రాజమండ్రి

ఉగాది లక్ష్మీ క్షమించు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంత వెదికినా వేపచెట్టు కనపడదే!
విందామంటే కోయిలపాట వినపడదే!
నాలో ఏమైనా లోపమా!
లేదు లేదు లోపం నాలో లేదు
కాలమే మారిపోయింది. నా పిచ్చిగాని,
అరణ్యాలు జనారణ్యాలుగా మారుతున్న వేళ
ఆక్రమణల పర్వంలో
అరుగులు లేని అపార్ట్‌మెంట్లు
వాకిళ్లు లేని లోగిళ్లు
ఇక చెట్టుకు దిక్కేది, పిట్టకు గూడేది
రెడీమేడ్ బోగి పిడకలు, ఉగాది పచ్చడి పేకెట్లు
షాపింగ్ మాల్స్ సప్లయి చేసే ఈ రోజుల్లో
ఉగాది పచ్చడి చేయడం రాని యువతులు
ఉగాది పరమార్థం తెలియని యువకులు
ఉగాది ఉత్సాహం ఉరకలెత్తదు
కొత్త బట్టల కోలాహలం కానరాదు
విజ్ఞానం వేస్తున్న వెర్రితలలు
సంస్కృతీ సాంప్రదాయాలను
విస్మరిస్తున్న కుర్రతరం
ఎపుడు డబ్బులుంటే అపుడే పండుగనే నిర్లిప్తత
పండగ నాడైనా పదిమంది కలిసి
నవ్వులు పంచుకునే రోజులు పోయాయ్
అనురాగం ఆప్యాయతలకు
పచ్చనోట్లు ప్రామాణికంగా మారిన తరుణంలో
‘హలో డాడీ హేపీ ఉగాది’ అనే
రూపాయి ఫోన్ కాల్‌తో
ఉగాది వస్తుంది వెళ్తోంది
-హైమవతి సత్య
వేల్పూరు, తణుకు

శిక్ష
చూపులు కలుపుకొని
చెట్టా పట్టాలు వేసుకొని
పార్కుల వెంట తిరిగావు
క్షణ కాలంలో
తనువు అర్పించావు
ఆనందకరమైన అందమైన
ఊహల్లో విహరించావు
పార్కుల వెంట తిప్పినవాడు
పారిపోయాడు
వాడి రూపాన్ని నీ కడుపున
ఉంచి
వాడిని మరిచావు
నన్ను వికసించకుండా
‘అబార్షన్’ అనే శిక్ష వేసి
నశింప జేశావు
ప్రేమ ముసుగులో మీకు (నీకు)
తెలిసిన ప్రేమ ఇదేనా...?
(నీవు) మీరు చేసిన తప్పుకు
నాకు ‘శిక్ష’ వేస్తావా (రా)...?
- చింతా రాంబాబు
కాట్రేనికోన, చరవాణి: 9948178092

చట్టం తన పని తాను...
అవును
అందుకే
కారంచేడు, చుండూరు హతులు
స్వర్గంలో
ఆనంద తాండవం చేస్తున్నారు
అపరాధులకు శిక్ష పడినందుకు
అయేషా, రిషితేశ్వరుల
ఆత్మలు శాంతించి, వాళ్లు
మళ్లీ మళ్లీ ఆడపిల్లలుగానే
పుట్టాలనుకొంటున్నారు
ఆమె అందరికీ అమ్మైనా
ఆతడెందరికో అన్నైనా
తప్పు చేస్తే
నాకతీతులు కారంటుంది చట్టం
ఆయన గొప్ప సినీ హీరో అయినా
బడా రాజకీయ నేతకు
ముద్దుల బిడ్డే అయినా
మర్డర్ చేసి కార్పొరేట్ హాస్పిటల్లో చేరితే
ముకుతాడు వేసి లాక్కొస్తానంటుంది చట్టం
చట్టం తాను అచ్చమైన న్యాయదేవతకు
ప్రతిరూపం కావాలని, తెగ
తహతహలాడిపోతోంది
కాని అలాకాలేకపోతున్నందుకు
అనుక్షణం విలవిలలాడిపోతోంది కూడ
న్యాయం గెలవాలంటే
చట్టానికి సాక్ష్యాలు కావాలి
అంతేకాదు
అవి అమ్ముడు పోకుండా
కడకంటా నిలబడాలి
పోలీసులు సరైన సెక్షన్లను
బనాయించాలి
ఇక మేధావులైన న్యాయవాదులంతా
దుష్టుల్ని, హంతకుల్ని, రేపిస్టుల్ని
రక్షించే ప్రయత్నం మానుకొని
నిజంగానే న్యాయవాదులు కావాలి
ఇక న్యాయమూర్తులంతా
మూర్త్భీవించిన న్యాయ స్వరూపులు కావాలి
మరీ ముఖ్యంగా నేతల తీరు మారాలి
నేరగాళ్లకిచ్చే భరోసాను
ఉపసంహరించుకోవాలి
అప్పుడు చట్టం
తన పని తాను అవలీలగా
చేసుకొని పోతుంది
ఇవేవీ సహకరించకపోతే
చట్టం ఎంత గట్టిదైనా, ఎంత గొప్పదైనా
ఈ ఇసుక మాఫియా చోరులు
ఈ కల్తీ సారా వీరులు
ఈ కాల్‌మనీ ధీరులు
కాలరెగరేసి, ఎంచక్కా
రేపు మరో అవతారమెత్తుతారు

