ఆటాపోటీ

మేవెదర్ ప్రపంచ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అజేయుడిగా కెరీర్ నుంచి వైదొలగిన ఫ్లోయిడ్ మేవెదర్ ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రపంచ యాత్ర చేస్తున్నాడు. వివిధ దేశాలను తిరుగుతూ, అక్కడి చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తూ ఆనందిస్తున్నాడు. వ్యక్తిగత సహాయకురాలు కిచీతో కలిసి ఇటీవలే రోమ్‌ను సందర్శించిన అతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)కి చేరుకున్నాడు. అక్కడ అరబ్ షేక్ దుస్తులు వేసుకొని, వారిలో ఒకడిగా కలిసిపోయాడు. ఇటీవలే అండ్రి బెర్టోతో తన కెరీర్‌లో చివరి ఫైట్‌లో పాల్గొన్న అతను విజయభేరి మోగించాడు. వెల్టర్‌వెయిట్ విభాగంలో డబ్ల్యుబిఎ, డబ్ల్యుసిబి సంయుక్త ప్రపంచ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. కెరీర్‌లో 49వ ఫైట్స్‌లో పాల్గొన్న అతను ఒక్క పరాజయాన్ని కూడా చవిచూడకపోవడం విశేషం. మాజీ హెవీవెయిట్ బాక్సింగ్ చాంపియన్ రాకీ మార్సియానో కూడా 49 ఫైట్స్‌లో ఒక్క ఓటమిని కూడా చవిచూడలేదు.
అతని సరసన మేవెదర్‌కు స్థానం లభించింది. అంతకు ముందు నిర్ణయించుకున్నట్టుగానే ఆ ఫైట్‌తో తన కెరీర్‌ను ముగించాడు. 48వ ఫైట్‌లో ఫిలిప్పీన్స్ బాక్సర్ మానీ పాక్వియానోను ఎదుర్కొన్న మేవెదర్ సునాయాసంగా గెలిచాడు. అయితే, ప్రపంచ మేటి బాక్సర్లలో ఒకడిగా పేరొందిన పాక్వియానో ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఓటమిపాలు కావడంపై ప్రపంచ వ్యాప్తంగా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఫైట్ ఫిక్సింగ్‌కు గురైందన్న ఆరోపణలు కూడా వినిపించాయి. అజేయుడిగా తనకు ఉన్న రికార్డును కాపాడుకోవడానికి మేవెదర్ ఏదో ఒక రకంగా పాక్వియానోతో ఒప్పందం కుదుర్చుకొని ఉంటాడన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఈ ఆరోపణలు తప్పని నిరూపించుకోవడానికైనా పాక్వియానోతో మేవెదర్ మరోసారి తలపడతాడన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, అతను తన చివరి ఫైట్ కోసం బెర్టోను ఎంపిక చేసుకోవడం మరోసారి వివాదానికి తెరతీసింది. అంతకు ముందు 34 ఫైట్స్‌లో పాల్గొని 30 విజయాలు సాధించినప్పటికీ బెర్టో ఏ విధంగానూ మేవెదర్‌కు సమవుజ్జీ కాదన్న విమర్శలు వచ్చాయి. కానీ, వాటిని పట్టించుకోకుండా బెర్టోతో మేవెదర్ ఫైట్ చేశాడు. ముందుగా ఊహించిన విధంగానే విజయభేరి మోగించి, ఒక్క పరాజయం కూడా లేని బాక్సర్‌గా చరిత్ర సృష్టించాడు. కెరీర్ చివరిలో ఇన్ని వివాదాల్లో చిక్కుకొని, పలు అనుమానాల నడుమ రిటైర్మెంట్ ప్రకటించిన మేవెదర్ ఇప్పుడు స్వేచ్ఛగా విహారాలు చేస్తున్నాడు. కెరీర్‌తో ఎంత సంతృప్తినిచ్చిందో ప్రపంచ పర్యటన కూడా అంతే ఆనందాన్ని కలిగిస్తున్నదని మెవెదర్ అంటున్నాడు.
మొత్తం మీద అతను సోషల్ నెట్‌వర్క్‌లో ఉంచిన అరబ్ వేషంలోని ఫొటోలతో అతను మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు.