భవిష్య కాలం

భవిష్య కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లింగం బాపయ్య చౌదరి, విజయవాడ (కృష్ణా)
ప్రశ్న: శర్మగారూ, భవిష్యకాలంలో మీరు చెప్పే సమాధానాలు బాగానే ఉంటున్నాయి. నేను జ్యోతిషాన్ని నమ్ముతాను కాని శాంతి పూజల పేరిట జరిగే తతంగాన్ని నమ్మను- మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?
సమాధానం: మీ ప్రశ్న విచిత్రంగా ఉంది. నేను వైద్యాన్ని నమ్ముతాను కాని చికిత్సను మాత్రం నమ్మను అన్నట్టుంది. క్రియకు ప్రతిక్రియ ఎప్పుడూ ఉంటుంది. ఇక ‘మంత్రాలకు చింతకాయలు రాలుతాయా?’ అనే సామెత క్రియాశీలత లేని సోమరుల పట్ల చెప్పిన సందర్భం కాని మంత్ర ప్రభావం పట్ల చెప్పింది కాదు. మంత్రానికి చింతకాయలు రాలకపోవచ్చు. అసలు చింతకాయలు రాలటానికి మంత్రం అవసరమే లేదు. మంత్రానికి చింతకాయల మాట ఎలా ఉన్నా మానసిక చింతలు మాత్రం తీరుతాయి. మంత్రం అంటే ఒకే ఒక భావంలో కొన్ని శాస్తబ్రద్ధమైన అక్షరాలను ఉచ్చరిస్తూ మనస్సును ఏకాగ్రం చేసి ఆ భావంలో మనస్సును లయం చేయటం. దానివలన మానసిక ఉత్తేజం మనోనైర్మల్యమూ సిద్ధిస్తుంది. తద్వారా లౌకిక ప్రయత్నానికి బలం లభిస్తుంది. అదొక మనోవిజ్ఞాన ప్రధానమైన జయయోగసాధన- ఆ సాధనవలన దుష్ఫలితాలు దూరమవుతాయి.
పేరు ప్రకటించడం ఇష్టం లేదు - ఫిల్మ్‌నగర్, హైదరాబాద్
ప్రశ్న: మహాశయా! నేను ఒకప్పుడు తెలుగు సినీ రంగంలో మద్రాసులో బాగా రాణించినవాణ్ణి- హైదరాబాద్ మీది మమకారంతో వచ్చాను. అదేం చిత్రమో కాని అవకాశాలు అసలే లేవు. ఆర్థికంగా నాకేమీ లోటులేదు. పరిశ్రమ ననె్నందుకు గుర్తించటంలేదనే నా ఆవేదన- మళ్లీ మద్రాసుకు మకాం మార్చమంటారా? ఏదైనా పరిష్కారం చెప్పండి.
సమా: ఎంతటివారికైనా కాలమెప్పుడూ ఒకే రీతిగా ఉండదు. అదే జ్యోతిషగ్రహ ప్రభావం- మీరు తెలిపిన పేరు ప్రకారం మద్రాసు (చెన్నై) హైదరాబాద్ కూడా బాగానే ఉంటాయి. మీకు నడుస్తున్న దశ శని లోకేతృంతరం- నటీనటులు రాణించాలంటే ‘రూపాశ్యామలా’ మంత్ర సాధన చేయాలి. ఉపదేశం పొంది -బాసర క్షేత్రంలో కొన్ని రోజులు దీక్ష చేయండి. మళ్లీ అద్భుతంగా రాణిస్తారు.
మల్లారం త్రివేణి, కాళ్తంగి (చిత్తూరు)
ప్రశ్న:ఉద్యోగ విషయంలో ఎప్పుడూ ఒకటి రెండు మార్కుల్లో తప్పుతోంది. ఎప్పుడు విజయం సాధించగలను.
సమా: ఈ సంవత్సరం చివరి భాగంలో మీకు తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. ప్రసిద్ధ దైవక్షేత్రం గల పట్టణంలోగాని- పల్లెలో గాని లభిస్తుంది.
కోట పవన్‌కుమార్, కూచిపూడి (కృష్ణా)
ప్రశ్న: నాకు ఏ వ్యాపారం లాభిస్తుంది
సమా: కిరాణా- కలప - ఫర్నిచర్- రియల్ ఎస్టేట్ అనుకూలంగా ఉంటాయి.
