విశాఖపట్నం

పరిచయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కడ కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి. అక్కడ బాధలు భీతిల్లుతున్నాయి. ప్రతి మనిషికీ ఇది నా ఊరు అనేది ఉంటుంది కానీ నాకు లేదు. ఇదే నా బెంగ. ఉండడానికి నాకంటూ ఊరు ఉన్నా అక్కడ నాకంటూ బంధువులు లేరు. అక్కడ నాకంటూ ఉన్న రాళ్లు రప్పలు ఎవరో ఆక్రమించుకుంటున్నారు. వాటి గురించి పోరాడాలనే ఆశయం, ఆశ నాకు లేవు. అయినా పండక్కి అందరూ తమ సొంత ఊరు వెళుతున్నారు. నేను వెళ్లడానికి ఏ ఊరూ లేదు. అనేక సంబరాలు... ఎన్నో సంక్రాంతులు అలాగే వెళ్లిపోయాయి వౌనంగా!
ఓరోజు రైలు ప్రయాణంలో పరిచయం... పరంధామయ్యగారు చాలా మంచివారు. వారి కుటుంబంతో కూడా నాకు అనుబంధం ఏర్పడింది. మా కులం కాదు. మా ఊరు కాదు. మా ఇద్దరి మధ్య అనుబంధం ఒక్కటే కేవలం ఆయనా మనిషే, నేనూ మనిషే. ఒక పండక్కి వాళ్ల ఊరు రమ్మన్నారు. అది మా ఊరికి చాలా దూరం. ఈ రాష్ట్రం కూడా కాదు. అసలే ఒంటరితనంతో నరకయాతన పడుతున్న నేను ఆ ఊరు వెళ్లాను. అరిసెలు పెట్టారు. అరకోడి, గారెలు తినిపించారు. నాతో ఏ సంబంధం లేకపోయినా అనుబంధాలు, ఆప్యాయతలు చూపించారు. ఆ క్షణం వారి కుటుంబం అంతా నాదే అనిపించింది. ఆ పండగ రోజులు ఎంతో ఆనందంగా గడిచాయి. అక్కడ అమ్మ, అక్క, పిన్ని, చెల్లి అందరి అనుబంధాలు ఇంతగా ఉంటాయా అనిపించింది. సమయం అస్సలు తెలియలేదు. అసలు ఏ కోశానా కూడా వారు నన్ను పరాయి మనిషిగా చూడలేదు.
సాయంత్రం 7 గంటలకే అందరం సరదాగా భోజనం చేసేవాళ్లం. పెరుగు, కూర కొసరి కొసరి వడ్డించేవారు. మిఠాయిలు కూడా. సినిమాలకి వెళ్లాం. దేవాలయాలకి వెళ్లాం. నాకు కొత్తబట్టలు తీసారు. కొత్తగా కాదు తమ పాత అనుబందంగా చూసుకున్నారు. చిన్నతనంలోనే సకల అనుబంధాలకి దూరమైన నాకు ఇదంతా స్వర్గంలా అనిపించింది. ఇదంతా నా కుటుంబం అనిపించింది. సడన్‌గా ఓరోజు పరంధామయ్యగారు మరణించారు. అప్పటి వరకు అనుబంధాలను అడ్డం పెట్టుకుని నటించే వారందరూ తప్పుకున్నారు. నాకైతే నా అంతరాత్మ ఏమాత్రం ఒప్పుకోలేదు. అనుబంధాలను పంచిన ఆ కుటుంబం హఠాత్తుగా అనాథగా ఉండిపోవడం సహించలేకపోయాను.
ఆ కుటుంబంతో రక్తసంబంధం లేకపోయినా సరే అది వీధిన పడకూండా ఉండడం కోసం ఆ గొప్ప సంస్కార వారసత్వానికి అండగా నిలిచాను. నాటి నుండి అన్నీ నేనే అయ్యాను.

- కోనే సతీష్, గాజులవీధి, శ్రీకాకుళం-532001. సెల్ : 7675924944.