రాజమండ్రి

అక్షరాల ఊసులతో.. ‘పల్లవించే వేళ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేజీలు : 136
వెల : 200/-
ప్రతులకు:
అడపా పద్మ
ఎ-4, భూపతి రెసిడెన్సీ
కోదాడ రోడ్
ఎన్‌ఎస్‌పి ఆఫీస్ ఎదురుగా
జగ్గయ్యపేట-521 175
--

పుస్తక పఠనంపై మక్కువ చూపే కవయిత్రి అడపా పద్మగారు తమ అక్షరాల ఊసులతో..‘పల్లవించే వేళ’ పేరుతో ఓ కవితా సంకలనాన్ని వెలువరించారు. విద్యార్థి దశ నుండే రచనా వ్యాసాంగంపై ఆసక్తి చూపుతున్న ఆమె..క్రమంగా సాహితీ లోకంలో కవయిత్రిగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం! నవ్య భావాలకు ఆహ్వానం పలుకుతూ ఆమె వందకుపైగా కవితల్ని ఈ గ్రంథంలో పొందుపరిచారు. ప్రకృతి అందచందాలను.. బాల్యంలోని మధురిమలను.. మసకబారుతున్న మానవ సంబంధాలను.. చిగురించిన గున్నమావిని.. విరబూసిన సన్నజాజిని.. పూసిన వేప పూతని.. శశిలేని నిశిలా వెల వెలబోయే మనసును..పున్నమి నవ్వులను..వెనె్నల కెరటాలను..మమతల ఊటలను..తొలకరి గుబాళింపులను.. ఇలా అనేక అంశాలను తమ కవితా వస్తువులుగా ఎంపిక చేసుకుని పద్మగారు చక్కని పదబంధాలతో కవిత్వాన్ని పండించారు. కవితలకు కరుణాకర్ గీసిన భావచిత్రాలు గ్రంథానికి నిండు శోభను కూర్చాయి. ‘పల్లవించే వేళ’ పేరుతో రాసిన మొదటి కవితలో కవయిత్రి చక్కని భావుకతను ప్రదర్శించారు. ‘జీవనకారకులు’ కవితలో అమ్మను ఉన్నతంగా చిత్రించారు. ‘ఆనాటి మా పల్లె’ కవితలో..పల్లెల రమనీయ దృశ్యాలను అందంగా ఆవిష్కరించారు. అచ్చమైన పల్లెలు అంతరించిపోతున్నా..ఎప్పటికీ ఎదలోనే దాచుకుని..ఎన్నటికీ..మరుపురాని..మరువలేని..ఆనాటి మా పల్లె ఓ నిత్య నూతన విర్ణచిత్రమని చక్కని ముగింపునిచ్చారు.
సుధల సోనల మాటలతో..చిరు నగవుల ఊటలతో..‘నిశ్శబ్ధ ప్రయాణం’ కవి తను రూపుదిద్దారు. నేడు గదులు విశాలమే కానీ..మనసులే కుంచించుకు పోయాయని వాపోయారు. ‘ప్రకృతి పాఠం’ కవితలో ప్రకృతి ధర్మాన్ని విడమరిచి చెప్పారు. తెలుగు తల్లి కంఠసీమలో మెరిసే ఓ మణిహారం ‘మా బడి’ అంటూ చిన్ననాటి స్మృతులను నెమరువేసుకున్నారు. చినుకు తాకిడికి..చిరుమొలక శిరమెత్తిన తీరును ‘ఏరువాక సాగింది’లో అక్షరబద్ధం చేసిన తీరు బాగుంది. ఆనందమే కాదు..ఆవేదన కూడా పంచుకునే స్నేహమని ఓ కవితలో తేల్చి చెప్పారు. ‘నువ్వు-నేను’ కవితలో ఏడడుగుల బంధంతో ఏకమై..ఏడు జన్మల దాకా కలిసుండే భార్యాభర్తల అనురాగపు సరిగమలను పద్మగారు పల్లవింపజేశారు. సెల్ ఫోన్ల పుణ్యమా అని..ఒకనాటి ఉత్తరాలు క్రమంగా అంతరించి పోవడాన్ని ప్రస్తావిస్తూ వెనె్నల సంతకంలా మనోజ్ఞ సంగతులతో మరొకసారి తరలివస్తావు కదూ..అంటూ ‘ఉత్తరానికో ఉత్తరం’ రాశారు. ‘బాల్యం’ పేరుతో రాసిన కవితలో..బాల్యంలోని తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘కార్తీక మాసం’ కవితలో కార్తీక మాస వైశిష్ట్యాన్ని వివరించారు. ఊహల ఊయలలూగుతూ రాసిన ‘నువ్వు వస్తావని’ కవితలో గుండె గుడిలో మమతల తోరణాలు కట్టి..ప్రియుని కోసం నిరీక్షించే క్రమంలో..‘అభిసారిక’ అంతరంగంలో గూడు కట్టుకున్న భావాల మూట విప్పారు..అక్షర సొబగులతో మరో కవితలో చినుకుకి స్వాగతం పలికారు.