వి.వెంకటేశ్, బీబీనగర్ (యాదాద్రి, తెలంగాణ)
ప్రశ్న: నేను పనిచేసే దగ్గర పర్మినెంట్ కాగలనా?
సమా:బీబీనగర్ కాకుండా - జ - వ - క అనే అక్షరాలుగల చోటికి స్థాన చలనం కలిగినప్పుడు పర్మినెంట్ కాగలరు.
గుండా మాధవ్, హుజూర్‌నగర్ (తెలంగాణ)
ప్రశ్న: వివాహ ప్రశ్న
సమా: ఈ సంవత్సరమే ఏప్రిల్ - మేలోనో జరిగే అవకాశం వుంది. ఆగ్నేయ దిశ యోగిస్తుంది.
వి.పాండురంగారావు, విజయవాడ (కృష్ణా)
ప్రశ్న: భార్యా- పిల్లలతో విడిపోయాను. మళ్లీ కలవగలనా?
సమా: చట్టబద్ధంగా విడిపోతే చాలా కష్టం. ఏమైనా మే, జూన్‌లలో కొంత ఊరట లభించే అవకాశం ఉంది.
డి.సతీశ్, దాసన్నపేట (విజయనగరం, ఆంధ్ర)
ప్రశ్న: మీరు చెప్పిన ప్రకారం స్కూలు పేరు‘దీ’ అనే అక్షరం వచ్చేట్టుగా ‘దిశా’ కిడ్స్‌గా మార్చాను. లాభిస్తుందా?
సమా: పేరు వరకూ బాగానే ఉంది. వాస్తు కూడా సరిచూసుకోండి.
జి.అరుణాదేవి, భద్రాచలం (తెలంగాణ)
ప్రశ్న: ఆర్థిక బాధలు- రావలసిన డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వటంలేదు.
సమా: ప్రతి బుధవారం శ్రీ వేంకటేశ్వరస్వామికి ధూప దీప (ఆవు నెయ్యితో) బూందీ లడ్డూ, తేనె నివేదన చేసి పూజించండి. బూందీ లడ్డూ 12 ఏళ్ళలోపు పిల్లలకు పంచిపెట్టండి. ఆర్థిక బాధలు దూరమవుతాయి.
పుట్టి శివరామకృష్ణ, ఏలూరు (ప.గో)
ప్రశ్న: విడాకులు మంజూరు
సమా: గతంలో చాలాసార్లు మీరు ఈ ప్రశ్న వేస్తూ వచ్చారు. చాలా ఆలస్యంగా అవుతుంది. దైవసేవ అవసరం అని చెప్పాను. ఏం చేయాలో కూడా చెప్పాను. మళ్లా అదే ప్రశ్న వేస్తున్నారు. చెప్పింది చేశారా?- చెప్పరు.
కె.రవికుమార్, చిలకలూరిపేట (ఆంధ్ర)
ప్రశ్న: తగ్గని విషపు పుండు వ్రణం
సమా: లంక పొగాకు- వేపాకులు- సీతాఫలం ఆకులు - పసుపు - ఇంగువ- హారతి కర్పూరం నీళ్లలో నూరి కట్టు కడితే ఎంతటి విష వ్రణమైనా తగ్గుతుందని, పాము విషం కూడా దిగిపోతుందని కొన్ని చిట్కా వైద్య గ్రంథాలు చెబుతున్నాయి. పైపూతనే కనుక ప్రయత్నించండి.
బలపాల సుధాకర్, పెబ్బేరు (తెలంగాణ)
ప్రశ్న: కుమారుడి పేరు తారకరాముడు పెట్టాం. బాగుంటుందా?
సమా: చాలా మంచి పేరు. కొనసాగించండి.
డి.ఎస్.రాజు, కాకినాడ (ఆంధ్ర)
ప్రశ్న: మా అబ్బాయి మూలా నక్షత్రం నాలుగవ పాదం - వివాహ విషయం చెప్పండి.
సమా: మూలా నక్షత్రం శాంతి నక్షత్రం జనన కాల శాంతి చేశారా? నాలుగవ పాదం శుభమే- మే- జూన్‌లలో జరిగే అవకాశం ఉంది.
