విశాఖపట్నం

రమణీయ దివ్యశతకం నందనందనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నన్నయ నుండి నేటి ఆధునిక కవితా యుగం వరకు అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న ప్రక్రియ శతకం. సంస్కృత, ప్రాకృత వాజ్మయం శతక ప్రక్రియకు తెలుగు శతక ప్రక్రియ ప్రతిబింబమే. అయితే తెలుగులో ఈ ప్రక్రియ ఎంతో విశిష్టతను సంతరించుకుని ముందుకు దూసుకుపోతోంది. తాజాగా విడుదలైన నందనందనంలో రచయిత తనకు ప్రీతిపాత్రమైన శ్రీకృష్ణ లీలలను ప్రధానాంశంగా చేసుకున్నారు. రసగుళికల వంటి 126 పద్యాలను సరళమైన శైలిలో రాసి అందించారు. గోపికా బృంద రమణ అనే మకుటాన్ని ఉపయోగించి రాశారు. కవి పద్యాన్ని హృద్యంగా తీర్చిదిద్దారు. శ్రీకృష్ణుని బాల్యం నుండి మధురానగర నివాసం వరకు గల సన్నివేశాలను కళ్లకు కట్టినట్లు రాసిన తీరు పాఠకులను రంజింపజేస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు.
‘్ధర్మసంస్థాపనార్థమై ధరణియందు/ ఉద్భవించెద మీకని యూరడించి/దేవకీ వసుదేవల కీవు బుట్టి/నందనందనుడైతె ఆనంద రమణ’ అంటూ శ్రీకృష్ణుడిని తొలి పద్యంలో కీర్తించారు. ‘పద్మదళనేత్ర! నీయట్టి పట్టు గలిగి/ పావనుండైన ఆ వసుదేవునకును/పట్టవలసెనె గాడిద పాదములను/నందనందన! గోపికా బృందరమణ’’ పద్మదళాల వంటి కన్నులు కలిగిన నీవు వసుదేవునికి కుమారుడవై పుట్టినప్పటికీ అతడు చివరకు గాడిద కాళ్లను పట్టుకోవలసి వచ్చిందంటూ నర్మగర్భంగా రాశారు. ‘తల్లిపాలను నీకింత తనివి లేక/యేడ్చుచున్నా వటంచు నినె్నతికొనగ/క్రాలు, పూతన నిండు ప్రాణాలు గొండె/నందనందన! గోపికా బృందరమణ’’ అని ఈ దృశ్యాన్ని కనులకు కట్టినట్లు రాశారు. కృష్ణుడు మట్టిని తిన్నప్పుడు తల్లి అదిలించి నోరు తెరవమని పేర్కొనగా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. ఈ ఉదంతాన్ని చిన్నచిన్న పాదాలతో రచయిత వివరించిన తీరు ఆకట్టుకుంటుంది. అలాగే శ్రీకృష్ణుడు వేణువును మోగించినప్పుడు దిశలన్నీ మార్మోగినట్టు, గోపికల మానసమ్ములపై సైతం మోగినట్టు రచయిత అద్భుతంగా వర్ణించారు. శ్రీకృష్ణుని పిల్లనగ్రోవి పాటకు పశువులు, పక్షులు, పాములు, చెట్లు కదలక మెదలక వింటూ తన్మయత్వం పొందినట్లు వర్ణించిన తీరు మనసును దోచుకుంటుంది. విశేషం ఏమిటంటే రచయిత గెడ్డాపు అప్పలస్వామి నిర్యాణం చెందిన చాలా సంవత్సరాలు గడిచాక, ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఆయన కుటుంబ సభ్యులు రాజాం పట్టణంలో ఆవిష్కరింపజేశారు. ఈ పుస్తకాన్ని చదవాలనుకునే వారు రాజాం రచయితల వేదిక (రారవే) అధ్యక్షుడు గార రంగనాథం సెల్ : 9885758123లో సంప్రదించాలి.

- వాండ్రంగి కొండలరావు, పొందూరు-532168.
శ్రీకాకుళం జిల్లా. సెల్ : 0490528730.

బౌద్ధాన్ని కళ్లకు కట్టే
‘మంచి ప్రశ్న... మంచి జవాబు’

