఆఖరుగా పీలుస్తూ పక్కకు పడేసి.
‘నాకేంది కట్టం బిడ్డా? తినడానికి తిండి ఉంది. ఉండేదానికి ప్రభుత్వంవారు ఇచ్చిన ఇల్లుంది. కట్టుకోవడానికి... తడిపి ఆరేయడానికి రెండు బట్టల జత ఉంది. ఇంగ నాకేం కావాల?’ అన్నాడు జోలెను పక్కకుపెట్టి కూర్చుంటూ అంజనాద్రి.
‘అయితే ఇంకెందుకు తెల్లారలకు ఊరిమీద పడ్నావు’ అన్నాడు వ్యగ్యంగా ధ్వనించే స్వరంతో పాంచాలుడు.
‘ఏమిసేద్దాం పాంచాలు.. పాపం ఎక్కువైనప్పుడే అంబ పలికేది’ అన్నాడు.
‘ఏందీ పాపం ఎక్కువయిందా? ఎలా? ఎక్కడ? కన్నబిడ్డల్ని చంపి పారేస్తుంటే పాపాలు కాక ఏంది చెప్పు?’
‘సంపి పారేసారా? ఎవరూ?’ అన్నాడు ఆశ్చర్యంగా పాంచాలుడు.
‘పారేయకుంటే ముందుముందు పారేస్తారు’ అనగానే పాంచాలుడుకి చమటలు పట్టినాయి. ఆపాట్నే ఆ ఇంటికున్న వెదురు బొంగుల తలుపు వేసివచ్చి ‘నీకెట్లా తెలిసింది అంజనాద్రి దొర’ అడిగాడు వణికిపోతూ..
‘అంబ చెప్పింది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మీ ఇంట కాలుపెడతానంటే చంపుతామని అంటున్నాడని రాత్రంతా ఒకటే ఏడ్చింది.’ అనగానే కుప్పకూలిపోయాడు పాంచాలుడు. నీకు పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డ, సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవే నీ ఇంట కాలుపెడుతోంది.
‘ఆడబిడ్డ పుట్టగానే నీకు ఉన్న దరిద్రమంతా పోతుంది. నీ ఇల్లు పాలు పొంగినట్టు పొంగుతుంది. నువ్వు చేసే పాపపు పని మానేయి. నీకంతా మంచే జరుగుతుంది’ అంటూ ఇంకా ఏదేదో చెప్పుకుంటూ పోయాడు తనపని అయిపోయినట్లు. ఒక ఆడబిడ్డను కాపాడిన తృప్తితో అంజనాద్రి. పాంచాలుడుకు సాక్షాత్తు భగవంతుడిలాగే కనిపించాడు అంజనాద్రి. అదేంది తనను చంపద్దొని సాక్షాత్తూ ఆ లక్ష్మీదేవి నా కడుపున పుడుతోందా?
‘అమ్మా! పోలేరమ్మ తల్లీ! నా తప్పును సేమించు అనుకుంటూ లెంపలు వేసుకున్నాడు. ఎంత బలవంతం పెట్టినా అన్నం తినని అంజనాద్రికి ఓ గ్లాసుడు మజ్జిగ అందించాడు. అంజనాద్రి వచ్చిన పని పూర్తి చేసుకుని బయలుదేరాడు.’
కుంతల రాగానే ఎంటనే పాంచాలుడు ఎదురెళ్లి... ‘అరెరె! నువ్వింగ ఎండలో తిరిగి కష్టపడద్దు కుంతల. నువ్వు మోస్తున్నది సామాన్యురాలిని కాదు. ఏకంగా ఆ మహాలక్ష్మినే. అర్థమయ్యిందా? ఇక కానుపు అయ్యేదాకా నువ్వు బయట తిరగవద్దు’ అంటూ ‘మన రోజులు మంచివి కాబోతున్నాయంటనే. డబ్బులు వస్తాయంట’ అంటూ ఇంకా ఏవేవో చెప్పుకుంటూ పోతున్నాడు.
‘ఎట్టయ్యా?’
‘మనకు పుట్టబోయే బిడ్డలో లక్ష్మి ఉందంట నా కుంతల’.
‘మడి పుట్టగానే సంపొద్దా?’
‘ఆ మాటంటే ఇంక నిన్ను సంపుతా! లక్ష్మిదేవిని సంపుతానంటావా?’ అన్నాడు ఆశ్చర్యంగా పాంచాలుడు.
‘అయ్యా! ఎంత సల్లని మాట సెప్పావయ్యా!’ అనుకుంటూ పాంచాలుడులో మార్పు తెచ్చిన అంజనాద్రిని సాక్షాత్తూ ఆ శ్రీరాముల స్వామిగా తలుచుకుని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంది.
ఆ సంతోషంలోనే కుంతల ఆడపిల్లకు జన్మనిచ్చింది. పాంచాలుడుకి అమ్మ సీతాలక్ష్మీ, కుంతల తల్లి పేరు వరాల దేవి కావడంతో లక్ష్మీదేవి అనే పేరునే పెట్టుకుంది. చనిపోయినా తల్లి బిడ్డను కాపాడుతుందనే అమ్మకు నమస్కరించుకుంది.
అంతలోనే అనుకోకుండా పాంచాలుడుకి ఒక చోట పని కుదిరింది. దాంతో పాంచాలుడికి మరింత గురి కుదిరింది. లక్ష్మీదేవిని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. కుంతల లక్ష్మీదేవి అమ్మా అనే పిలుచుకుంటుంది.
కానీ ఎవ్వరికీ తెలియని విషయం ఒకటుంది. నుదుటి రాతను ఎవరూ తుడపలేరని.. తుడపడం అంటే చేత్తో కుదరదని...
నిజమే! అది శాస్తమ్రయినా కాదన్నా, మూఢ నమ్మకమయినా, ఏదయినా ఏమయినా మనలో మనం మనకు నమ్మకం ప్రధానం. కుంతలకి తన తల్లి చెప్పినట్లు అనిపించినా అవన్నీ తన ఆలోచనలే! కాకపోతే ఎవరో చెబుతున్నట్లు చేస్తేనే తృప్తి ఉంటుంది. పాంచాలుడికి ప్రయత్నిస్తే పని దొరకక కాదు. దొరుకుతుంది.
కాని ఎవరో చెబితేనే పని ఏదయినా దొరుకుతుందేమో అనుకుని ప్రయత్నిస్తే దొరికింది. ఏదయితేనే? ఒక ఆడపిల్ల బతికింది. ఒక అమ్మ మనసు సేదదీరింది. కాకపోతే ప్రతి సమస్యకు అమ్మ కనబడదు. అంజనాద్రి లాంటివారు కనపడరు.
సమయస్ఫూర్తి ఉంటే ఏదైనా సాధ్యమే అనుకునే జీవితాలకు ఈ భార్యాభర్తలు ఆదర్శంగా నిలిచారు.
ఆడపిల్లను ఆడపిల్ల అనుకునే రోజులు ఇపుడు లేవు. అందరూ సమానులే. ఎవరైనా చదువుకోవాల్సిందే. ఎవరైనా ఉద్యోగం చేయాల్సిందే. సంపాదించాల్సిందే. అంతమాత్రాన ఆడ, మగ తేడాలెందుకు ఒకర్ని ఒకరు ఎప్పుడూ గౌరవించుకోవాలి.
ఆడపిల్ల అని చులకన చేయకండి! అదృష్టంగా భావించండి! ఆడబిడ్డను కాపాడుకుందాం.

