తెలంగాణ

వికటించిన మధ్యాహ్న భోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

60మంది విద్యార్థులకు అస్వస్థత

గాంధారి, మార్చి 11: నిజామా బాద్ జిల్లా గాంధారి మండలం నేరల్ తాండాలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం మధ్యాహ్న భోజనం తిన్న దాదాపు 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలకు 237 మంది విద్యార్థులు హాజరైనట్లు ఎంఈఓ సేవ్లానాయక్ తెలిపారు. వీరందరికీ రోజూ మాదిరిగానే మధ్యాహ్న భోజనం నిర్వాహకురాలు కలీబాయి అన్నం, పప్పును వండిపెట్టింది. ఈ క్రమంలో మధ్యాహ్నం వేళలో అన్నం తిన్న గంట తర్వాత విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. గమనించిన పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు విషయం అడిగి తెలుసుకున్నారు. వాంతులతో పాటు కడుపునొప్పి అని కూడా ఏడ్వడంతో విషయం తండాలో దావానంలా వ్యాపించింది. వెంటనే పాఠశాలకు విద్యార్థుల తల్లిదండ్రులు చేరుకోవడంతో పాఠశాలలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గాంధారిలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం రావడంతో వెంటనే నేరల్ తండాకు చేరుకుని వారి పిల్లలను గాంధారికి తరలించారు. మిగిలిన విద్యార్థులను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారి తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ద్విచక్ర వాహనాలపై, మరికొందరిని అటోల్లో గాంధారి మండల కేంద్రంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు, ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 237 మంది విద్యార్థుల్లో 60 మంది వరకు అస్వస్థతకు గురికాగా మిగిలిన వారిని కూడా చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక పరీక్షల అనంతరం చాలావరకు విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లారు.