కరీంనగర్

ఘనంగా ‘దీక్ష దివస్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కరీంనగర్ , నవంబర్ 29: టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ‘దీక్ష దివస్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. నగరంలోని తెలంగాణ చౌక్‌లో ఏర్పాటు చేసిన దీక్ష దివస్ శిబిరంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మేయర్ రవీందర్‌సింగ్‌తోపాటు పలువురు నాయకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ తెలంగాణ సాధనలో కెసిఆర్ అనేక పోరాటాలు చేయడం ద్వారానే రాష్ట్రం ఏర్పాటైందన్నారు. కెసిఆర్ దీక్షతోనే కేంద్రంలో చలనం కలిగిందన్నారు. కెసిఆర్ దీక్ష చేపట్టిన రోజు దీక్ష దివస్‌గా ప్రతియేటా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ నాయకులు సునీల్‌రావు, అక్బర్‌హుస్సేన్, గుంజపడుగు హరిప్రసాద్, తిరుపతి, మనోహర్‌రెడ్డి, వేణు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

భూ తగదాలతో..తమ్ముడి గొంతుకోసిన అన్న
మానకొండూర్, నవంబర్ 29: భూ తగదాలో జరుగుతున్న పాత కక్షలను దృష్టిలో పెట్టుకొన్న అన్న తోబుట్టువైన తమ్ముడి గొంతు కోశాడు. ఈ సంఘటన మండల పరిధిలోని దేవంపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ సృజన్‌రెడ్డి తెలిపిన వివారాల ప్రకారం.. మండల పరిధిలోని దేవంపల్లి గ్రామానికి చెందిన పొనుగంటి మధుకర్, పొనుగంటి మహేందర్ అనే ఇద్దరు అన్నదమ్ముల మధ్య గత కొంత కాలంగా భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అన్న మధుకర్ పాత కక్షలను మనసులో పెట్టుకొని ఇంటి వద్ద ఉన్న తమ్ముడు మహేందర్ (21) గొంతు బ్లేడ్‌తో కోశాడు. ఈ సంఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధుకర్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. చిక్సిత నిమిత్తం మహేందర్‌ను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మధుకర్ పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ సృజన్‌రెడ్డి తెలిపారు.

నదుల పరిరక్షణ బాధ్యత అందరిది
* బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు
ధర్మపురి, నవంబర్ 29: భారతీయ ప్రాచీన నాగరికతకు మూలాధారాలైన జీవనదుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వాలతో పాటు ప్రజలకు ఉందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని మురళీధర్‌రావు అన్నారు. ఆదివారం రాత్రి ధర్మపురి క్షేత్ర గోదావరి తీరాన నిర్వహించిన గోదావరి హారతి కార్యక్రమానికి ముందు వేదిక నుండి ఆయన మాట్లాడుతూ ప్రాచీన కాలాలలో రాజులు తటాకాలను, చెరువులను నిర్మించి, నదులను కాపాడితే ఇప్పటి వరకు ప్రభుత్వాలు నదీ తీరాల పరిశుభ్రతపైనా దృష్టి నిలపక పోవడం బాధాకరమన్నారు.
సరస్వతి నది కనుమరుగుతో నదుల మనుగడపై ప్రశ్నార్థకాలు ఉదయిస్తున్నాయని, గోదావరి రానున్న రోజులలో జీవనరేఖగా నిలువాలన్నదే తమ లక్ష్యమన్నారు. గోదావరి మహా హారతి కొత్త పరంపరకు తెర లేపిందని, నదీ తీరాలలోనే నాగరికతలు విలసిల్లిన విషయాన్ని గుర్తుంచు కోవాలన్నారు. హారతిలో సంకల్పం, పవిత్రలు ఉన్నాయని, తద్వారా భవిష్యత్తులో అభివృద్ధి జరగగలదన్నారు. దత్త పీఠాధిపతి స్పూర్తితో ప్రజల భాగస్వామ్యంతో కాలుష్య రహిత గోదావరి పరిరక్షణకు అంకితం కాగలమన్నారు. దండకారణ్యంలో నదీ సంస్కృతి వికాసానికి కృషి సల్పగలమన్నారు. పాట్నా హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ దేవతా స్వరూపమైన నదిని పూజించాలని, భక్తి భావాలను పెంపొందించు కోవాలని కోరారు. త్రిమూర్తుల నిలయమైన ధర్మపురిలో యమ పూజ విశేషమని కీర్తించారు.