కవిత్వంలో ప్రధాన పాత్ర పోషించేది శైలి. రచనా సంవిధానాన్ని బట్టి ఆ కవి ప్రతిభను ఊహించవచ్చు. రచయిత తన శైలికి ఎలాంటి ప్రాధాన్యమిస్తాడో తన రచనలో దిశా నిర్దేశం చేసిన నల్లి ధర్మారావు తన దృక్పథాన్ని ‘మంచి ప్రశ్న... మంచి జవాబు’ అనే అనువాద రచన ద్వారా తెలియజేశారు. ధర్మారావు అనువాదకుడు, కవి, రచయిత, విశే్లషకుడు. రచన చిన్నదైనా ఉన్నంతలో సిద్ధార్థుడు బుద్ధుడిగా మారే వరకు పొందిన క్రమ పరిణామ వికాసాన్ని చర్చించారు. జీసస్ నుండి బుద్ధుని వరకు తెలిపారు. సంక్షిప్తంగా గౌతమ బుద్ధుడిగా ఎలా మారాడో తెలియజేశారు. బౌద్ధ్భిక్షువుగా మారిన ‘శ్రావస్తి ధమ్మిక’ రచించిన ‘గుడ్ క్వశ్చన్... గుడ్ ఆన్సర్’ అనే పుస్తకాన్ని బండారు ఉత్తమ బుద్ధిస్టు సొసైటీ, ఇంగ్లండ్‌లో ప్రచురణ జరిగి సంచలనం సృష్టించింది. దీనిని 12 భాషల్లో అనువాదాలు చేశారు. ఒక బౌద్ధ ప్రార్థనా మందిరం (స్థలం)లో ఉచితంగా పంపిణీ చేయగా దాన్ని తెలుగులో అనువాదం చేయాలనే ఉద్దేశ్యంతో బౌద్ధ మతాన్ని గౌరవించే రచయితగా నల్లి ధర్మారావు ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. విదేశాలకు చెందిన క్రైస్తవమతం, కమ్యూనిజాలను కూడా బౌద్ధం ప్రభావితం చేయడం విశేషమని రచయిత నల్లి ధర్మారావు అంటారు. ఈ రచన శంకరంబాడి సుందరాచారి రచించిన ‘బుద్ధగీతి’ అనే ఖండకావ్యాన్ని గుర్తుకు తెస్తుంది. ఈ గ్రంథంలో నల్లి ధర్మారావు బౌద్ధం ఎలా విస్తరించింది అనే విషయాన్ని కాకుండా అత్యున్నత తత్వశాస్త్రంగా తెలిపారు. ఆయన బోధనలు ఎన్నో లక్షల మంది జీవితాల్లో పరివర్తన తెచ్చి మార్చగలిగిందని తెలిపారు. మతపరమైన అసహనం, గర్వం, స్వార్ధం అనే అంశాలపై కచ్చితంగా అధ్యయనం చేయాలని, బౌద్ధంలోని నాలుగు ప్రధాన సూత్రాలు, నాలుగు సత్యాల ద్వారా కచ్చితమైన శాస్ర్తియ విధానాన్ని రచయిత నల్లి ధర్మారావు తెలిపారు. ఈ గ్రంథంలో వర్ణనలు, సన్నివేశాలు సందర్భోచితంగా కనిపిస్తాయి. సిద్ధార్థుడి తపస్సు వర్ణన, అతని బోధనలు, నుడికారాలు, భావుకత, సరళశైలి అలంకారాలు ఈ చిన్న కావ్యాన్ని అద్భుత గ్రంథంగా మలిచాయి. ఈ కావ్యం తేటగీతి పద్యాలతో రూపుదిద్దుకుని బుద్ధుడి జననం నుండి జ్ఞానోదయం వరకు ఉన్న అన్ని అంశాలతో అలరిస్తుంది. అలాగే ఏ తరహాలో బుద్ధుని ఆరాధనం చేయాలో, ఎక్కడెక్కడ బౌద్ధమతస్తులు ఎక్కువగా ఉన్నారో ఈ గ్రంథంలో మనకు తెలుస్తుంది. అలాగే ప్రతి మనిషిలో తలెత్తే అనేక ప్రశ్నలకు సమాధానంగా కూడా ఈ పుస్తకం మనకు కనిపిస్తుంది. పునర్జన్మలో లక్ష్యాలను కూడా సాధించవచ్చునని అభివర్ణించడం జరిగింది. బుద్ధుడి బోధనల్లో ఇదొక అద్భుతమైనదని తెలిపారు. ఒక భాషకు చెందిన భావం, సాహిత్యం మరే ఇతర భాషలతో సంబంధం లేకుండా మనజాలదు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిగా భావించిన గాంధీ మహాత్ముడికీ బుద్ధుడే ఆదర్శప్రాయుడయ్యాడు. గౌతమబుద్ధుడు ప్రజలకు హితబోధ చేస్తూ ప్రేమతత్వాన్ని విశ్వవ్యాప్తం చేయాలని తెలుపుతూ అసింహ పరమధర్మమని చాటి చెప్పాడు. ప్రజలు మంత్రముగ్ధులై అతన్ని అనుసరించారు. ప్రజల కష్టసుఖాలు అడిగి తెలుసుకుని, వారి బాధలను ఆయన పోగొట్టడం వల్ల వారు అతన్ని దేవుడిగా భావించారు. ఈ విషయాలను ఉటంకిస్తూ ఈ రచన సాగింది. ఆనాటి ప్రజలు బుద్ధుడిని ఎలా అనుసరించారు. ఆయన బోధనలను ఎలా విన్నారని తెలియజేస్తూ సరళమైన భాషలో, ఆకట్టుకున్న శైలిలో ఈ గ్రంధాన్ని రచయిత రాశారు.
- శృంగారం ప్రసాద్, న్యూకాలనీ, శ్రీకాకుళం. సెల్ : 9985828323.