- ఆలకుంట రెడ్డి ప్రసాదు, వాల్మీకిపురం.
చరవాణి : 98486 72587

స్పందన
అమ్మో...నిజంగా ఇలాంటి
పురస్కారం వద్దనే వద్దు
గతవారం మెరుపులో ఘాలి లలిత గారు వ్యంగ్యంగా రాసిన పురస్కారామా..నీకో నమస్కారం అనే కథ బాగా నవ్వించింది. నిజంగా సమాజంలో ఇలా కూడా జరుగుతాయా? అనే సందేహం కలగక మానదు. నిజంగా ఒకరికి డబ్బులిచ్చి వారు ఇచ్చే పురస్కారం పొందడం వింటుంటూనే చాలా అసహ్యంగా ఉంది. ముఖ్యంగా కవులు, రచయితలు ఎందరికో ఆదర్శంగా వుండాలి..వారే ఇలాంటి పనికిమాలిన పనులకు పాల్పడుతున్నారని కథలో రాశారు.. నిజంగా నమ్మలేకపోతున్నాను. అయితే కథ మాత్రం చివరి వరకు సరదాగా వ్యంగ్యంగా సాగింది.
- గోపాలరావు, అంజయ్యరోడ్డు, ఒంగోలు
- సావిత్రి, కస్తూరిబావి సందు, తిరుపతి.

వస్తున్న ముప్పును పసిగట్టిన కొత్త ఆపద
మెరుపులో ప్రచురించిన కొత్త ఆపద కవిత చదివిన తరువాత కవి ఎంతో ముందు చూపుతో, ఆవేదనతో రాసినట్లు అనిపించింది. నిజంగా రైతుకు కడుపు నిండాలి కాని ఏవో కొత్త కొత్త మాయాజాలాలు ఎందుకు? రైతుకు నిజంగా మట్టిని దూరం చేసే ప్రక్రియ ఇప్పుడు జరుగుతుంది అంటూ ఎంతో గొప్పగా రాసిన రచయిత అవ్వారు శ్రీ్ధర్‌బాబుకు నిజంగా ధన్యవాదములు.
- దూర్తాటి వేణుగోపాలరావు, నెల్లూరు
- కొండ్రు తిరుపతిరెడ్డి, నాయుడుపేట

