మిర్చిమసాలా

నేను ధర్మరాజును..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసెంబ్లీలో తమ పార్టీ సభ్యులు పాండవుల పాత్రను పోషిస్తున్నారని, తాను ధర్మరాజుగా వ్యవహరిస్తున్నానని సిఎల్‌పి నేత కె. జానారెడ్డి మీడియా మిత్రులను నవ్వించారు. ‘మీలో భీముడు జీవన్‌రెడ్డేనా?’ అని ఓ విలేఖరి ప్రశ్నించగా, సందర్భాన్ని బట్టి తమ పాత్రలు మారుతుంటాయని, తాను మాత్రం ఎప్పటికీ ధర్మరాజునేనని తేల్చిచెప్పారు. అయితే, అసెంబ్లీలో ప్రతిసారీ ‘అశ్వత్థామ హతః కుంజర’ అనమంటేనే తనకు కష్టమేనని జానా వ్యాఖ్యానించడంతో విలేఖరులంతా పెద్దగా నవ్వారు.
- వి.ఈశ్వర్ రెడ్డి

డబ్బుల్లేవ్ బాబూ..
కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఇప్పుడు- ‘పెద్ద’వారికి శాపంగా, పేదవారికి వరంగా మారింది. బ్యాంకులకు వెళ్లి లైన్లలో గంటల తరబడి నిల్చుని అనుభవం గడించిన సామాన్యులు ఇపుడు డబ్బును ఆదా చేయడానికి బ్యాంకులే అక్కర్లేదనే భావనకు వచ్చినట్టు కనిపిస్తోంది. ఇంట్లోనే డబ్బు దాచుకుంటున్న వారు అంతటితో ఆగకుండా ‘నగదు రహిత సమాజం’ ఆచరణలో చూపుతున్నారు. ఎవరు ఏం అడిగినా ‘చిల్లర లేదండి..’ అంటూ తప్పించుకుంటున్నారు. పెళ్లిళ్లు, పార్టీలు, యాత్రలు ఇలా అన్నింటినీ కుదించుకుంటూ చిల్లర సమస్యను తెరమీదకు తెస్తున్నారు. డబ్బు పొదుపు చేసేందుకు ‘మోదీ మ్యాజిక్’ ఇలా కలిసొచ్చిందని సంబరపడుతున్నారు.
- బివి ప్రసాద్

పోలీసుల పోటాపోటీ
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పోలీసు శాఖ అధికారులు నేర గణాంకాలను చెప్పడంలో పోటీ పడుతున్నారు. ఒకప్పుడు డిజిపి, పోలీసు కమిషనర్లే ఈ వివరాలను ప్రెస్‌మీట్లను పెట్టి చెప్పేవారు. ఎస్పీ నుంచి డిజిపి వరకు ఈ గణాంకాలను తెలియపరచడం మంచి సంప్రదాయం. ఈ రోజు ప్రతి జిల్లా ఎస్పీ కూడా ఏ కేటగిరీలో నేరాలు తగ్గాయో, పెరిగాయో చెబుతున్నారు. ప్రతి సర్కిల్‌లో కూడా సంబంధిత పోలీసు అధికారులు తమ పరిధిలో నేరాల గురించి సమాచారం ప్రకటిస్తున్నారు. ఈ ఉత్సాహం సంగతెలా ఉన్నా, మహిళలపై అత్యాచారాలు తగ్గడం లేదు. తెలంగాణలో అత్యాచారాల కేసులు 2015తో పోల్చితే 2016లో పెరిగాయి. ‘షీ’ టీమ్‌లు, టాస్క్ఫోర్స్‌లు ఎన్ని ఏర్పాటుచేసినా మహిళలపై అఘాయిత్యాలు తగ్గకపోవడం ఆందోళనకరమే.
- శైలేంద్ర

చిత్రమైన బంధం
రాజకీయ పార్టీలు ఎప్పుడు ఏకం అవుతాయో, ఎప్పుడు శత్రువులుగా ఉంటాయో తెలియని పరిస్థితి. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఇలాంటి చిత్రాలు చూసి ఎమ్మెల్యేలే విస్తుపోతున్నారు. బిజెపి, ఎంఐఎం బద్ధ శత్రువులు. కాంగ్రెస్‌పై వ్యతిరేకతే తమ పార్టీ సిద్ధాంతం అని టిడిపి దశాబ్దాల తరబడి గర్వంగా చెప్పుకుంటోంది. ఇప్పుడు శాసనసభలో దీనికి భిన్నంగా కనిపిస్తోంది. పెద్దనోట్ల ర ద్దును సిఎం కెసిఆర్ సమర్ధించడంతో టిఆర్‌ఎస్‌కు బిజెపి చేరువైంది. ఎంఐఎం ఎప్పటి నుంచో టిఆర్‌ఎస్‌కు మిత్ర పక్షం. మిగిలిన పక్షాలు సభ నుంచి వాకౌట్ చేస్తున్నా బిజెపి,ఎంఐఎం సభ్యులు సభలోనే ఉంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో సహా ఏ విషయంలోనైనా కాంగ్రెస్ వాకౌట్ చేస్తే టిడిపి సభ్యులు కూడా బయటకు వెళుతున్నారు. మనకు ‘్ఫ్లర్ కోఆర్డినేషన్ అవసరం’ అని టిడిపి నేతలు కాంగ్రెస్‌తో సమాలోచనలు జరుపుతున్నారు.
-మురళి

‘క్లియరెన్స్ సేల్’!
చేనేత కొనుగోళ్లను ప్రోత్సహించడానికి శాసనసభ, శాసనమండలిలో ప్రత్యేక కౌంటర్‌ను మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. చేనేత చీరలను మహిళా సభ్యులకు ఆయన కానుకగా అందజేశారు. తమకు మంత్రి బహుకరించిన చీరలు ఎంతో బాగున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డికె అరుణ, పద్మజారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. అసెంబ్లీ స్టాల్‌లో చీరలు బా గున్నాయని తెలిసి తెరాస ఎంపి కవిత ప్రత్యేకంగా వచ్చి డి ప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డికి పుట్టినరోజు కానుకగా చిలుకపచ్చ చీర బహుకరించడంతో పాటు కుటుంబ సభ్యులకు కొన్నారు. మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను వెంట బెట్టుకొని వచ్చి ‘షార్ట్’ కొనిపించారు. స్టాల్స్‌లో పెట్టిన వస్త్రాలు ‘క్లియరెన్స్ సేల్’ అని తెలిసి అవాక్కయ్యారు. ఈ వస్త్రాలపై ‘ఆప్కో’ లోగో ఉంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ‘ఆప్కో’ సంస్థ విడిపోయి రెండున్నరేళ్లు అయింది. అందుకే ఇది ‘క్లియరెన్స్ సేల్’ అన్న వ్యాఖ్యానాలు వినిపించాయి.
- వెల్జాల చంద్రశేఖర్