వారసత్వ ఉద్యోగాలకు నిరవధిక సమ్మె
* ఐఎన్‌టియుసి నేత వెంకట్రావు
గోదావరిఖని, నవంబర్ 29: సింగరేణిలో గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న వారసత్వ ఉద్యోగాలను మళ్లీ అమలు చేయకుంటే జనవరిలో అన్ని కార్మిక సంఘాలతో కలిసి నిరవధిక సమ్మెలోకి వెళతామని ఐఎన్‌టియుసి నాయకులు, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు అన్నారు. ఆదివారం స్థానిక ఐఎన్‌టియుసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కొనే్నళ్ల క్రితం నిలిపివేసిన వారసత్వ ఉద్యోగాలను అమలు చేయాలని ఇప్పటికే అనేకసార్లు కోరామని అన్నారు. అయినా యాజమాన్యం దాటవేస్తోందని తెలిపారు. వారసత్వ ఉద్యోగాల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి కోరుతామని చెప్పారు. వీటితో పాటు డిస్‌మిస్ కార్మికులను కూడా పనుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికుల గ్రాట్యూటీని 10లక్షల నుండి 20లక్షలకు పెంచాలని కోరారు.
ఢిల్లీలో ఐఎన్‌టియుసి జాతీయ సమావేశం
ఐఎన్‌టియుసి జాతీయ కార్యవర్గ సమావేశం డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో నిర్వహిస్తున్నారని సమావేశాల్లో పాల్గొంటున్నట్లు వెంకట్రావు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవలంబిస్తున్న తీరుకు వ్యతిరేకంగా నిర్ణయాలను తీసుకోవడంతో పాటు 6న ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు. సమావేశాలకు ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొంటున్నారని తెలిపారు. విలేఖరుల సమావేశంలో నాయిని మల్లేష్, పుట్ట రమేష్ తదితరులు పాల్గొన్నారు.

జూన్‌లో చందుర్తికి ఎల్లంపల్లి నీరు
* అభివృద్ధి, ప్రజాసంక్షేమంపై ప్రత్యేక దృష్టి * వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు
చందుర్తి, నవంబర్ 29: మారుమూల గ్రామాల అభివృద్దితో పాటు ప్రజాసంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు అన్నారు. ఆదివారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపిపి తిప్పని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ఎమ్మెల్యే రమేష్‌బాబు మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ముఖ్యంగా తాగునీరు, విద్యా, వైద్యం, తదితర అంశాలపై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తామన్నారు. వచ్చే జూన్‌లో ఎల్లంపల్లి సాగునీరు మండలానికి చేరుతుందన్నారు. ఇందుకు అంతా సహకరించాలన్నారు. మండలాన్ని ప్రభుత్వం కరవు మండలంగా ప్రకటించిందని, దీంతో రైతులకు అన్ని సహాయక చర్యలు చేపడుతామని తెలిపారు. రుద్రంగిలో ప్రభుత్వాస్పత్రి నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు. వేములవాడ నియోజకవర్గంలో ఐదు మండలాలకు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా రూ. 22కోట్లు మంజూరు చేశారని చెప్పారు. మల్యాల ఎంపిటిసి సిహెచ్ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ రెవెన్యూ కార్యాలయంలో అవినీతి పెరిగిపోయిందని, ముఖ్యంగా గ్రామాల్లో రేషన్ డీలర్లు ప్రజాపంపిణీ సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారన్నారు. మూడపల్లిలో 3 2మందికి అహారభద్రత కార్డులను నర్సింగాపూర్‌కు వెళ్లాయని వాటిని రెవెన్యూ అధికారులు సవరించడం లేదని సర్పంచ్ గోలి శంకర్ ఆరోపించారు. మల్యాలలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని సర్పంచ్ దోంగరి భూమయ్య తెలిపారు. ఎల్లంపల్లి సాగునీటిని సనుగుల ఎర్ర చెరులు, పటేల్ చెరువులోకి మళ్లించాలని సనుగుల సింగిల్‌విండో చైర్మన్ ముస్కు ముకుందరెడ్డి అన్నారు. బండపల్లి, కిష్టంపేట రోడ్డు అధ్వానంగా మారిందని ఎంపిటిసి మంజుల తెలిపారు. అటవీశాఖ అధికారులు కలప స్మగ్లర్లతో కుమ్మకై పెద్దఎత్తున టేకు కలపను పట్టణాలకు తరలిస్తున్నారని లింగంపేట సర్పంచ్ జలగం కిషన్‌రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన గ్రామానికి రూ. 10లక్షల నిధులలో టిఆర్‌ఎస్ కార్యకర్తలకే కాకుండా సర్పంచ్‌లను కూడా భాగస్వాములు చేయాలని జోగాపూర్ సర్పంచ్ అమరబండ శ్రావణ్‌కుమార్ కోరారు. గతంలో నిర్మించిన ఇందిరామ్మ గృహాలకు బిల్లులు చెల్లించాలని మల్యాల ఎంపిటిసి రాజేశ్వర్‌రావు డిమాండ్ చేశారు. దశల వారీగా అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. త్వరలో రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. కార్యక్రమంలో ఎపివో అరుణ, ఐసిడిఎస్ సూపర్‌వైజరు రమాకళ, పంచాయతీరాజ్ అర్‌డబ్లూఎస్ ఎఈఈలు శ్రీనివాస్, బాబు, ఈవోపీఆర్డీ శైలజ, సాక్షర్‌భారత్ మండల సమన్వయకర్త అంబటి శ్రీకాంత్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు జలగం కిషన్‌రావు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.