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

మనోగీతికలు

హితైషికాలు
ఎదగడం అంటే పెరగడమూ కాదు
ఒదగడం అంటే తగ్గడమూ కాదు
ఎదగడం అంటే
ఓ..పువ్వులా వికసించడం
సుమగంధపు పరిమళంలా
పరిణత సౌరభాలను వెదజల్లడం
ఒదగడం అంటే
విరిదండపు దారంలా విలువను పెంచుకోవడం
తెలపకనే తెలిసేలా
నడతల్లోని నాణ్యతను తెలియజేయడం
తగ్గడం అంటే తలదించడం కాదు
పెద్దరికాన్ని గౌరవించడం
వినయంతో వినమ్రతను చాటుకోవడం
బాధ్యతలంటే
భారమనుకొనే బ్రతుకులు కావు
కష్టాన్ని ఇష్టంతో కట్టేసి అందిపుచ్చుకొనే
ఓ ఆత్మానందపు సంతృప్తి
వ్యక్తిత్వమంటే
ఆకారాది సాకారాలు కావు
అగుపించే ఆచరణాత్మక
అంతరంగపు సౌశీల్యాలు
వారసత్వం అంటే
పోగేసుకొన్న ఆస్తులకు పట్ట్భాషిక్తులవడం కాదు
బాధ్యతలతో
గత కీర్తుల వైభవాలను ఇనుమడింప చేయడం
రక్త సంబంధాలంటే
కళ్లజూసే వైషమ్యపు రక్తపు మరకలు కావు
పంచుకొనే ఆప్యాయతలతో పెంచుకొనే
అనుబంధాలతో
ఆంతర్యాల అంతరాలను చెరిపేసుకోవడం
గొప్పతనం అంటే
ప్రదర్శించే డాబూ దర్పాల
విజయబావుటాలు కావు
చెదరని విలువలతో చెరగని ముద్రలతో
పదుగురి హృదయకేతనాల్లో నిలిచిపోవడం
విచక్షణ అంటే
బేరీజు వేసుకొనే మంచిచెడుల మదుపులు కాదు
విజ్ఞతతో మంచిని ఎంచి మసలుకోవడం
అవలోకించాలి- అంతర్ముఖులం కావాలి
అర్ధాలే కాదు అంతరార్ధాలు గ్రహించాలి
విహితం కాని భాష్యాలను విడిచేద్దాం
సహితంతో కూడిన
అర్ధాలనే సంతరించుకొందాం
నిబద్ధత గల జీవితాలకు
ఇవే నిండైన ప్రామాణికాలు
పరిస్థితుల ప్రాబల్యాల మద్య
చాటుకొనే వ్యక్తిత్వాలకు నిలువుటద్దాలు
విలువల లోతులు తెలుసుకొన్న వాళ్లకు
నిష్కామ జీవన సాఫల్యాలు
భిన్న సంస్కృతుల మధ్య
విభిన్నతలు లేని సర్వజనామోదితాలు
చెక్కు చెదరని
సనాతల సంస్కృతుల శిలాభావాలు
***
జీవితాలు కూడా పాఠాల్లాంటివే
ప్రశ్నలే కాదు ...జవాబులు వుంటాయి
అవగతమైతేనే సమాధానాలు
కాకుంటే మిగిలిపోయేది ప్రశ్నలే
మనలో మనం జీవించడం కాదు
ఇతరుల్లోనే మనం జీవించాలి
సహకరించే ఈ జీవన సంహితాలే
జన జీవన స్రవంతులను
శృతి చేసే హితైషికాలవుతాయి.

- కె.రవీంద్రబాబు, పాకాల
చిత్తూరు జిల్లా
చరవాణి : 9052778988

లోకం తీరు
శాంతికి సెలవిచ్చింది
అశాంతికి నెలవయ్యింది
నడుస్తున్నది కలికాలం
కాసులుమరిగిన కాలచక్రం
ఒద్దిక మరచిన ఉమ్మడిబ్రతుకులు
వత్తిడి బ్రతుకున తరిగిన మమతలు
మురికిబట్టిన మానవత్వం
బ్రతుకుబాటలో క్రూరత్వం
కాలంచెల్లిన సంస్కారం
పెద్దల సామెతల తిరస్కారం
ఎదిగిన బిడ్డలు ఎగిరిన పక్షులు
ఒదిగిన వృద్ధులకు ఆశ్రమ బ్రతుకులు
వెతికినా దొరకని అనుబంధాలు
విషకూటములైన రక్తసంబంధాలు
ఉన్నత విలువలు వెలవెలబోయే
అనుబంధాలకు అర్థాలే కరువాయే
సృష్టిలేనిదే జీవి లేదు
అమ్మలేనిదే జన్మలేదు
జన్మను మరచిన బ్రతుకేలేదు
అన్నీ తెలిసిన ఆత్మీయుడవై
పెద్దల హద్దులు మరవద్దు
మన సంస్కృతీ సంప్రదాయాలే
మనకు ముద్దు..!

- హస్తి మోహన్‌రాజు
చరవాణి : 8008511316

email: merupunlr@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

- ఆలకుంట రెడ్డి ప్రసాదు, వాల్మీకిపురం