రాష్ట్రీయం

ఇక మధ్యతరగతి ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరు లక్షలలోపు ఆదాయ వర్గాలకు అర్హత వడ్డీ సబ్సిడీ పథకంపై సర్కార్ కసరత్తు

హైదరాబాద్, డిసెంబర్ 17: మధ్య తరగతికి వరప్రసాదం లాంటి వడ్డీ రాయితీ ఇళ్ల నిర్మాణ పథకాన్ని రాష్ట్రంలో త్వరలోనే చేపట్టనున్నారు. పేదవారికి ఇళ్ల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గృహ నిర్మాణ పథకాలు అమలు చేస్తున్నాయి. సంపన్నులకు ఇబ్బంది లేదు కాబట్టి మధ్యతరగతి పరిస్థితే ఇబ్బందికరంగా ఉండడం గమనించి కొత్త పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ఒక కార్యాచరణ ప్రణాళిక రూపుదిద్దుకుంటుంది. ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు ఇతర ముఖ్యపట్టణాల్లో మధ్యతరగతి వారికి ప్రయోజనం కలిగే విధంగా ఈ పథకం రాష్ట్రంలో అమలు చేయనున్నారు. ఆరులక్షల లోపు సంవత్సరం ఆదాయం ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వమే ఆరులక్షల రూపాయల పరిమితి వరకు వడ్డీ రాయితీ ఇస్తోంది. ఆ వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది. మిగిలిన సొమ్మును లబ్ధిదారులు చెల్లించాలి. వడ్డీ రాయితీ కేంద్రం చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసి హడ్కో వంటి సంస్థల ద్వారా రుణం ఇప్పించి పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఒక ఇంటిని నిర్మించేందుకు 15లక్షల రూపాయల వరకు వ్యయం అయితే ఇందులో ఆరులక్షల రూపాయల మొత్తానికి వడ్డీని కేంద్రం భరిస్తుంది. మిగిలిన తొమ్మిది లక్షల రుణానికి లబ్దిదారుడు చెల్లించాలి. అయితే ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇలాంటి ఇళ్లను నిర్మించాలని భావిస్తున్నందున ప్రైవేటు బిల్డర్లు అమ్మే ఫ్లాట్ల ధరల కన్నా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీతో పాటు ఫ్లాట్ నిర్మాణ వ్యయం తగ్గి,లబ్ధిదారులకు ప్రయోజనం కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎలాంటి రాయితీలు ఇవ్వాలో ఆలోచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకంపై ఇతర రాష్ట్రాలు ఆసక్తి చూపడం లేదు. ఎవరు ముందు దరఖాస్తు చేస్తే వారికే ఎక్కువ మొత్తంలో ఇళ్లను మంజూరు చేసే అవకాశం ఉన్నందున ఎలక్షన్ కోడ్ తొలగిపోయిన తరువాత ఈ పథకాన్ని ప్రకటించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారులు కేంద్రంతో సంప్రదింపులు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా కొంత వరకు వ్యయం భరించడం ద్వారా ఫ్లాట్ ధర అందుబాటులో ఉండేట్టు చేయాలని ఆలోచిస్తున్నారు.
ఎన్నికల తతంగం ముగిసిన తరువాత వివిధ ఉద్యోగ సంఘాలతో ఈ పథకంపై సమావేశం నిర్వహిస్తారు. లబ్ధిదారుల సంఖ్య ఎంత వరకు ఉండవచ్చు, ఎంత మంది ముందుకు వస్తారో అంచనా వేస్తారు. ఈ పథకం పరిధిలోకి ప్రభుత్వ ఉద్యోగులందరూ వస్తారని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో 50వేల లోపు జీతం ఉన్నవాళ్లు పెద్ద సంఖ్యలోనే ఉంటారని, అదే విధంగా న్యాయవాదులు, ఐటి కంపెనీ ఉద్యోగులు, పత్రికా రంగంలో పని చేసే వారు, ఉపాధ్యాయులు, వివిధ రంగాల్లోని ఉద్యోగులకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇతర రాష్ట్రాల నుంచి పోటీ రాకముందే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉపయోగించుకోవాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఆరులక్షల రూపాయల వరకు కేంద్రం వడ్డీ సబ్సిడీగా భరిస్తున్నందున రాష్ట్రం తరుఫున కూడా కొంత భరించాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.
62వేల గృహాలకు ప్రతిపాదనలు
రాష్ట్రానికి 62వేల గృహాలను మంజూరు చేయాలని ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఐదున్నర లక్షల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి లక్షన్నర రూపాయలు మంజూరు చేస్తోంది. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు లక్షా 90వేల గృహాలు మంజూరు చేయగా, తెలంగాణకు పదివేల గృహాలు మాత్రమే మంజూరు చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరో 62వేల గృహాలకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపించింది.