మిర్చిమసాలా

సీనియర్ల సంగతో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎపి రాజధాని అమరావతిలో పాలనను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుండి సచివాలయ సిబ్బందిని, ఇతర శాఖల సిబ్బందిని తరలించడానికి రెండేళ్లుగా తపన పడుతునే ఉన్నారు. ఎట్టిపరిస్థితుల్లో అక్టోబర్ 1 నాటికి అధికారులు అంతా వెలగపూడి సచివాలయం నుండే కార్యకలాపాలు నిర్వహించాల్సిందేనని ఆదేశించారు. అక్టోబర్ 11న సిఎంఓ కార్యాలయం సైతం ప్రారంభిస్తామని, మంత్రివర్గ సమావేశం మొదలు అన్ని సమీక్షలు వెలగపూడి నుండే జరుగుతాయని ఆయన చెబుతున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. సీనియర్ ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లు మాత్రం వెలగపూడి మొహం చూడటం లేదు. ఇంకా హైదరాబాద్‌లోనే స్థిర నివాసాన్ని కొనసాగించడంపై జూనియర్‌లు మాత్రం పెదవి విరుస్తున్నారు. నిబంధనలు జూనియర్లకేనా.. సీనియర్లకు వర్తించవా..? అని వారు నిలదీస్తున్నారు. అన్నట్టు- ‘హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని’ అన్న విషయం మరిచారా? అంటున్నారు సీనియర్లు..
-బి.వి.ప్రసాద్

వెంకయ్య మాటే వేరయా!
అన్నింటా ఆ నాయుడు (చంద్రబాబు), ఈ నాయుడు (వెంకయ్య) ఒక్కరేనని ప్రతిఒక్కరూ అపవాదులేస్తుంటారు. అసలు తామిద్దరమూ ఒక్కటే అని ఎలా భావిస్తారంటూ రాజకీయ విమర్శకులను తరచూ ప్రశ్నించే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఎప్పుడు విజయవాడ నగరానికి వచ్చినా ఏదో సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై ‘సెటైర్లు’ వేయడం పరిపాటిగా మారింది. తాజాగా- ‘రాజకీయ వారసత్వం సరైంది కాదు, జవసత్వం అవసరం!.. నా వెనుక లేదు, అలాగే భవిష్యత్‌లో నా ముందుకూడా ఉండదు!.. కుమార్తె, అల్లుడు, కుమారులు, కోడళ్లలో ఏ ఒక్కరినీ రాజకీయాల్లోకి దించలేదు, ఇక దించబోను’!.. అంటూ వెంకయ్య పరోక్షంగా చంద్రబాబుకు చురకలతో కూడిన ఓ సందేశమిచ్చారు. ‘పదవులపై, మరి ఇతరత్రా దేనిపైనా నాకు ఆశలేదు. ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించకపోయినా రాష్ట్భ్రావృద్ధి కోసమే రాత్రీ పగలూ ఆలోచిస్తుంటాను. దిల్లీ నుంచి వచ్చే ప్రతిసారీ ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదో శాఖ నుంచి ఏదోఒక కొత్త జీవోను చేతబట్టుకు వస్తుంటే.. నాపై నిందలేల? విమర్శలేల?’.. అంటూ పాపం వెంకయ్య తెగ వాపోతున్నారు.
- నిమ్మరాజు చలపతిరావు