- డాక్టర్ జోశ్యుల కృష్ణబాబు, పెద్దాపురం, సెల్: 9866454340

స్నేహమంటే...
రెండక్షరాల పదం... వ్యక్తుల జీవితాల మధ్య ఉండే బంధం
ఒక కమ్మని కావ్యం... ఒక తియ్యని భావం
మనకు అందరూ ఉన్నా మన సంగతులు పంచుకొనుటకు
ఆ దేవుడు అందించిన ఒక తీరిపోని, ఒక గొప్పవరం
ఎక్కడో పుడతారు... ఎక్కడో పెరుగుతారు...
ఎక్కడో ఉంటారు... ఎప్పుడో కలుస్తారు.... కానీ...
కలిసిన క్షణం నుంచి ఒకరికొకరు... ఒకరికై ఒకరు
మరపురానిది... మరువలేనిది.... మధురమైనది
విడిపోనిది... విరిగిపోనిది... విడదీయరానిది
కరిగిపోనిది ... కలైపోనిది... కలవరము లేనిది
విలువైనది ... కొనలేనిది .... కొలవలేనిది
చెరిగిపోనిది... చిక్కులు లేనిది... చక్కనైనది... స్నేహం
రహస్యాలు లేనిది ... అపహాస్యం కానిది .... దరహాసమైనది ....
రక్త సంబంధం కంటే విలువైనది
కష్ట నష్టాలలో ... సుఖ దుఃఖాలలో ... ఆనంద విచారాలలో కలిసి ఉండేది
ధనిక, పేద ... కుల, మత, భేదం లేనిది...
స్నేహంలో అనేది ... ఒకటే అని అర్థం...
ఉండకూడదు ఎపుడూ ... అది అపార్థం...
ఉంటే వస్తుంది .... అనర్థం
ఇది తెలుసుకుంటే జీవితం పరమార్థం ...
స్నేహంలేని జీవితం పూర్తిగా వ్యర్థం...
తగాదాలు, వాదోపవాదాలు ఇవన్నీ స్నేహంలో భాగమే
కానీ వాటిని సర్దుబాటు చేసి సవ్యంగా దిద్దుబాటు చేసుకోవడమే నిజమైన స్నేహం!
‘మరణం వరకూ మనలోనే ఉండే బంధం...
మరణం తర్వాత కూడా మనగలిగే బంధం.... స్నేహం’
కొవ్వొత్తి తన గుండెల్లో దారం కాలిపోతూ ఉంటే ... తన స్నేహితుని బాధను చూడలేక తను కన్నీళ్లను కారుస్తూ కరిగిపోతుంది... ఇదీ నిజమైన స్నేహం
స్నేహితుడు చెట్టులాంటి వాడు ... తను ఎండలో నిల్చున్నా తన స్నేహితులకు నీడనిస్తాడు
విజయం సాధించినపుడు చప్పట్లు కొట్టి, పొగిడే వారు చాలా మంది ఉంటారు. వారిలో నీ స్నేహితుడూ ఉంటాడు... కానీ ఓటమి సందర్భంలోను నీ వెన్నుతట్టి ఓదార్చి ప్రోత్సహించేవాడే స్నేహితుడు
ఎంత మనకు అందరూ ఉన్నా మనకంటూ మన ప్రతి సంగతిని, అనుభూతిని, కష్టాన్ని పంచుకుని వాటిని ఫీల్ అయ్యేవాడే ..ఫ్రెండ్
ప్రతి చిన్న అల వెనుక ఒక పెద్ద సముద్రం ఉన్నట్టే...
ప్రతి వ్యక్తి వెనుక ఒక మంచి స్నేహితుడు ఉంటాడు
నిరంతరం వెలుగునిచ్చే సూర్యుడు లాండిది స్నేహం...
పున్నమి రోజున చల్లని వెనె్నల స్నేహం...
వసంత కాలాన కమ్మని కోయిల గానం స్నేహం...
జీవితంలో డబ్బులేని వాడు కాదు పేదవాడు ...
నిజమైన స్నేహితుడు లేనివాడు పేదవాడు
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం
స్నేహానికి లేదు అంతం .. అది అనంతం
‘నిజమైన స్నేహితులు చాలా అరుదుగా లభిస్తారు... వారిని జాగ్రత్తగా చూసుకోవాలి’
జీవితంలో ఒక మంచి స్నేహితుడిని కోల్పోవడమంటే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే....

- ఎస్‌కెఎస్‌ఎస్ ప్రియదర్శిని

--

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
email: merupurjy@andhrabhoomi.net