ఆర్.శ్రీదివ్య, హయత్‌నగర్ (హైదరాబాద్)
ప్రశ్న: ఉద్యోగం- ప్రైవేటా?- ప్రభుత్వమా?
సమా: ప్రైవేటుగా రియల్ ఎస్టేట్ ఆఫీసులో గాని- లాయర్‌గారి ఆఫీసులోకాని వెండి, బంగారం దుకాణాలలో కాని దొరికే అవకాశం ఉంది.
భావన, హుమయూన్‌నగర్, హైదరాబాద్
ప్రశ్న: వివాహం
సమా: మే, జూన్‌లలో పూర్తి అవకాశం ఉన్నాయి.
ఎ.శేషాద్రిరెడ్డి, హిందూపురం (ఆంధ్ర)
ప్రశ్న: మీరు చెప్పిన ప్రకారం ఇంట్లో అఖండ దీపం వెలిగిస్తున్నాం. చాలా బాగుంది. ప్రశాంతంగా ఉంది. ధన్యవాదాలు.
సమా: ‘అగ్నిముఖావై దేవాః’ అంటుంది వేదం. ‘్ధనమిచ్చేత్ హుతాశనః’ అని శాస్త్రం. ‘దీపేన సాధ్యతే సర్వం’ పెద్దల మాట నిరంతరం కొనసాగించండి. అన్నీ సాధ్యమవుతాయి.
షేక్ బందీ సాహెబ్, రేపల్లె (గుంటూరు)
ప్రశ్న: మేము ఎంత చేసినా డబ్బు సరిపోవటం లేదు. ఏం చేయమంటారు?
సమా: ప్రతి శుక్రవారం గోవుకు గోధుమ పొట్టు పెట్టండి. డబ్బు నిలుస్తుంది.
కైరంకొండ సుమలత రాజేందర్, కరీంనగర్ (తెలంగాణ)
ప్రశ్న: సంతాన ప్రశ్న
సమా: మీ ప్రశ్నకు పత్రికా ముఖంగా చెప్పటం సాధ్యంకాదు. వీలయితే వ్యక్తిగతంగా కలవండి. లేదా ప్రత్యేకంగా రాయండి.
అమ్మపూడి కృష్ణమూర్తి, సింగరాయకొండ (ప్రకాశం)
ప్రశ్న: నాకు వినికిడి సమస్య ఉన్నది. పరిష్కారం ఏమిటి?
సమా: ఆయుర్వేదంలో బిల్వ తైలం- శారిబాద్యారిష్ట చెప్పబడింది. సమీపంలోని వైద్యుని సలహాతో వాడండి. వీలయితే ప్రతిరోజూ రెండు నిమిషాలు శంఖం ఊదటం చేయండి. అభివృద్ధి కనబడుతుంది.
సి.చాముండేశ్వరి, పుట్టపర్తి (ఆంధ్ర)
ప్రశ్న: సంతాన విషయం - వివరణతో కూడిన సందేహం
సమా: మీ యిరువురి జాతకాలూ సంపూర్ణంగా పరిశీలించనిదే చెప్పలేనమ్మా-
బి.అరుణ, పుట్టపర్తి, (ఆంధ్ర)
ప్రశ్న: గ్రూప్ వన్ - గ్రూప్ టూ ప్రిపేరవుతున్నాను. ఎలా వుంటుంది?
సమా: తప్పక విజయం సాధిస్తారు. బాగా కృషిచేయండి.

పేరు :
చిరునామా : ...................................................... ............................................................................
...........................................................................
తోచిన సంఖ్య (1 నుంచి 108 లోపు) :
ఆ సంఖ్యను అనుకున్న సమయం, తేదీ:
............................................................................
ప్రశ్న : .................................................................
................................................................... ...................................................................
సంతకం :

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
ఉమాపతి బి.శర్మ
ఇంటి నెం. 16-2-834-బి/1/, ఎస్‌బిహెచ్-బి కాలనీ దగ్గర,
కోదండ రామాలయం రోడ్డు, శ్రద్ధాబాద్ (సైదాబాద్),
హైదరాబాద్- 500 059.
umapathisharma@ymail.com

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