విశాఖపట్నం

స్నేహబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలంలో మాదొక చిన్న పల్లెటూరు. ఇది ఒక మారుమూల గ్రామం. సరైన కాలంలో వర్షాలు పడకపోవడం వల్ల కరవు కాటకాలు వచ్చాయి. ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నారు. సాగు చేయడానికి పొలం ఉన్నా నీరు లేకపోవడంతో భూములు ఎండిపోయాయి. తాగడానికి నీరు లేక ప్రజలందరూ విలవిల్లాడిపోతున్నారు.
అలాంటి పేద కుటుంబంలో జన్మించింది రాణి. ఆమె తల్లిదండ్రులకి ఒక్కగానొక్క కూతురు రాణి. ఆమెకు చదువు పట్ల ఆసక్తి ఎక్కువ. గ్రామ ప్రజల సమస్యలను చూసి వాటిని ఎలాగైనా పరిష్కరించాలని అనుకునేది. అందుకు ఐ ఎ ఎస్ చదువు కోసం పట్టాణానికి వెళ్లింది.
అలాగే మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది కుమారి. ఆమె పుట్టిన తరువాత తల్లి మరణించింది. దీంతో తండ్రి రెండవ వివాహం చేసుకున్నాడు. పినతల్లి కుమారిని ఎన్నో బాధలు పెట్టింది. తిండి పెట్టకుండా కడుపు మాడ్చేది. తండ్రి కూడా లెక్క చేయకపోవడంతో ఏం చేయాలో తెలియక ఇంట్లో నుండి వెళ్లిపోయింది. కుమారికి కూడా చదువంటే ఇష్టం. తను కూడా ఐ ఎ ఎస్ అవ్వాలనే లక్ష్యంతో పట్టణం చేరుకుంది. రాణి, కుమారిలు అప్పటికే మంచి స్నేహితులు.
వాళ్లిద్దరూ నాకు కూడా మంచి స్నేహితులే.
ఒకానొక సమయంలో రాణి, కుమారి ఇద్దరూ కలిసారు. ఇద్దరిదీ ఒకే లక్ష్యం కావడంతో మరింత దగ్గరయ్యారు.
చిన్నప్పటి నుండి నేను, రాణి, కుమారి మంచి స్నేహితులం. కలసి చదివేవాళ్లం, కలసి ఆడుకునేవాళ్లం, కలసి తినేవాళ్లం. కానీ కరవు రావడంతో మా స్నేహం చెల్లాచెదరు అయిపోయింది. నేను ఆ గ్రామ అధికారి కూతుర్ని. అందుకే తండ్రి మాట మీద ఉండిపోయాను. నా స్నేహితురాళ్లయిన రాణి, కుమారిలను వదులుకున్నాను.
కుమారి, రాణి పట్టణంలో వారి చదువుకు కావలసిన డబ్బును వారే సమకూర్చుకునే వారు. ఒక పూట పని చేసి, ఒక పూట చదువుతూ వారు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అలా ఐ ఎ ఎస్ అవ్వాలనే వారి ఆశయాన్ని దృఢంగా బలపరచుకున్నారు.
అలా వారు చదువును కొనసాగిస్తుండగా శరత్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని, నువ్వు లేకపోతే చచ్చిపోతానని ప్రతిరోజూ రాణిని వేధించడం మొదలుపెట్టాడు. కానీ ఆమె ఇదేమీ పట్టించుకోకుండా తన ఆశయాన్ని దృష్టిలో పెట్టుకుని చదువు కొనసాగించింది. ఆమె తనని నిర్లక్ష్యం చేయడంతో ఒకరోజు శరత్ ఉక్రోషం పట్టలేక తన వాహనంతో ఆమెని ఢీకొట్టాడు. రాణి తలకి బలమైన గాయం అయింది. చావు బతుకుల్లో రాణి తన స్నేహితురాలైన కుమారితో ‘నా లక్ష్యాన్ని నువ్వు నెరవేర్చాల’ని చెప్పి మరణించింది.
అయితే ఈ వార్తని కుమారి రాణి తల్లిదండ్రులకి, గ్రామస్తులకి చెప్పలేదు. వారెక్కడ ఇది విని తల్లడిల్లిపోతారోనని దాచింది. తన గురించి ఏమాత్రం పట్టించుకోని తల్లిదండ్రులు తన గురించి ఎలాగూ ఆలోచించరని, తనకేమైనా పట్టించుకోరని తెలిసిన కుమారి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన ముఖాన్ని రాణిలా మార్చుకుంది. కావాలనే తన తల్లిదండ్రులకు తాను మరణించినట్లు వార్త చేరవేసింది.
అది విని వారు ‘పీడ విరగడైపోయింది’ అనుకున్నారు.
కొద్ది రోజుల తర్వాత రాణిలా మారిన కుమారి ఐ ఎ ఎస్ పూర్తి చేసి తన గ్రామానికి వెళ్లింది. రాణి తల్లిదండ్రులు, ఆ గ్రామ ప్రజలు తమ కష్టాలు తీర్చడానికి వచ్చిన దేవతలా ఆమెని ఆహ్వానించారు. రాణి తల్లిదండ్రులు కుమారే తమ కుమార్తె రాణి అనుకుని ఎంతో మురిసిపోయారు.
ఆమె హయాంలో వ్యవసాయం అభివృద్ధి చెందింది. సౌకర్యాలు మెరుగయ్యాయి. పాఠశాలలు, వైద్యశాలలు వచ్చాయి. ప్రజలంతా ఏది కోరుకుంటే అది వారికి అందుబాటులోకి వచ్చింది.
అలా కొన్నాళ్లు గడిచాక కలెక్టర్ రాణిగా చెలామణీ అవుతున్నది కుమారి అని గ్రామస్తులకి తెలిసిపోయింది. ప్రజల కోసం ముఖ్యంగా స్నేహితురాలు రాణి కోసం అలా చేసానని ఆమె చెప్పడంతో వారి స్నేహం గురించి అంతా తెలుసుకుంటారు. రాణి తల్లిదండ్రులు రాణి మరణించినప్పటికీ కుమారిలోనే తమ కూతుర్ని చూసుకోవడం మొదలుపెట్టారు.
ఆమె వ్యక్తిత్వం, ప్రజల కోసం పాటు పడే తత్వాన్ని చూసిన కుమారి తల్లిదండ్రులు ఆమె మంచితనానికి సిగ్గుతో తల దించుకున్నారు. గతంలోని తమ ప్రవర్తనకు క్షమించమని ప్రాదేయపడ్డారు.
దానికి కుమారి బదులిస్తూ ‘‘మీరు నన్ను కూతురిలా చూడకపోయినా మీరెప్పుడూ నా తల్లిదండ్రులే’’ అని చెప్పి వారిని అక్కున చేర్చుకుంది.
అటు రాణి కుటుంబాన్ని, తన కుటుంబాన్ని కూడా ఆప్యాయంగా చూసుకోసాగింది.
తల్లిదండ్రుల మాట జవదాటకూడదని చదువుకు, స్నేహితురాళ్లకు దూరమైన నేను నా స్నేహితురాలు కుమారి ఘనకార్యాలు చూసి ఇప్పుడు మురిసిపోతున్నాను. కోటి రూపాయలతో కొనలేనిది స్నేహాన్ని మాత్రమే అని గుర్తించాను.

- మురమళ్ల శాంతికుమారి