పురుషులకూ ప్రసూతి సెలవు..
హవ్వ..! పురుషులకు మెటర్నటీ లీవ్ ఏమిటి? అని విస్తుపోతున్నారా?. ఇటీవల తెలంగాణ తపాలా సర్కిల్ ఏర్పాటు కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, తాను కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళా ఉద్యోగులకు ఇచ్చే ప్రసూతి సెలవులను 12 నుంచి 26 వారాలకు పెంచినట్లు చెప్పారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, ఉద్యోగినులకు ప్రసూతి సెలవు పెంచడం బాగానే ఉంది కానీ పురుషులకు ఇవ్వరా? అని ప్రశ్నించడంతో సభికులు గొల్లున నవ్వారు. అందుకు వెంకయ్య నాయుడు స్పందిస్తూ తాను జోక్‌గా అనలేదని, గర్భవతి అయిన భార్యకు సేవ చేసుకోవడానికి భర్తకు సెలవు ఇచ్చే విషయం ఆలోచించాలని దత్తాత్రేయను కోరుతున్నానని చమత్కరించగా, సభికులు మరోసారి నవ్వారు. అదీ సంగతి.
-వి.ఈశ్వర్ రెడ్డి

ఉమా-బాబు-ఇంగ్లీష్
పాలమూరు కొత్త ప్రాజెక్టు అని ఎపి సర్కారు చెబితే, అది పాత ప్రాజెక్టే అని తెలంగాణ నిరూపించడంతో దిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రికి బాగా ప్రచారం వచ్చి, ఆంధ్రకు రాలేదని ఆ పార్టీ వారికి బాధ కలిగింది. కేంద్ర మంత్రి ఉమా భారతికి ఇంగ్లీష్ రాదు ఎలా అని తెలివిగా ఆలోచించిన బాబు హిందీ బాగా వచ్చిన అధికారిని సమావేశానికి తీసుకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ వాదనను వినిపించారు. బాబుకు హిందీ రాదు అనేది అందరికీ తెలిసిందే. అయితే వార్త రాయించిన బాబు వర్గీయులకు తెలియనిది- కేంద్ర మంత్రి ఉమాభారతి చక్కని ఇంగ్లీష్‌లో మాట్లాడుతారు అని. టిడిపి ‘లీకు వార్త’ చూడగానే నెటిజన్లు ఉమాభారతి ఇంగ్లీష్‌లో సిఎన్‌ఎన్‌ఐబిఎన్, ఎన్‌డిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలు, ఉపన్యాసాలను ‘యూ ట్యూబ్’ నుంచి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. ఏదో చేయాలనుకుంటే ఏదో అయింది మరి!
-మురళి

ఎంత ఓపిక బాబూ ..
ఓపికంటే ఎపి సిఎం చంద్రబాబును చూసి నేర్చుకోవాల్సిందే. రెండు రోజుల కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ఆయన గంటల తరబడి ప్రసంగించిన తీరును చూసి యువ కలెక్టర్లు, ఎస్పీలు ఆశ్చర్యపోయారట! గ్రామ సర్పంచ్ కూడా గుర్తించలేని సమస్యలపై చంద్రబాబు అనర్ఘళంగా మాట్లాడారు. కలెక్టర్లతో దాదాపు పది గంటల పాటు సమావేశాన్ని నిర్వహించారు. శాంతి భద్రతలపై రెండవ రోజు ఎస్పీలతో అంతే స్ధాయిలో మాట్లాడారు. అదనంగా కలెక్టర్లు, ఎస్పీలతో ఒన్ టు ఒన్ సమావేశాలు కూడా నిర్వహించారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి లేదా అంతకుముందు ముఖ్యమంత్రులు కేవలం గంట లేదా రెండు గంటల సేపు కలెక్టర్లతో మాట్లాడి వెళ్లిపోయేవారు. ఆ తర్వాత ప్రధాన కార్యదర్శి సదస్సును కొనసాగించేవారు. ఫలితాలు రావాలని ఆదేశాలు ఇస్తారు. చంద్రబాబు మాత్రం అందుకు భిన్నంగా అన్ని అంశాలపై ప్రసంగించడం నిజంగా అభినందించదగిన విషయమే. చంద్రబాబు గంటల తరబడి సమావేశాలను నిర్వహించడం చాదస్తం అనే వాళ్లు ఉన్నారు. బాబు ఓపికను బ్యూరోక్రాట్లు లోపల తిట్టుకున్నా, బయటకు మాత్రం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. దటీజ్ చంద్రబాబు.
-శైలేంద్ర