నెల్లూరు

సందేశాత్మక మామీలు ( పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు కవితా సేద్యంలో మరో ప్రక్రియ మామీలు. ఇవి హైకూలు, నానీలు, రెక్కలకు సమీపంలో ఉన్నా ఇందులో కొత్తదనం,క్లుప్తత కన్పిస్తుంది. హైకూలు విదేశాలకు చెందినవైతే మిగతావి మన సొంతం. రెక్కలు ఆరు పాదాలు, నానీలు నాలుగుపాదాల కవితా ప్రక్రియ. మామీలు మూడు పాదాలకే సరి. కొద్దిమంది మాత్రమే రాసే ఈ ప్రక్రియ నెల్లూరుకు చెందిన దామెర్లగీత చేతిలో సుందరంగా ఆవిష్కృతమయ్యాయి. ఇల్లాలిగా ఉంటూ చక్కని సాహితీ సేద్యం చేస్తున్న గీత తన ప్రతిభతో భావాల (తో)రణాలు పేరిట 108 మామీలు సృజించడం అభినందించదగ్గ విషయం. అక్షర నియమం, ప్రాస నియమం లేకున్నా ఆమె రాసిన వాటిలో అంత్యప్రాస మామీలకు కొత్త అందాన్ని తీసుకువచ్చి పాఠకులతో చదివించేలా ఉన్నాయి. ఈ మామీల్లో సమాజాన్ని దగ్గరుండి చూడు అనే సందేశం స్పష్టంగ కన్పిస్తోంది. అభ్యుదయ భావాలు, సోషలిస్ట్భువాలు, హేతువాద దృష్టి చాలా వాటిలో కన్పించాయి. గుడ్డిగా నమ్మకుండా సమాజాన్ని చదవమని హితబోధ చేస్తున్నాయి కొన్ని మామీలు
భావాన్ని సూటిగా చెప్పడానికి వీలుగా ఉండే ఈ ప్రక్రియ మామీని ముక్కుసూటి మనస్తత్వం గల రచయిత గీత తన భావాల్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేశారు. కథలు, కవితలు అనేకం రాసినా మామీలు తొలి ప్రయత్నంగా 108 రాసి పాఠక లోకానికి అందించడం అభినందనీయం.
చక్కని పదాలతో భావాన్ని సూటిగా చెప్పే రచయిత చమత్కృతి ఈ మామీలో స్పష్టంగా కన్పిస్తుంది.
తెలుగుంటే వద్దు దడ
తల్లి చేతిలో ఉందిగా
తియ్యని చెరుగు గడ

కెమేరా ట్రిక్కులు
గ్రాఫిక్ జిమ్మిక్కులు
చేయని హీరోలు ..సైనికులు

అందం పూజ్యం నటన శూన్యం
అయినా హీరోనే
ఉందిలే నట వారసత్వం

జూనియర్‌గా ఏడ్చావు
సీనియర్ కాగానే
కొమ్ములొచ్చాయా పొడవడానికి
అంటూ ర్యాగింగ్‌పై రాసిన నాలుగు మాటలు
ఆలోచించేదిగా ఉంది.

యూనివర్శిటీల్లో ఇటీవల జరుగుతున్న కులపోరుపై గీత కలం ఇలా
స్పందించింది.

కుల సంఘాల పోరు
వీధి కొట్లాటలా .. కావు
విశ్వవిద్యాలయాలు

కాదది పిల్లల ఫైటింగ్
కాదని సినిమా షూటింగ్
ఆ రచ్చ అసెంబ్లీ మీటింగ్
అంటూ నేటి అసెంబ్లీ సమావేశాల తీరును ఒక్క మామీలో చక్కగా
ఆవిష్కరించారు.
ఈ మామీలు చాలు ఆమె ప్రతిభను లెక్కించడానికి అలాగే

కాలికింద మట్టి
గర్వంగా చెపుతూంది
నవ్వూ నాలో భాగమని

హేతువాద భావాలతో
కూడిన మామీలు కూడా పాఠకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

పాపాలు చేశావా
దిగులు పడుతున్నావా
ఉన్నాయిలే మరో పుష్కరాలు

యజ్ఞాలకు వర్షాలట
వేసవిలోనూ
చేయవచ్చుగా

అడుగడుక్కూ
దేవుడున్నాడట
గుడులెందుకోమరి?

ఇదేం చిత్రమో
ఆవైపు ఆకలితో పాపల శోకాలు
ఈవైపు రాయికి పాలాభిషేకాలు

పూజలకు రాదు పుణ్యం
మునిగితే పోదు పాపం
చుట్టూ చూడు చాలు
అంటూ సమాజాన్ని చూసి
నేర్చుకోమని సందేశం ఇచ్చారు.

చివరగా
ఏ స్ర్తికి రాకూడదీ కష్టం
సీరియల్ చూస్తుండడం
కరంటు పోవడం
ఈ మామీలో హాస్యం మేళవించేవిధంగా రచన సాగింది.

***
ప్రతులకు
దామెర్ల గీత,
370 ఎల్‌ఐజి-1, కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, నెల్లూరు.
చరవాణి : 9912391196

- గౌతమి 9347109377