కనులతో చెప్పుకునే ఊసులు..మనసుతో చేసుకునే బాసలు..మూగగా అందించే ఆరాధనలే ప్రేమ అని తేల్చి చెప్పారు. ఇంకో కవితలో ధరణికి అనునిత్యం కిరణ సందేశాన్ని అందించే ఆదిత్యునికి అక్షరాంజలి ఘటించారు. ‘వెనె్నల విభావరి’, ‘తొలకరి’, ‘అనంతాలతో అనే్వషణ’, ‘సంగీత ఝరి’, ‘మళ్లీ కావాలి’ కవితల్లో కవయిత్రి వాడిన పదబంధాలు ముగ్ధ మనోహరంగా ఉన్నాయి. ఆమె ‘చినుకు చిరునామా’ గురించి చెప్పినా.. ‘హృదయం లేని ప్రియురాలి’ గురించి చెప్పినా.. ‘స్నేహ వసంతాన్ని’ కురిపించినా.. పద్మగారు తనకంటూ ఓ శైలిని అవలంభించడం అభినందనీయం!
భావ కవిత్వానికి పెద్దపీఠ వేస్తూ రాసిన కవితలూ ఈ గ్రంథంలో మనకు దర్శనమిస్తాయి. వాటిలో..ప్రధానంగా ‘నువ్వంటే నాకెంతో ఇష్టం’, ‘శీతల సమీరం’, ‘నీలో సగం’, ‘నీ కోసమే నేనున్నాను’, ‘మమేకమయ్యే మనసులు’, ‘ఒట్టేసి చెబుతున్నా’, ‘ఎదలో ఉన్నావు’, ‘కనిపిస్తావా ఏనాటికైనా’, ‘నాకు తెలిసింది’, ‘ప్రేమామృత స్పర్శ’ కవితల్ని ప్రస్తావించవచ్చు! ఈ కవితల్లో కవయిత్రి పద్మగారు ప్రకటించిన భావాలు రమణీయంగా ఉన్నాయి. పాఠకులకు హాయి కొలిపేలా కొలువుదీరాయి!
దీపావళి, సంక్రాంతి, శ్రీరామనవమి, శరన్నరాత్రులపై రాసిన కవితల్లో పెద్దగా కవిత్వాంశ లేక ప ఓయినప్పటికీ..పద్మగారి గొప్ప మనస్సు దాగి వుండడాన్ని అభినందించకుండా ఉండలేము! ఉగాదిపై రాసిన కవితల్లో కవయిత్రి ఆమని అందాలకు..ప్రకృతిలో అగుపించే మార్పులను అందంగా ఆవిష్కరించారు. మాతృభాష అందించే అమృత కలశాన్ని భావితరాలకు బహూకరించడమే మన కర్తవ్యమని కవయిత్రి పద్మగారు మరో కవితలో గుర్తు చేశారు. ఈ గ్రంథంలో ఇలా ఎన్నో కవితలు ఉదహరించడానికి యోగ్యంగా వున్నాయి. వీటిలో చాలావరకు ‘ఆంధ్రభూమి’ వారపత్రికలో ప్రచురింపబడటం విశేషం! కవయిత్రిగా..పుస్తక రూపంలో అచ్చులోకొచ్చిన అడపా పద్మ గారికి అభినందన చందనాలు సమర్పిద్దాం.

---
రచనలకు ఆహ్వానం
నవ, యువ, ఔత్సాహిక రచయితలూ ఈ పేజీ మీది... మీ ఆలోచనలకు అక్షర రూపం... సమాజానికి కావాలి మణిదీపం! మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా, మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి, ఆవిష్కరించే అద్భుత అవకాశమే ఈ ‘మెరుపు’. మీ కలాలకు పదును పెట్టండి... నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి. ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి. మీ రచనలను
కింది చిరునామాకు పంపండి.

- దాస్యం సేనాధిపతి సెల్.నం.9440525544