కరాటేతో స్వీయ రక్షణ
* జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ
* రాష్ట్ర కరాటే పోటీలు ప్రారంభం
జగిత్యాల, నవంబర్ 29: శరీరంలోని అవయవాలను ఆయుధాలుగా మలుచుకొని స్వీయ రక్షణ, క్రమ శిక్షణకు కరాటే విద్య ఎంతో దోహపడుతుందని జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ అన్నారు. రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు ఆదివారం జగిత్యాలలోని రెడ్డి కళ్యాణ మండపంలో ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ తనకు కరాటే నేర్చుకోవాలని ఎంతో ఆసక్తి ఉండేదని, అప్పట్లో కరాటే శిక్షణ ఇచ్చే ఇన్‌స్ట్రక్టర్లు లేక నేర్చుకోలేకపోయానన్నారు. ప్రస్తుతం కరాటే శిక్షణ ఇచ్చే వారు ఉన్నా నేర్చుకునే సమయం దొరక్క అవకాశాలు కోల్పోతున్నారన్నారు. నేటి విద్యార్థులకు అన్ని రకాల విద్యలను నేర్చుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కరాటేలో శిక్షణ పొంది శారీరకంగా ఆరోగ్యం, మానసిక వికాసం చెంది తద్వారా మంచి విద్యను అందిపుచ్చుకొని అనుకున్న లక్ష్యాలు అధిగమించొచ్చనన్నారు. కరాటే శిక్షణ పొందితే అవయవాలు ఆయుధాలుగా స్వీయ రక్షణ, క్రమశిక్షణ దోహదపడుతుందని ఉమ పేర్కొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి సంజయ్‌కుమార్, తుల రాజేందర్‌రావు, ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, కరాటే జడ్జి రచ్చ శ్రీనుబాబు, గోవర్థన్‌రెడ్డి, రాజేందర్, సబాన్‌సంపత్, బాపురెడ్డి, సదానందం, సంతోష్ మాట్లాడుతూ జగిత్యాలలో ఎందరో విద్యార్థులు కరాటే శిక్షణ పొంది రాష్ట్ర స్థాయిలో జగిత్యాల ఖ్యాతిని చాటిచెబుతున్నారన్నారు. తెలంగాణ లోని 10 జిల్లాల నుండి 500 మంది కరాటే పోటీల్లో పాల్గొన్నారు.