క్రీడాభూమి

500 మ్యాచ్‌ల మెస్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్, డిసెంబర్ 31: అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ బార్సిలోనా తరఫున 500వ మ్యాచ్ ఆడిన క్రీడాకారుడిగా అరుదైన గుర్తింపు సంపాదించాడు. లా లిగాలో భాగంగా రియల్ బెటిస్‌తో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా 4-0 తేడాతో విజయభేరి మోగించగా మెస్సీ ఒక గోల్ చేశాడు. సౌరెజ్ రెండు గోల్స్‌తో రాణించాడు. మ్యాచ్ 29వ నిమిషంలో బెటిస్ ఆటగాడు వెస్టర్మన్ ఓన్ గోల్ చేయడంతో బార్సిలోనా గోల్స్ ఖాతా ఆరంభమైంది. 33వ నిమిషంలో మెస్సీ చక్కటి ఫీల్డ్ గోల్ చేశాడు. సౌరెజ్ 46, 83 నిమిషాల్లో గోల్స్‌ను నమోదు చేశాడు. బెటిస్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత మెస్సీ మాట్లాడుతూ బార్సిలోనా తరఫున 500 మ్యాచ్‌ల మైలురాయిని చేరినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు. ఈ ఏడాది ఐదు టైటిళ్లు కైవసం చేసుకున్నామని, వచ్చే ఏడాది కూడా ఇదే తరహాలో రాణించి మరిన్ని విజయాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
లా లిగాలో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో రియల్ మాడ్రిడ్ 3-1 తేడాతో రియల్ సోసియాడెడ్‌ను ఓడించింది. క్రిస్టియానాలో రొనాల్డో 42, 67 నిమిషాల్లో గోల్స్ చేయగా, బ్రుమా 49వ నిమిషంలో గోల్ చేశాడు. రియల్ సోసియాడెడ్ తరఫున లుకాస్ 86వ నిమిషంలో ఓ కంటితుడుపు గోల్‌ను నమోదు చేశాడు. డియో వలెకాషియోపై అట్లెటికో మాడ్రిడ్ 2-0, ఎస్పానియల్‌పై సెవిల్లా 2-0, స్పోర్టింగ్ గిజాన్‌పై ఎబార్ 2-0, సెల్టా విగోపై అట్లెటికో బిల్బావో, గ్రనడాపై లాస్ పల్మాస్ 4-1 గోల్స్ తేడాతో విజయాలను నమోదు చేశాయి. గెటాఫ్, డెపోర్టివో లా కోరునా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. (చిత్రం) బార్సిలోనా తరఫున 500 మ్యాచ్‌లు పూర్తి చేసిన లియోనెల్ మెస్సీ. ఈ క్యాలెండర్ ఇయర్‌లో 180 గోల్స్ చేసిన బార్సిలోనా లా లిగా టోర్నీలో కొత్త రికార్డును సృష్టించింది. గతంలో రియల్ మాడ్రిడ్ పేరిట ఉన్న రికార్డును బార్సిలోనా అధిగమించింది. వీటిలో మెస్సీ, సౌరెజ్ చెరి 48 గోల్స్ చేయగా, నేమార్ 41 గోల్స్ సాధించాడు.